
Updates:
►ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎంవీ రామచంద్రారెడ్డి
►కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు.
►పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు.
పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం
చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు.
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment