Vaddera
-
చంద్రబాబు నివాసం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా
-
వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె
సాక్షి, హైదరాబాద్: ఎండనక, వాననక రాళ్లను తీసుకువచ్చి రోళ్లను తయారు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు వడ్డెరలు. బతుకుదెరువు కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి మేడ్చల్ జిల్లాలో జీవనం గడుపుతున్నారు. చదువంటే తెలియని వయస్సు పొట్టకూటి కోసం సమ్మెట ఆయుధంగా చేసుకున్న వారి జీవితాల్లో వెలుగులు కానరావడంలేదు. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా రాళ్లను కొడుతూ జీవనం సాగిస్తున్నాయి. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పేదరికానికి మారుపేరు వారు. బతుకు గమనంలో చితికిపోయిన జీవితాలు. భవిçష్యత్‌పై ఆశలు లేని గమనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి రాళ్లను రోళ్లుగా తయారు చేస్తున్న వారి విషయంలో సరిపోతుంది. పొట్ట కూటి కోసం గ్రామాలు తిరుగుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోళ్లను తయారు చేసే వారిని కదిలిస్తే కన్నీటి కథలే కనిపిస్తాయి. రాళ్లను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం వడ్డెరులకే సాధ్యం. బతుకు గమనంలో తమకు చేయూతనందించాలని వేడుకుంటున్న వడ్డెరుల జీవిత గమనంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పథకాల గురించి అసలే తెలీదు.. పిల్లలను చదివించే స్తోమత లేదని అందరం కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు. తమకు నగర శివారుల్లోని కొంత అటవి ప్రాంతాన్ని అప్పగిస్తే అందులో లభించే బండలను కొట్టుకుని జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అసలు తమకు తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వడ్డెర కులస్తులు విన్నవిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సుత్తితో పగలగొట్టి ఉపయోగంలోకి తీసుకువస్తారు. ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి బండలు పగలగొట్టె పనికి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాళ్లను కంకరగా తయారు చేయడానికి కొత్త రకాల క్రషర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారికి పని దొరకని పరిస్థితి. రెండు రోజులు రాళ్లు కొడితేనే.. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పని దొరకదు.. కడుపు నిండదు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. సంచార జీవితాన్ని గడపడంతో ఎదగలేకపోతున్నాం. పూట గడవడమే తప్ప ఒక్క పైసా వెనుకేసుకోలేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం మేము. ప్రతి రోజు పని చేస్తేనే నాలుగు పైసలు కండ్ల చూస్తాం. లేకుంటే పస్తులుంటాం. ఒక్కోసారి పని దొరకదు. కడుపు నిండదు. ప్రభుత్వమే వడ్డెరులపై శ్రద్ధ వహించాలి. – నర్ర మహేష్, జవహర్‌నగర్ రాళ్లు కొట్టడానికి అనుమతి ఇవ్వాలి.. బండరాళ్లను అందమైన రోళ్లుగా తయారు చేయడమే తప్ప చదవడం అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పనికి వెళ్లి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గుట్టల్లో రాళ్లను కొట్టడానికి అనుమతులు ఇవ్వాలి. – రేపన్ లక్ష్మణ్, జవహర్‌నగర్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వడ్డెర కులస్తులకు కొంత అడవిని అప్పగించాలి. నగర శివారు ప్రాంతాలలో జీవిస్తున్న వడ్డెర కులస్తుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వడ్డెరలను ఎస్టీ జాబితోకి చేర్చి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. చాలా మంది వడ్డెరల పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. తాతల కాలం నుంచి రాయిని కొట్టుకుని జీవిస్తున్న మాకు వడ్డెరలకు చేయుతనివ్వాలి. – పల్లపు రవి, కార్పొరేటర్, జవహర్‌నగర్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో వడ్డెర కులస్తుల జీవన విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకురాల్సిన అవసరం ఉంది. చాలా మంది కుటుంబాలకు దూరంగా బండలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వడ్డెరల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశాం. అదే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. – మర్రి రాజశేఖరరెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ -
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
-
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ చర్యలు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో 100 వడ్డెర కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గతంలో స్మశానవాటికలో తవ్వకాలను వడ్డెర కులస్తులు అడ్డుకున్నారు. తవ్వకాలను అడ్డుకోవడంతో వడ్డెర కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ కక్ష పెంచుకుంది. వడ్డెర కులస్తులతో మట్లాడినా, కిరాణ సరుకులు అమ్మినా రూ.10 వేలు జరిమానా విధించింది. దీంతో న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను వడ్డెర కులం వారు వేడుకున్నారు. వడ్డెర కుటుంబాలను బహిష్కరించిన మునిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వడ్డెర సంఘం సభ్యులు నిరసన చేపట్టారు -
వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : తమ కులాన్ని ఎస్టీల్లో చేర్చాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వల్లెపు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కోరుతున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సంచార జాతులను ఎస్టీల్లో చేర్చాలని ఆయన కోరారు. అలాగే క్వారీ లీజుల్లో ప్రభుత్వం 50 శాతం వడ్డెర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెర విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వడ్డెర్ల ఆర్థిక అభివృద్ధికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు వర్కుల్లో ఈఎండీ లేకుండా రూ. 5 కోట్ల వరకూ వడ్డెర్లకు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై వడ్డెర్లలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తున్నట్టు నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికి 12 జిల్లాల్లో తన పర్యటన పూర్తయిందన్నారు. నెల్లాళ్లలో తమను ఎస్టీల్లో చేర్చాలని, లేకుంటే విజయవాడలో రోడ్లపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. జాతీయ యూత్ అధ్యక్షుడు మల్లె ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల చిన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాంబాబు ఆయన వెంట ఉన్నారు. -
వైఎస్సార్ సీపీకి వడ్డెరల మద్దతు
* జగన్‌తోనే మేలు జరుగుతుందని వెల్లడి * వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి * తమ సమస్యలపై జగన్ * సానుకూలంగా స్పందించారని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న వైఎస్సార్సీపీకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తెలిపింది. సీమాంధ్ర అభివృద్ధి ఆ పార్టీతోనే సాధ్యమని, జగన్ సీఎం అయితేనే వడ్డెరలకు మేలు జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు బాలరాజు చెప్పారు. బాలరాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం జగన్మోహన్రెడ్డిని కలిసి.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగా ల్లో వెనుకబడిన వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మాదిరిగా వడ్డెరలను ఎస్టీలుగా గుర్తించాలని కోరింది. అనంతరం బాలరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఈ నెల 5న సీమాంధ్రలో తాము సంఘంగా ఏర్పడ్డామన్నారు. జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో వడ్డెరల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేశారని.. జగన్ కూడా తమ సంక్షేమం కోసం పాటుపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. వడ్డెరలు ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం అందించాలని, తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరామ న్నారు. తమ విన్నపాలపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సంఘం ప్రతినిధులు తన్నీరు రాయలబాబు, కె.జంగయ్య, యల్లె ఈశ్వరరావు, కె.రామరాజు, పల్లపు రాంబాబు, కె.వెంకట్రావు, వి.చిన్నరాజు, టి.భాస్కర్ తదితరులు జగన్‌ను కలిశారు.