
సాక్షి, నల్గొండ: నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచడం స్థానికంగా కలకలం రేపింది. తాజాగా భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులను ప్రలోబాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్) తదితరులు పోటీ పడుతున్నారు.
కాగా నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్‌ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చదవండి:
MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment