
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ చర్యలు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో 100 వడ్డెర కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గతంలో స్మశానవాటికలో తవ్వకాలను వడ్డెర కులస్తులు అడ్డుకున్నారు. తవ్వకాలను అడ్డుకోవడంతో వడ్డెర కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ కక్ష పెంచుకుంది.
వడ్డెర కులస్తులతో మట్లాడినా, కిరాణ సరుకులు అమ్మినా రూ.10 వేలు జరిమానా విధించింది. దీంతో న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను వడ్డెర కులం వారు వేడుకున్నారు. వడ్డెర కుటుంబాలను బహిష్కరించిన మునిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వడ్డెర సంఘం సభ్యులు నిరసన చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment