సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది.
సాక్షి, హైదరాబాద్: సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది. దీనిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జి.బేబీరాణి, పి.రోజా ఒక ప్రకటన విడుదల చేశారు.