బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ | ysr congress party boycotts BAC meeting | Sakshi
Sakshi News home page

బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ

Published Sat, Jun 21 2014 11:58 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ - Sakshi

బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ

శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.

హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బీఏసీలో సముచిత ప్రాధాన్యత కల్పించేవరకూ తాము బీఏసీ సమావేశాలకు హాజరు అయ్యేది లేదని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలోకి తొక్కిందని ఆయన మండిపడ్డారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో సహకరిస్తున్నా... అధికార పక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇద్దరికే అవకాశం కల్పిస్తామంటూ మొండి వైఖరి అలవంభిస్తున్నారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. గతంలో పాటించిన సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement