Graduate MLC election
-
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేనందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోవటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోయాయని పేర్ని నాని దుయ్యబట్టారు. 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి, చెడు పట్టించుకోవడంలేదని, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. 41 – ఎ నోటీసులు అందుకున్న కేసులను కూడా 307 సెక్షన్‌కు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందన్నారు. కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్‌ల కోసం చట్టాలను అతిక్రమించి, వైఎస్సార్సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.ఈ పరిస్థితులన్నీ చూశాక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్నారని, అందువల్లే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్తో పీఆర్టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు. గతంలో.. బలమున్నా బరికి దూరం మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..ఎలిమినేషన్ ప్రక్రియ
-
ఇంకా తేలని ‘ఎమ్మెల్సీ’ ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గెలుపెవరిదో? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్‌కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్‌ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది. రెండు రోజులుగా కౌంటింగ్ ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్‌గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా
నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్డేట్స్ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసిన నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్‌గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784 -
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్‌సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చపార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్‌చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు. -
కామ్రేడ్.. కథ అడ్డం తిరిగిందా?
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. లక్ష్యం ఒక్కటే. చీకటి ఒప్పందాలతో అయినా పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. తాము బలపరిచిన అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు.. 1. టీడీపీ గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీలు ఏవి? 2. పచ్చ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ నాయకులు ఎవరు? 3. సొంత పార్టీని ఫణంగా పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించింది ఎవరు? ఎందుకిలా జరిగింది? 4. నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీల మద్య కుదిరిన రహస్య ఒప్పందమేంటి..? సైద్దాంతిక నిబద్ధతను కామ్రేడులు గాలికి వదిలేశారా? 5. భవిష్యత్ ఇస్తామని పచ్చ పార్టీ చూపిన ఆశలకు లొంగిపోయారా? 6. చంద్రబాబు ప్రలోభాలకు సరెండర్ అయి వారి బలాన్ని టీడీపీకీ ట్రాన్స్ఫర్ చేశారా..? లేక డబ్బు కోసం చేతులు కలిపారా ? 7. పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ చేసిన జిమ్మిక్కులేంటి..? ఇప్పుడు ఇదే చర్చ ప్రస్తుతం వామపక్ష అభిమానుల్లో నడుస్తోంది.. గెలిచే బలమున్నప్పటికీ.. ఎందుకు టీడీపీ అభ్యర్దికి సహకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. తమను తాకట్టు పెట్టుకుని బాబుకు జై కొట్టారా? తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పీడీఎఫ్ అభ్యర్దుల గెలుపు ఖాయమనే భావన ఉండేది. గత పదిహేను సంవత్సరాలుగా ఈ రెండు స్థానాల్లో వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్దులే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలోకి దిగడంతో పీడీఎఫ్ అభ్యర్దులకు ముచ్చెమటలు పట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్దమైంది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది చంద్రశేఖర్ రెడ్డిని, పట్టభద్రుల అభ్యర్ది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదిపింది. డిపాజిట్లు అయినా సంపాదించుకోవాలనుకుంటున్న టీడీపీ వారితో జతకట్టింది.. ఇరు వర్గాల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరింది. రెండుసార్లు గెలిచిన పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థులు ఓడి, టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. రాజకీయం ఎన్ని మలుపులు తిరిగింది? కామ్రేడ్స్ సైద్దాంతిక విలువలను గాలికొదిలేశారనే విమర్శలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్ళ నుంచి ఇక్కడి స్థానాల్లో విజయం సాదిస్తున్న పీడీఎఫ్ అభ్యర్దులకు సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. కానీ వారు తమ బలాన్ని ఈసారి టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి మంత్రి పొంగురు నారాయణ అనుచరుడు పట్టాభి బరిలోకి దిగాడు. నారాయణ విద్యాసంస్థలతో కోట్లు ఖర్చుచేయగల సత్తా ఉన్నప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ టచ్ చెయ్యలేకపోయింది.. పట్టాభిని పీడీఎఫ్ అభ్యర్దులు కామెడీగా పక్కకి నెట్టేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచింది.. గత ఎన్నికల్లో నారాయణ విద్యాసంస్థలనే ఢీకొట్టిన వామపక్షాలు... ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం వెనుక కుల సమీకరణాలు బాగా పనిచేశాయనే టాక్ నడుస్తోంది. వామపక్ష పార్టీలను లీడ్ చేసేది కూడా చంద్రబాబునాయుడి సామాజికవర్గమే కావడంతో జగన్ ను ఎదుర్కొనేందుకు వారంతా ఒక్కటయ్యారనే చర్చ కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతోంది. మన వాళ్లు కక్కుర్తి పడ్డారు కమ్యూనిస్టులు తెరచాటు రాజకీయం చెయ్యడం వల్లనే టీడీపీ అభ్యర్ది శ్రీకాంత్ విజయం సాధ్యమైంది. అనామకుడుగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన శ్రీకాంత్ కు కామ్రేడ్స్ సాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయం వెనుక భవిష్యత్ లో ఏమైనా పదవులు రావొచ్చు.. లేదంటే భారీగా లబ్ది అయినా చేకూరి ఉండొచ్చని నెల్లూరులో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తాము బలపరిచిన అభ్యర్థినే త్యాగం చేసిన కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార సరళిని వామపక్ష అభిమానులే చీదరించుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కొనసాగుతున్న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, అనంతపురం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించనున్నాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొదటి ప్రాధాన్యతా ఓట్లలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి శనివారం తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. -
పశ్చిమ రాయలసీమ ‘పట్టభద్రుల’ కౌంటింగ్‌పై అనుమానాలు
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పలు అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతల ప్రలోభాలతో కొందరు ఉద్యోగులు వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ బాక్సుల్లో వేస్తున్నారని వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కౌంటింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరు ఓట్లను టీడీపీ బాక్సుల్లో ఒక ఉద్యోగి వేయడం అనుమానాలకు తెరలేపింది. దీనిపై రీకౌంటింగ్ చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేథన్‌గార్గ్‌కు లిఖిత పూర్తకంగా వినతి ప్రతం అందజేశారు రవీంద్రారెడ్డి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా వెర్రి తలలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా పైశాచిక ఆనందం పొందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా లెక్కింపు జరిగినట్లు రోత రాతలు రాస్తోంది. పట్టభద్రల ఓట్లన్నంటినీ కలిపి లెక్కిస్తున్నప్పటికీ జిల్లాలు, నియోజకవర్గాల వారిగా లెక్కింపు జరుగుతుందని అసత్యపు రాతలు రాస్తోంది. పులివెందులలో టీడీపీ మెజారిటీ అంటూ పచ్చ మీడియా తన పైత్యాన్ని మరోసారి బయటపెట్టింది. వాస్తవాన్ని వక్రీకరించి ఎల్లో మీడియా వికృత ప్రచారానికి దిగింది. -
AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
Updates: ►ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంవీ రామచంద్రారెడ్డి ►కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ►పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గానికి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 తేదీ వరకు (సెలవు దినాలు మినహా) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు.. ►ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల నిర్వహణకు అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. వివరాలిలా ఉన్నాయి. ►జి.వెంకటేశ్వర్లు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకర ణ): బ్యాలెట్‌పత్రాలు, బ్యాలెట్‌బాక్సుల తయారీ. ►పి.సరోజ(అడిషనల్ కమిషనర్, పరిపాలన): ఎన్నికల సామాగ్రి సేకరణ. ►సంధ్య(జేసీ, శానిటేషన్): ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది. ►పద్మజ( సీఎంఓహెచ్):హెల్త్‌కేర్ కార్యక్రమాలు,కోవిడ్ నిబంధనలు. ► కె.నర్సింగ్‌రావు:( డీఈఈ, ఐటీ): వెబ్‌క్యాస్టింగ్,ఐటీ సంబంధిత అంశాలు. ►శ్రుతిఓజా (అడిషనల్ కమిషనర్), సౌజన్య( పీడీ), యూసీడీ: శిక్షణ కార్యక్రమాలు ►ఎన్.ప్రకాశ్‌రెడ్డి (డైరెక్టర్, ఈవీడీఎం): ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతలు,వాహనాలు ►మహ్మద్ జియా ఉద్దీన్(ఈఎన్సీ): పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ►ముర్తుజాఅలీ(సీపీఆర్ఓ): ఓటరు అవగాహన కార్యక్రమాలు, మీడియాసెల్, పెయిడ్‌న్యూస్ ►బాషా(ఎస్టేట్ ఆఫీసర్): 24 గంటల ఫిర్యాదుల విభాగం, కాల్‌సెంటర్ ఫిర్యాదుల పరిష్కారం ►మహేశ్ కులకర్ణి( చీఫ్వాల్యుయేషన్ఆఫీసర్): రిపోర్టులు ► విజయభాస్కర్‌రెడ్డి(పర్సనల్ ఆఫీసర్): పోస్టల్‌బ్యాలెట్ 25న స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో 118 మంది ఓటర్లున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్యసభల సభ్యులు ఓటర్లు. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించి తుదిజాబితా 25న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోటాలోని ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్జాఫ్రి పదవీకాలం మే 1వ తేదీతో ముగియనున్నందున ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. -
ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీ ఓటమికి కారణాలివే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు ఓటమికి అనేక కారణాలున్నాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాషాయ పార్టీకి ఉమ్మడి మహబూబ్‌నగర్ ఓట్లే దెబ్బతీశాయని తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఆ పార్టీ అభ్యర్థికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని.. మహబూబ్‌నగర్‌లో మాత్రం ఆశించిన మేరకు రాబట్టలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించిన బీజేపీకి పట్టభద్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిరుద్యోగం, పీఆర్సీని ప్రధాన ఎజెండాగా చేసుకున్న ఆ పార్టీ నేతలు వాటినే ప్రధాన అంశాలు చేసుకుని ప్రచారం నిర్వహించారు. అంతే తప్పా తమ వైపున ఉన్న తప్పులను సరిదిద్దుకునే పని చేయలేదనే ఆవేదన బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపునకు కలిసివచ్చాయని గుర్తించారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఆమెకు కలిసొచ్చింది. ఈ సరళిని పరిశీలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కంటే పూర్వ పాలమూరులో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 2015లో 55శాతం పోలింగ్ జరిగితే ఈసారి ఏకంగా 78.47శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెంపునకు అధికారుల అవగాహనతో పాటు టీఆర్ఎస్ కారణమని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలూ ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులను గుర్తించి వారికి ఓటు కోసం దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పోలింగ్ రోజున వారిని వెంట తీసుకెళ్లి వేయించడంలో కీలకంగా వ్యవహరించారు. పెరిగిన ధరల ప్రభావం ఇక బీజేపీ నేతలు మాత్రం పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ, వారితో ఓటు వేయించేలా చర్యలేవీ తీసుకోలేపోయారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఉండటం బీజేపీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాంచందర్‌రావు ఉమ్మడి జిల్లాలో అంతగా పర్యటించలేదనే అపవాదు ఉంది. ఇదీ ఈ ఎన్నికల్లో కాస్తా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. పెరిగిన ధరలతో పట్టభద్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వద్దనుకున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించినట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే పీఆర్సీ వరిస్తుందని ఉద్యోగులు నమ్మి ఆ పార్టీ అభ్యర్థి వాణీదేవికే ఓటేశారు. అన్నిటికంటే మించి ఉమ్మడి జిల్లాలో కాషాయ నేతల్లో కొరవడిన సమన్వయం, వర్గ విభేదాలూ రాంచందర్‌రావు ఓటమికి కారణాలే. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు అభ్యర్థి తరపున ప్రచారం విషయంలో అంటీముట్టినట్టుగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సీనియర్, జూనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇటీవలే బట్టబయలయ్యాయి. దీంతో బీజేపీ క్యాడర్ సైతం ఊహించినంత ప్రచారం చేయలేదు. చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే! ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం -
ఎమ్మెల్సీ కౌంటింగ్: మూడో ప్రాధాన్యం తప్పదా?
సాక్షి,నల్లగొండ: నల్లగొండ– వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదురౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ ఐదురౌండ్లలో 2,79,970 ఓట్లను లెక్కించగా, వాటిలో 15,533 ఓట్లు చెల్లకుండాపోయాయి. చెల్లిన 2,64,437 ఓట్లలో పల్లా 79,113 ఓట్లు సాధించా రు. ఆయనకు 18,549 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెస ర్ కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. నిర్ణయం కాని కోటా ఈ స్థానానికి జరిగిన పోలింగ్‌లో 3,86,320 ఓట్లు పోల్ కాగా, వీటికి అదనంగా మరో 1,759 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చి చేరాయి. దీంతో 3,88,079 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్య ఓట్లన్నీ లెక్కించాక కానీ, చెల్లని ఓట్లు ఎన్నో తేలే అవకాశం లేదు. చెల్లని ఓట్లు తీసేశాకనే.. చెల్లిన ఓట్లలో యాభై శాతం ప్లస్ ఒక ఓటును కోటాగా నిర్ణయించనున్నారు. అనధికారిక అంచనా మేరకు ఈ కోటా 1.82 లక్షల ఓట్లు కావొచ్చని అంటున్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించే అవకాశం ఏ అభ్యర్థికీ కానరావడం లేదు. ప్రతిరౌండ్‌లో 15 వేల పైచిలుకు ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి వస్తున్నాయి. ఇప్పటికే 79,113 ఓట్లు ఆయన ఖాతాలో పడగా.. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సరాసరి ఇదేస్థాయిలో రెండు రౌండ్లలో కూడా 15 వేల చొప్పున టీఆర్ఎస్కు వస్తే.. పల్లాకు దాదాపు 1.10 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయన విజయానికి మరో 70 వేల ఓట్ల దూరంలో ఉండిపోతారనుకుంటే.. ఆ ఓట్లన్నీ రెండో ప్రాధాన్యంలో రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు రాని పక్షంలో మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి ఉంటుంది. పార్టీల లెక్కలివీ...! ఇప్పటి వరకు రౌండ్ల వారీగా వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు దాదాపు 30 శాతం ఓట్లు పోల్ అవుతున్నాయి. ఆయన 18,549 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఐదు రౌండ్లలో వచ్చినట్లే సరాసరి 3,500 ఓట్ల లీడ్ మిగిలిన రెండు రౌండ్లలో వస్తే, ఆయన మెజారిటీ కనీసం 25 వేలకు చేరుతుందని అంచనా. రెండో స్థానంలో ఉన్న మల్లన్న విజయం సాధించాలంటే పల్లాతో ఉన్న తేడా(లీడ్) 25 వేల ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 28 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. మూడోస్థానంలో ఉన్న కోదండరాం విజయం సాధించాలంటే.. తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే సాధ్యమైనన్ని ఎక్కువ రెండో ప్రాధాన్య ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యంలో కూడా విజేత తేలకపోతే.. తొలి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల నుంచి ఒకరు ఎలిమినేషన్‌కు గురవుతారు. అలా ఎలిమినేషన్‌కు గురైన అభ్యర్థి ఓట్లలోని మూడో ప్రాధాన్యాన్ని మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పోల్ అయితే ఎవరి ఓట్లను వారికి కలిపి విజేతను ప్రకటిస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు.
-
తెలంగాణ ఎమ్మెల్సీ: డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా
సాక్షి, నల్గొండ: నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచడం స్థానికంగా కలకలం రేపింది. తాజాగా భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులను ప్రలోబాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్) తదితరులు పోటీ పడుతున్నారు. కాగా నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
‘గ్రాడ్యుయేట్లు’ 10 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, ప్రతినిధి నల్లగొండ: రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానాల్లో ఓటర్ల నమోదుకు శుక్రవారంతో గడువు ముగిసిపోగా, దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్–ఖమ్మం–నల్ల గొండపట్టభద్రుల శాసనసభ నియోజకవర్గానికి 4,70,150 మంది, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గానికి 4,71,772 మంది కలిపి మొత్తం 9,41,922 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన కాగితపు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తైతే, మొత్తం దరఖాస్తుల సంఖ్య 10 లక్షలకు మించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వర్గాలు తెలిపాయి. వరంగల్ నియోజకవర్గం పరిధిలో భారీ సంఖ్యలో ఆఫ్‌లైన్ దరఖాస్తులు రావడంతో వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే మహబూబ్‌నగర్ స్థానం కన్నా వరంగల్ స్థానం పరిధిలోనే అధిక దరఖాస్తులు రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. మళ్లీ డిసెంబర్ 1 నుంచి 31 వరకు కొత్తగా ఓటర్ల నమోదు కోసం పట్టభద్రుల నుంచి దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వచ్చే జనవరి 12లోగా ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి, అదే నెల 18న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్లోనే ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల అవకాశం కల్పించిందని, అయితే ఈ మేరకు హైకోర్టు కొత్తగా గడువు పొడిగించినట్టు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చాయని సీఈఓ కార్యాలయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
‘ఎమ్మెల్సీ’ ఎన్నికలు.. బీజేపీ పోటాపోటీ!
సాక్షి, వరంగల్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. సీనియర్ నేత పేరాల శేఖర్‌రావు కూడా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం. కాగా ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్న సీనియర్లు టికెట్ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కేడర్‌లో చర్చ నడుస్తోంది. వరంగల్ స్థానంపై గెలుపు ఆశలు.. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపైనా బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహన్రావు రెండో స్థానంలో నిలిచారు. గట్టిపోటీనిచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుండా టీఆర్ఎస్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీని యర్ నేతలు బీజేపీలో చేరారు. రాజ్యసభ సభ్యుడైన గరికపాటి రామ్మోహన్రావు కూడా ఉండటం ప్లస్ పాయింట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి సీనియర్ నేతల బలం ఉండటంతో గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే ఈసారి ఇక్కడి నుంచి పోటీకి బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇనుగాల పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపికపై వడపోత.. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కమలం గురి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటుతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ సిట్టింగ్ సీటును తిరిగి గెలుచుకోవడంతో పాటు వరంగల్ ఎమ్మెల్సీ సీటునూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్లను పార్టీ నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి రెండు పర్యాయాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం, కార్మిక సంఘాలకు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. వరంగల్‌లో విదాసంస్థలున్న పెద్దిరెడ్డికి రాజకీయంగా మంచి పేరుంది. ఇక టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా, ఆ పార్టీ జాతీయ వ్య వహరాల్లో పాల్గొని బీజేపీలో చేరారు. ఈయనకు సుధీర్ఘ రాజకీయ అనుభ వం, పరిచయాలు ఉన్నాయి. బీజీపీలో వివిధ కేడర్లలో పనిచేస్తూ ఎదిగిన సీనియర్లు గుజ్జు ల ప్రేమెందర్‌రెడ్డి, పేరాల శేఖర్రా వు, నల్గొండకు చెందిన మనోహర్‌రెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. పోటా పోటీ ప్రయత్నాల్లో ఎవరికీ అవకాశం దక్కుతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
పీసీసీ చీఫ్ మార్పు గురించి చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ మార్పు వంటి అంశాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘మా లక్ష్యం మిషన్-2023. మోదీ, కేసీఆర్ విధానాలపై పోరాడతాం. సిస్టమేటిక్ టీం వర్క్‌తో ముందుకు వెళతాం. తెలంగాణలో సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు పాటించాలి. దేశంలోని ప్రతి గవర్నర్ మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ మాత్రం వినతి పత్రం తెలుసుకోలేదు. గవర్నర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ కోరాం.. ఇవ్వలేదు. కోవిడ్ ఒక్క తెలంగాణలోనే లేదు. వినతిపత్రం మెయిల్ చేయమని చెప్పారు. కార్యకర్తల, నేతల మధ్య ఐక్యత కీలకం’ అన్నారు. (చదవండి: 2023లో అధికారమే లక్ష్యం ) దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టాయి. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. కుందేలు- తాబేలు కథలో.. చివరకు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అన్నారు. తెలంగాణ నేతలను ఇండియన్ క్రికెట్ టీంతో పొల్చారు. కాంగ్రెస్‌లో గ్రూపులపై స్పందిస్తూ.. ఐక్యతతో 2023 లో గెలుస్తామని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం అన్నారు. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమి చెప్పలేనన్నారు మాణిక్యం ఠాగూర్. -
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలోని ఉభయగోదావరి- కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించకపోవటంతో దాదాపు 93 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,93,794 మంది ఓటర్లుండగా.. బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లుండగా.. 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. విశాఖ-విజయనగరం- శ్రీకాకుళం ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నామినేషన్లు వేసారు. తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు.. పట్టభద్రుల కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మద్దతుతో గ్రూప్ వన్ ఆఫీసర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. లక్షా 96వేల321మంది పట్టభద్రులు, 23వేల 214మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇద్దరిమ ధ్యే పోటీ కనిపిస్తోంది. పీఆర్టీయూ నుంచి పూల రవీందర్‌ను టీఆర్ఎస్ బలపరుస్తోంది. యూటీఎఫ్ మద్దతుతో అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. -
పట్టభద్రుల పీఠం ఎవరిదో?
విశాఖపట్నం : హోరాహోరీగా సాగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. గురువారం జరిగే పోలింగ్ కోసం ఓ పక్క అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా మరోపక్క అభ్యర్థులు ఎవరికి వారు చివరి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డా రు. బరిలో నిలిచిన అభ్యర్థులు తలరాతలు రాసేందుకు పట్టభద్రులు సిద్ధమవుతున్నారు. వరుసగా రెండుసార్లు పీడీఎఫ్ పాగా 2007లో 20 మంది తలపడగా, 2011లో 31 మంది తలపడ్డారు. ఈ రెండుసార్లు కూడా పీడీఎప్ తరపున బరిలోకి దిగిన ఎంవీఎస్ శర్మ విజయకేతనం ఎగురవేశారు. ఈ రెండుసార్లు కూడా బీజేపీ, టీడీపీలు తమ మద్దుతుదారులను రంగంలోకి దింపి గెలిచేందుకు విఫలయత్నం చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతోపాటు మేధావుల్లో సైతం పట్టున్న వామపక్షాలు గత రెండు ఎన్నికల్లో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా లెక్కచేయకుండా సిద్ధాతాలకు కట్టుబడి శర్మను గెలిపించుకున్నారు. ఈసారి శర్మ స్థానంలో మరో సీనియర్ వామపక్ష నాయకుడు అవధానుల అజాశర్మను బరిలోకి దింపారు. ఉద్యోగ, కార్మిక ఉద్యమాల్లో దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన అజాశర్మను పోటీకి దింపడంతో మొదటినుంచే వారి ప్రచారం ఊపందుకుంది. మరో వైపు అజాశర్మకు వైఎస్సార్సీపీ మద్దతు పలకడం మరింత బలం చేకూర్చింది. ఈసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలన్నీ ఐక్యతను చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీపై వ్యతిరేకతే శాపం మరోవైపు టీడీపీ–బీజేపీ తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేత పీవీఎన్ మాధవ్‌ను రంగంలోకి దించాయి. గతంలో విడివిడిగా పోటీ చేసి విపలమైన ఈ రెండు పార్టీలు ఈసారి ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా వామపక్షాల చేతుల్లో నుంచి ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించాయి. ప్రచారంలో చమటోడ్చాయి. చివరకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో సహా ఉత్తరాంద్ర, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మాధవ్ కోసం అలుపెరగని రతిలో ప్రచారం చేశారు. ఓ పక్క మాధవ్ గెలిస్తే ఎక్కడ తమకు పక్కలో బల్లెంలా తయారవుతాడని ఆందోళన లోలన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి మేరకు లోపల కత్తులు దూస్తూనే పైకి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తూనే ప్రచారం సాగించారు. మరోపక్క మాధవ్‌కు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ నగరాధ్యక్షుడు నాగేంద్ర, çపృధ్వీరాజ్, రామకోటయ్య వంటి పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎంపీ కే.హరిబాబు సైతం నామిషన్ సందర్భంలోనూ, కేంద్రమంత్రి వచ్చినప్పుడు తప్ప ఆ తర్వాత కన్పించలేదు. కాగా మాధవ్‌కు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, విభజన చట్టంలోని హామీలు అమలుకాకపోవడం గుదిబండగా మారాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి మంగళవారం రాత్రి అమరావతిలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ మాధవ్ గెలిచే అవకాశం లేదని అన్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సవాల్ విసిరన స్వతంత్రుడు ఇద్దరు బలమైన అభ్యర్థులను సవాల్ చేస్తూ మేధావులు, జర్నలిస్టు సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ జర్నలిస్టు వీవీ రమణమూర్తి కూడా విజయంపై ధీమాతోనే ఉన్నారు. కానీ ఈయనకు మద్దతునిస్తున్న జర్నలిస్టు సంఘాలు కానీ, సామాజిక వర్గీయుల్లో కానీ ఎంతమంది ఓటుహక్కు కలిగి ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. 2007లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్న యడ్ల ఆదిరాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించకుంటున్నారు. మిగిలిన 26 మంది పోటీ నామమాత్రమే.