గరుడ బస్సులో మంటలు | TSRTC Garuda bus catches fire in jakranpally | Sakshi
Sakshi News home page

గరుడ బస్సులో మంటలు

Published Tue, Aug 15 2017 6:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

గరుడ బస్సులో మంటలు

గరుడ బస్సులో మంటలు

జక్రాన్ పల్లి: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రం వద్ద గరుడ ప్లస్‌ ఏసీ బస్సుకు మంగళవారం సాయంత్రం కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సు వెనుక వైపు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే నిలిపివేశాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగానే టైరుకు మంటలు అంటుకున్నాయి. దీంతో వెనుక టైరు పూర్తిగా కాలిపోయింది.

ప్రయాణికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతోంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రివేళలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement