boycotts
-
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డీనేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.కాన్ఫరెన్స్‌లో నేతలు ఏం చెప్పారంటే..సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారుపోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్‌కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేనందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనబోవటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారిపోయాయని పేర్ని నాని దుయ్యబట్టారు. 5 నెలల్లో 100 మందికి పైగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి, చెడు పట్టించుకోవడంలేదని, ఎన్నికల హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిందని దుయ్యబట్టారు. 41 – ఎ నోటీసులు అందుకున్న కేసులను కూడా 307 సెక్షన్‌కు మార్చి, అక్రమంగా జైళ్లకు పంపి దారుణంగా వేధిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారిందన్నారు. కిరాతకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కూటమి నాయకుల వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా పోలీసులకు లేకుండా పోయిందని చెప్పారు. పోస్టింగ్‌ల కోసం చట్టాలను అతిక్రమించి, వైఎస్సార్సీపీ జెండా పట్టినా, ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆక్షేపించారు.ఈ పరిస్థితులన్నీ చూశాక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఓట్లడిగే స్వేచ్ఛను కాలరాసేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చివరకు గెలుపును కూడా ఓటమిగా మార్చే దౌర్జన్య విధానాలు అవలంబిస్తున్నారని, అందువల్లే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని పేర్ని నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్‌తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
ఆ గ్రామం ఎన్నికలను బహిష్కరించింది..అక్కడ ఎవరూ ఓటు వేయరు!
న్యూఢిల్లీ: వాయువ్య ఢిల్లీలోని ఒక గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఓటు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు అక్కడి ప్రజలు. ఈ మేరకు ఢిల్లీలోని వాయువ్య జిల్లాలోని కతేవారా గ్రామంలోని ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బహష్కరించారు. తమ ప్రాంతంతో రోడ్లు, డ్రైయిన్లతో సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరసనగా గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. డిసెండర్ 4 ఆదివారం ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే కతేవారా గ్రామస్తులు అధికారులు తమ గోడు పట్టించుకునేంత వరకు ఓటు వేయమని కరాకండీగా చెప్పారు ప్రజలు. ఈ మేరకు అక్కడి గ్రామస్తులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని పాలకవర్గంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు రోడ్లను నిర్మించాలని కోరుతున్నాం. తాము ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. మా డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం. అని చెప్పారు. ఇక అక్కడి ప్రజలు మున్సిపల్ ఎన్నికలు రోజంతా తమత పనులు చేసుకుంటూ గడిపారు. కాగా, మూడు పౌర సంస్థలను విలీనం తర్వాత డిల్లీలో జరుగుతున్న తొలి పౌర ఎన్నికలు ఇవి. (చదవండి: చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు) -
పరీక్షలను బహిష్కరించిన విద్యార్థినులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి, తుమకూరు, కొడగు తదితర ప్రాంతాల్లో మంగళవారం విద్యార్థినులు నిరసనకు దిగారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు మత చిహ్నాలతో విద్యాలయాల్లోకి రాకూడదని ఉపాధ్యాయులు, పోలీసులు చెప్పడంతో తమకు సంప్రదాయమే ముఖ్యమని కొందరు విద్యార్థినులు తరగతులను, ప్రిపరేటరీ పరీక్షలను బహిష్కరించారు. ఉడుపి జిల్లా కాపు మల్లారు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి తరగతిలోకి ప్రవేశించేందుకు విద్యార్థినులు అంగీకరించలేదు. చివరికి హిజాబ్ ధరించి పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను విద్యార్థినులు రాశారు. శివమొగ్గ నగరంలోని కేపీఎస్ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తీసేయడం ఇష్టం లేదని తరగతులను బహిష్కరించి ఇద్దరు విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. చిక్కమగళూరు మౌలానా ఆజాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థినులు పాఠశాలలో బైఠాయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చెలరేగింది. పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గదగ్ జిల్లాలోనూ ఒక పాఠశాలలోనూ కొందరు బాలికలు నిరసన తెలిపారు. దావణగెరె జిల్లా హోన్నాళిలో 50, చెన్నగిరలో 30, నల్లూరిలో 20, హరిహరలో 23 మంది విద్యార్థినులు హిజాబ్ తీసేందుకు నిరాకరించి, తమకు మత సంప్రదాయమే ముఖ్యమని తరగతులను బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు.తుమకూరు ఎస్వీఎస్ స్కూల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ‘అల్లా హు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. జగత్‌లోని ఉర్దూ పాఠశాలకు 80 మందికి పైగా విద్యార్థినులు గైర్హాజరయ్యారు. రాయచూరులో చదువుతో పాటు తమకు హిజాబ్ కూడా ముఖ్యమని, హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో గొడవకు దిగారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తాం.. హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును కచ్చితంగా అమలు చేస్తామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం హిజాబ్ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు యు.టి.ఖాదర్ లేవనెత్తారు. హైకోర్టు ఉత్తర్వును పాటించే విషయంలో క్షేత్రస్థాయిలో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు. ఆ మత సంస్థలపై కఠిన చర్యలు.. సమాజంలో అలజడి సృష్టిస్తూ, అమాయక విద్యార్థుల మనసుల్లో విష బీజాలు నాటుతున్న మత సంస్థలను గుర్తించి, వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జ్ఞానేంద్ర మంగళవారం చెప్పారు. చర్యలు తీసుకోవాలి.. హిజాబ్ రగడ వెనుక ఉన్న సంస్థలు, శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని కలిశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు భారీగా పెంచాలని కోరారు. హిజాబ్ మత వ్యక్తీకరణ కాదు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉడుపిలోని పీయూసీ ప్రభుత్వ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. భారత్‌లోని లౌకికవాదం సానుకూలమైనదని, టర్కీ తరహా లౌకికవాదం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హిజాబ్ వివాదంపై హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తమ ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. -
తీరు మారని చైనా
అధీన రేఖ వద్ద తలెత్తిన ఘర్షణలపై భారత్, చైనాల మధ్య చర్చలు జరిగి నెల్లాళ్లు కాలేదు. చైనా నిర్వహిస్తున్న వింటర్ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా తదితర దేశాల పిలుపును మన దేశం వ్యతిరేకించి రెండు నెలలు కాలేదు. అయినా చైనా ఎప్పటిలాగే తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఈ వేడుకల వేళ భారత్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు నిశ్చయించుకుంది. గాల్వాన్ లోయలో మన సైనిక దళాలపై దాడికి దిగి 20 మందిని పొట్టనబెట్టుకున్న తన ఆర్మీ రెజిమెంట్ కమాండర్‌ను శుక్రవారం నిర్వహించిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్స్ జ్యోతి చేతబూనేందుకు ఎంపిక చేసింది. ఇందుకు నిరసనగా మన దేశం ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు ముగింపు వేడుకలను కూడా బహిష్కరించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్ ఆటల చరిత్ర గమనిస్తే వివాదాలు రాజుకోవడం కొత్తేమీ కాదు. అప్పటి జాత్యహంకార దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజిలాండ్ రగ్బీ టీమ్‌ను 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమ తించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆఫ్రికా ఖండ దేశాలు ఆ క్రీడలను బహిష్కరించాయి. జర్మనీ లోని మ్యూనిక్‌లో 1972లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలపై పాల స్తీనా ఉగ్రవాద సంస్థ ‘బ్లాక్ సెప్టెంబర్’ పంజా విసిరింది. 9 మంది ఉన్న ఇజ్రాయెల్ టీమ్‌ను బందీలుగా పట్టుకుంది. తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ క్రీడాకారులు మరణించారు. అఫ్గానిస్తాన్‌లో అప్పటి సోవియెట్ యూని యన్ దురాక్రమణను నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు బహిష్క రించాయి. క్రీడాకారులు కొందరు తమ ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఒలింపిక్ వేదికలపై ప్రకటనలు చేసిన ఉదంతాలున్నాయి. ఆతిథ్యమిచ్చే దేశాలు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయన్న అంచనాతో అప్రమత్తంగా ఉంటాయి. కానీ చైనా తీరు ఇందుకు విరుద్ధం. తానే స్వయంగా సమస్య రాజేసి చరిత్ర సృష్టించింది. తనతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఒలిం పిక్స్ క్రీడల విషయంలో అండగా నిలిచిన భారత్‌ను అవమానపరచడానికి ఆ దేశం పూనుకుంది. ఆతిథేయ దేశంలో చోటుచేసుకుంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలనూ, దాని దురాక్రమణ పోకడలనూ అంతర్జాతీయ క్రీడల వేడుకలప్పుడు అజెండాలోకి తెస్తే ఆ దేశం నగుబాటు పాలవు తుందన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. దానికి తగ్గట్టే చైనా తీరుతెన్నులున్నాయి. ఆర్థిక రంగంలో అమెరికాతో పోటీపడుతూ, దాని ప్రభావాన్ని క్రమేపీ క్షీణింపజేయటంలో విజయం సాధిస్తున్న చైనాకు అహంభావం ఎక్కువైంది. అకారణంగా తన ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలకు దిగే ధోరణి పెరిగింది. దక్షిణ చైనా సముద్రంలో జపాన్‌తో తగువు, అధీన రేఖ వద్ద మన దేశంతో ఘర్షణలు, హాంకాంగ్‌లో మానవహక్కులను కాలరాయటం, పశ్చిమ షిన్జియాంగ్లోని వీగర్ ముస్లింలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ, వారిని నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలకు గురిచేయటం తదితర అంశాల్లో చాన్నాళ్లుగా ప్రపంచ దేశాలు చైనాను నిలదీస్తున్నాయి. వాస్తవానికి వింటర్ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా పిలుపు ఈ నేపథ్యంలో చాలా చిన్నదని చెప్పుకోవాలి. ఒకపక్క తమ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో అన్ని ఈవెంట్లలోనూ పాల్గొంటుండగా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలప్పుడు దౌత్య సిబ్బంది పోరాదని మాత్రమే నిర్ణయించటం వల్ల ఒరిగేదేమిటన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే వర్తమాన ప్రపంచీకరణ యుగంలో ఒలింపిక్స్ క్రీడల వంటి సందర్భాలను పూర్తిగా బహిష్కరించటం సాధ్యమయ్యే పని కాదు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించినంత తేలిగ్గా ఇప్పుడు వ్యవహరించటం అమెరికాకు సాధ్యపడదు. అప్పట్లో అమెరికా–సోవియెట్లమధ్య ఎలాంటి ఆర్థిక బంధమూ లేదు. కానీ ఎన్ని తగువులున్నా, ఎంతగా నిందించుకుంటున్నా అమెరికా–చైనాలు ఇప్పుడు పరస్పర ఆధారిత దేశాలు. ఆ రెండింటిలో ఎవరు తెగదెంపులకు ప్రయత్నించినా రెండు దేశాలూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయి. అందుకే అమెరికా తెలివిగా ‘పరిమిత స్థాయి’ బహిష్కరణ మంత్రం పఠించింది. అలాగని అది ఊరుకోలేదు. తన దారిలోనే ఇతర దేశాలూ నడవాలని పిలుపునిచ్చింది. వీటిని ‘నరమేథ క్రీడలు’గా అభివర్ణించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడలను ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా సజావుగా పూర్తి చేయటం కత్తి మీద సామే. ఒకపక్క కోవిడ్ భూతం కాచుక్కూర్చుంది. క్రీడల కోసం ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది వచ్చి, అక్కడ వైరస్ వ్యాపిస్తే తదనంతరకాలంలో ప్రపంచ మంతా చైనానే తప్పుపడుతుంది. దానికి తోడు ఒలింపిక్స్ వేదికపై అసమ్మతి జాడలు కనబడకుండా వేయి కళ్లతో చూడాలి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కూడా అది భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికి కారణం ఉంది. గాల్వాన్ లోయ ఘర్షణల్లో తమ సైనికులు కేవలం నలుగురు మాత్రమే మర ణించారని చైనా అప్పట్లో చేసిన ప్రకటన ఉత్త బుకాయింపేనని ఆస్ట్రేలియా పత్రిక తాజాగా బయటపెట్టింది. ఆ ఉదంతంలో 38 మంది చైనా సైనికులను భారత్ సేనలు మట్టుబెట్టాయని వెల్లడించింది. వింటర్ ఒలింపిక్స్ వేళ చైనాకు ఇది మింగుడుపడని విషయం. అందుకే ఏరికోరి ఒలింపిక్ జ్యోతిని తీసుకెళ్లే బృందంలో అప్పటి ఆర్మీ రెజిమెంట్ కమాండర్‌ను చేర్చి ఉండొచ్చు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలు బెడిసికొడతాయని, అంతిమంగా తాను ఏకాకినవుతానని చైనా గ్రహించటం ఉత్తమం. -
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
-
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ చర్యలు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో 100 వడ్డెర కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గతంలో స్మశానవాటికలో తవ్వకాలను వడ్డెర కులస్తులు అడ్డుకున్నారు. తవ్వకాలను అడ్డుకోవడంతో వడ్డెర కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ కక్ష పెంచుకుంది. వడ్డెర కులస్తులతో మట్లాడినా, కిరాణ సరుకులు అమ్మినా రూ.10 వేలు జరిమానా విధించింది. దీంతో న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను వడ్డెర కులం వారు వేడుకున్నారు. వడ్డెర కుటుంబాలను బహిష్కరించిన మునిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వడ్డెర సంఘం సభ్యులు నిరసన చేపట్టారు -
జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?
సౌతాంప్టన్: భారత జట్టు మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రపంచకప్‌లో రేపు భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్ కోహ్లి కాకపోయినా, హెడ్‌కోచ్ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్ క్రికెటర్ ఎవరైనా వస్తారని ఆశించారు. తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను సంప్రదించగా... భారత్ ప్రపంచకప్ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బుమ్రాకు డోప్ టెస్టు: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సోమవారం డోప్ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్‌గా ఎవరికైనా డోపింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. -
ఈ సభకు సెలవు.
-
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ
-
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బీఏసీలో సముచిత ప్రాధాన్యత కల్పించేవరకూ తాము బీఏసీ సమావేశాలకు హాజరు అయ్యేది లేదని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలోకి తొక్కిందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో సహకరిస్తున్నా... అధికార పక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇద్దరికే అవకాశం కల్పిస్తామంటూ మొండి వైఖరి అలవంభిస్తున్నారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. గతంలో పాటించిన సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.