వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన
గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన
ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా ర్వహించే పరిస్థితి లేదు
కనీసం ఓట్లు అడిగే స్వేచ్ఛను డా కాల రాశారు
కూటమి నేతలకు పోలీసులు వేట్ సైన్యమయ్యారు
అందుకే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
వైఎస్సార్‌సీపీ నేతల స్పషీ్టకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేనందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోవటం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోయాయని పేర్ని నాని దుయ్యబట్టారు. 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి, చెడు పట్టించుకోవడంలేదని, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. 41 – ఎ నోటీసులు అందుకున్న కేసులను కూడా 307 సెక్షన్‌కు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందన్నారు. కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్‌ల కోసం చట్టాలను అతిక్రమించి, వైఎస్సార్‌సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.
ఈ పరిస్థితులన్నీ చూశాక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్నారని, అందువల్లే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment