సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి వంద శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24మంది పీపీఈ కిట్లతో వచ్చి మరీ ఓటు వేశారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు.
- 99.64% పోలింగ్ శాతం నమోదు
- మొత్తం 824 ఓట్లకి 821 ఓట్లు పోల్
- మిగతా ముగ్గురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగం
- చివరి గంటలో ఓట్లు వేసిన కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిదులు
- ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- ఈనెల 12న ఓట్ల లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment