న్యూఢిల్లీ: వాయువ్య ఢిల్లీలోని ఒక గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఓటు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు అక్కడి ప్రజలు. ఈ మేరకు ఢిల్లీలోని వాయువ్య జిల్లాలోని కతేవారా గ్రామంలోని ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బహష్కరించారు. తమ ప్రాంతంతో రోడ్లు, డ్రైయిన్లతో సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరసనగా గ్రామస్తులు ఈ ఎన్నికలను బహిష్కరించారు.
డిసెండర్ 4 ఆదివారం ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే కతేవారా గ్రామస్తులు అధికారులు తమ గోడు పట్టించుకునేంత వరకు ఓటు వేయమని కరాకండీగా చెప్పారు ప్రజలు. ఈ మేరకు అక్కడి గ్రామస్తులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ...ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని పాలకవర్గంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు రోడ్లను నిర్మించాలని కోరుతున్నాం. తాము ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. మా డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం. అని చెప్పారు. ఇక అక్కడి ప్రజలు మున్సిపల్ ఎన్నికలు రోజంతా తమత పనులు చేసుకుంటూ గడిపారు. కాగా, మూడు పౌర సంస్థలను విలీనం తర్వాత డిల్లీలో జరుగుతున్న తొలి పౌర ఎన్నికలు ఇవి.
(చదవండి: చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment