సహాయకులను అనుమతించం
- అంధులు, నిరక్షరాస్యులకు మినహాయింపు
- వీరు 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి
- స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై జేసీ హరికిరణ్
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరికిరణ్ తెలిపారు. కర్నూలు, ఆదోని, నంద్యాల రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహాయకులను అనుమతించబోమన్నారు. అంధులు, చదువులేని, బలహీనులై ఉండి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారు సహాయకుల కోసం తగిన ఆధారాలతో ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాల్నారు. దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్(ఠీఠీఠీ.జుuటnౌౌ .్చp.జౌఠి.జీn)నుంచి పొందాలన్నారు. 18 ఏళ్లు నిండి, ఫొటో గుర్తింపు కార్డున్న వారినే సహాయకునిగా నియమించుకోవాలన్నారు.