teacher mlc elections
-
‘గోదావరి’ జిల్లాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. దీంతో వారిద్దరి మధ్యనే పోరు కొనసాగింది.ఏలూరు జిల్లాలో 2,667 ఓట్లకు గాను 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 91.60 శాతంగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3,729 మంది ఓటర్లకు గాను 3,478 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 93.27 శాతంగా నమోదైంది. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏఆర్వో వెంకటరావు ఆధ్వర్యంలో ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. మొత్తం ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఓటర్లకు 15,502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.62% పోలింగ్ నమోదైందని కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. -
మండలి సీట్లపై కమలం కన్ను
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలను (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీట్లలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటినుంచే టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను పెద్దసంఖ్యలో చేర్పించేలా కార్యాచరణ అమలుచేయాలని తీర్మానించింది. ఓటర్ల నమోదుకు దరఖాస్తులను పార్టీ ఇప్పటికే పెద్దసంఖ్యలో ముద్రించి సిద్ధం చేసింది. ఈ దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపించి టీచర్, గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేలా చర్యలు తీసుకోనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు (టీచర్స్, గ్రాడ్యుయేట్స్ చెరో సీటు), వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి బీజేపీ 4 ఎంపీ, 7 ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధించడం తెలిసిందే. ఈ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ సీట్లను కూడా కచ్చితంగా గెలుపొందడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించాలని పట్టుదలతో పార్టీ నేతలున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు పార్టీపరంగా ఒక ఇన్చార్జిని నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ అభ్యరి్థగా సుగుణాకరరావు, టీచర్స్ అభ్యరి్థగా మోహన్‌రెడ్డి పోటీ చేయడం తెలిసిందే. బీజేపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్–2024 పై నిర్వహించిన మరో సమావేశంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అరవింద్ మీనన్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, ధర్మారావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. -
జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ చిత్తూరు కలెక్టరేట్/సాక్షి ప్రతినిధి, అనంతపురం :రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహరెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో.. విభజన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఓట్ల లెక్కింపును గురువారం ప్రారంభించింది. పశ్చిమ రాయలసీమలో.. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి 25,272 ఓట్లు పోలయ్యాయి. నిబంధనల మేరకు ఓట్లు వేయకపోవడంతో లెక్కింపు సమయంలో 3,867 ఓట్లు చెల్లకుండా పోయాయి. తర్వాత మిగతా ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి మంచి ఆధిక్యం చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి 8,846 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 6,853 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 4,162 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి ఎవరూ 50 శాతం ఓట్లను సాధించకపోవడంతో.. తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను ఒక్కొక్కరిని తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. లెక్కింపు ముగిసే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా.. ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. అప్పటికీ 50 శాతం ఓట్లు సాధించక పోవడంతో ఎన్నికల సంఘం అనుమతితో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ ప్రకటించారు. తూర్పు రాయలసీమలో.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌లో 24,291 ఓట్లు పోలయ్యాయి. 2,356 ఓట్లు చెల్లలేదు. మిగతా ఓట్లలో మొదటి ప్రాధాన్యతలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 10,892 ఓట్లు సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఆరుగురు అభ్యర్థులను వరుస క్రమంలో తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి 11,714 ఓట్లు, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి. దాంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1,043 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారని రిటర్నింగ్ అధికారి హరినారాయణన్ ప్రకటించారు. కాగా, చిత్తూరు, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద తుది ఫలితం వెల్లడికాగానే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తపరిచారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం టీచర్ల సమస్యల పరిష్కారానికి దోహదం తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంపై ఉద్యోగ సంఘాల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఏపీ జీఈఎఫ్, వైఎస్సార్సీపీ, పీఆర్టీయూ ఏపీ అపుస్మా, వైఎస్సార్‌టీఎఫ్ తదితర 36 సంఘాల మద్దతుతో పోటీ చేసిన తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఎం. వి.రామచంద్రారెడ్డి గెలుపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సుల వల్లే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ విజయం దోహద పడుతుందని చెప్పారు. వారధిగా పనిచేస్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతోనే గెలుపొందాను. ప్రభుత్వానికి, ప్రభుత్వ.. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యా రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. – ఎంవీ రామచంద్రారెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్ల పక్షాన ఉంటా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విద్యా రంగ అభివృద్ధే నన్ను ఎమ్మెల్సీని చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో విద్యాభివృద్ధి జరుగుతోంది. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
పశ్చిమ రాయలసీమ ‘పట్టభద్రుల’ కౌంటింగ్‌పై అనుమానాలు
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పలు అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతల ప్రలోభాలతో కొందరు ఉద్యోగులు వైఎస్సార్సీపీ ఓట్లను టీడీపీ బాక్సుల్లో వేస్తున్నారని వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కౌంటింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరు ఓట్లను టీడీపీ బాక్సుల్లో ఒక ఉద్యోగి వేయడం అనుమానాలకు తెరలేపింది. దీనిపై రీకౌంటింగ్ చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేథన్‌గార్గ్‌కు లిఖిత పూర్తకంగా వినతి ప్రతం అందజేశారు రవీంద్రారెడ్డి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా వెర్రి తలలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా పైశాచిక ఆనందం పొందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా లెక్కింపు జరిగినట్లు రోత రాతలు రాస్తోంది. పట్టభద్రల ఓట్లన్నంటినీ కలిపి లెక్కిస్తున్నప్పటికీ జిల్లాలు, నియోజకవర్గాల వారిగా లెక్కింపు జరుగుతుందని అసత్యపు రాతలు రాస్తోంది. పులివెందులలో టీడీపీ మెజారిటీ అంటూ పచ్చ మీడియా తన పైత్యాన్ని మరోసారి బయటపెట్టింది. వాస్తవాన్ని వక్రీకరించి ఎల్లో మీడియా వికృత ప్రచారానికి దిగింది. -
AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
Updates: ►ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డిపై 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంవీ రామచంద్రారెడ్డి ►కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి కి 10787 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్‌రెడ్డి కి 10618 ఓట్లు వచ్చాయి. మూడో ప్రాధాన్యత ఓట్లతో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ►పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ముందంజలో ఉన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. -
ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. -
ఏపీ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి, అమరావతి: గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అధ్యాపక ఉపాధ్యాయ వర్గాలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేయడానికి సమయం కేటాయించారు. ఇక కృష్ణా- గుంటూరు జిల్లాల పరిధిలో మొత్తం 13,505 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8026 మంది పురుషులు, మహిళలు 5479 మంది ఉన్నారు. ►పామర్రులో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయ పట్టభద్రులు. ►పెడనలో 70 మంది, గూడూరులో 20 మంది, కృత్తివెన్నులో 17 మంది, బంటుమిల్లిలో 59 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 1205 మంది.. రెండు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 1205 మందిని వినియోగిస్తున్నారు. పీఓలు 139, పో-1 139, ఓపీఓలు 220, మైక్రో అబ్జర్వర్లు 139, సామాగ్రి పంపిణీకి 241, రిసెప్షన్లు 247, రూట్ ఆఫీసర్లు 40, సెక్టారు ఆఫీసర్లు 490 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉభయ జిల్లాల్లో 7,765 మంది ఓటర్లు ►మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 43.6 శాతం పోలింగ్ నమోదైంది. ►తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 49 కేంద్రాల్లో ఉపాధ్యాయ వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఉభయ జిల్లాలో మొత్తం 7,765 మంది ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలోని 49 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటనలో తెలిపారు. చదవండి: MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీ చేసింది. ఆ మేరకు తూర్పు– పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి–పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి రాము సూర్యారావు (ఆర్.ఎస్.ఆర్.మాస్టారు), కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎ.ఎస్.రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే ఈ రెండు స్థానాల భర్తీ కోసం ఈసీఐ గురువారం షెడ్యూలు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియను మార్చి 22లోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. షెడ్యూలు జారీ చేయడంతో గురువారం నుంచే ఆ 2 నియోజక వర్గాల పరిధిలోని 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ : ఫిబ్రవరి 16 (ఇదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : ఫిబ్రవరి 23 నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 ఉపసంహరణకు తుది గడువు : ఫిబ్రవరి 26 పోలింగ్ : మార్చి 14 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు: మార్చి 17 -
మొత్తం ఓట్లు 112.. పోలైంది 123
ఎర్రగుంట్ల: ఏపీలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వింత చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని 36వ పోలింగ్ బూత్‌లో ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగిన పోలింగ్‌లో 123 ఓట్లు పోలయ్యాయి. ఉన్న ఓట్ల కంటే అదనంగా11 మంది ఓటు వేశారు. పోలింగ్ బూత్ ప్రిసైండింగ్ అధికారి ఫయాజుద్దీన్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై ఫయాజుద్దీన్ పైఅధికారులతో చర్చిస్తున్నారు. దొంగ ఓట్లు ఏమైనా పోల్ అయ్యాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం: ఉత్తమ్
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో సోమవారం ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పాత పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. -
ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించండి
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాథమికోన్నత పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండితులు, పీఈటీలకు ఓటు హక్కు కల్పించాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జే.రమేష్‌లు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో పనిచేసే వారికి ఓటుహక్కు కల్పించిన ప్రభుత్వం ఒకే డీఎస్సీ, ఒకే విద్యార్హతతో నియమితులైన ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లకు ఓటు హక్కు కల్పించకపోవడం సమంజసం కాదన్నారు. వీరికి కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వీరు విజ్ఞప్తి చేశారు. -
తెగబడ్డ ‘తమ్ముళ్లు’
* ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలనూ రాజకీయం చేసిన టీడీపీ నేతలు * పోలింగ్ కేంద్రాల వద్దే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ * బెజవాడలో రంగంలోకి దిగి చక్రం తిప్పిన ఎమ్మెల్యే బోండా * శిబిరాలు వేసుకుని మరీ రూ.3 వేల చొప్పున కవర్లలో పంపిణీ * పోలింగ్ బూత్ వద్దే టీడీపీ, సీపీఎం నేతల బాహాబాహీ * గుంటూరు-కృష్ణాలో 68.12% , ఉభయగోదావరిలో 83.71% పోలింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలే కీలకపాత్ర పోషిస్తాయి. పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగే ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహజంగా దూరంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో మిగతా అన్ని పార్టీలూ ఆ విధంగా దూరంగానే ఉన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం గౌరవప్రదంగా సాగాల్సిన ఈ ఎన్నికల ప్రక్రియను అభాసుపాల్జేసింది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు రెచ్చిపోయి ప్రవర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి డబ్బులు పంపిణీ చేశారు. బూత్‌ల వద్దకు చొచ్చుకెళ్లి ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన వారిని నోటికొచ్చినట్లు దూషించడమే కాకుండా భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అనుచిత జోక్యాలు, ప్రత్యక్షంగా కల్పించుకోవడం వంటివి చేస్తున్న టీడీపీ నాయకులు.. పోలింగ్‌కు రెండురోజుల ముందే డబ్బులు, కానుకల పంపకానికి తెరతీశారు. ఇక పోలింగ్ రోజున అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా రంగంలోకి దిగారు. ‘డబ్బు పందేరం ప్రక్రియ’ను స్వయంగా పర్యవేక్షించారు. ‘ఇదేంటని’ ప్రశ్నించిన సీపీఎం నేతలపై దాడులకు ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న మహిళా నేత తాడి శకుంతలపై బూతు పంచాంగంతో విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడికక్కడ ప్రేక్షకపాత్ర పోషించారనే విమర్శలు విన్పించాయి. గుంటూరులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో.. కృష్ణా-గుంటూరు స్థానంలో 68.12 శాతం, తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో 83.71 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. సాక్షి, నెట్వర్క్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే టీడీపీ నేతలు, కార్యకర్తలు బూత్‌ల వద్ద మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయి ప్రవర్తించారు. బెజవాడలో జరిగిన ఎన్నికల్లో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోలింగ్ జరిగేచోటే టెంట్లు వేసుకుని కూర్చుని డబ్బు పంపిణీని పర్యవేక్షించారు. ఇదేమని ప్రశ్నించిన సీపీఎం నేతలపై స్థానిక టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న సహా అతని అనుచరులు దాడులకు దిగారు. గుంటూరులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించడంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలు అడ్డుకున్నారు. విజయవాడలో..: నగరంలోని ఉపాధ్యాయులు, అధ్యాపక ఓటర్లకు బిషప్ హాజరయ్య స్కూల్లో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీప పుష్పాహోటల్ సెంటర్లో టీడీపీ మద్దతుతో బరిలోకిదిగిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ వర్గం శిబిరం ఏర్పాటు చేసుకుంది. వామపక్షాల మద్దతుతో యూటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావు వర్గం కూడా శిబిరం వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఓటింగ్ పుంజుకున్న తరుణంలో టీడీపీ శిబిరానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుడారపు హరిబాబు, కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, సాంబశివరావులు చేరుకున్నారు. వీరు శిబిరంలో ఉండగానే తెలుగు తమ్ముళ్లు డబ్బుల పంపిణీకి తెరదీశారు. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు డబ్బులు పంచుతున్న రామకృష్ణ వర్గీయులు సహా తెలుగు తమ్ముళ్లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 వేలతో కూడిన కవర్లను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.1000, 500 నోట్లు స్వాధీనం చేసుకుని మీడియాకు చూపించారు. టీడీపీ నేతలు వామపక్షాల నేతలతో ఘర్షణకు దిగారు. తమకు చెందిన ఒకరిని విడిపించి తీసుకువెళ్లారు. టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు, కార్పొరేటర్లు.. సీపీఎం కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీపీఎం నాయకుడు విష్ణువర్దన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. టీడీపీ తమ్ముళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న 13 వెయ్యి రూపాయల నోట్లను సీపీఎం నేతలు తహసీల్దార్ శివరావుకు అప్పగించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోడ్ ఉల్లంఘించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వద్ద సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరు హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రయత్నించారు. దీనిపై అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మద్దతు దారులుపోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇదే కేంద్రానికి వెళ్లేందుకు మంత్రి రావెల కిషోర్‌బాబు యత్నించగా వామపక్ష కార్యకర్తలు చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో.. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోయి వ్యవహరించారు. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు)కు ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో దన్నుగా నిలిచారు. ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాల వద్దే ఉన్నారు. మరో అభ్యర్థి డాక్టర్ పరుచూరి కృష్ణారావుకు టీడీపీలోని ఓ వర్గం నేతలు గుట్టుచప్పుడు కాకుండా మద్దతు ఇచ్చినట్టు ప్రచారం సాగింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిబంధనలు ఉల్లంఘించిన వైన్‌షాపు యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. రాజమండ్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకే ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వై.రామవరం మండలం డొంకరాయిలో కేవలం ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రౌడీలా బోండా తీరు: ఎమ్మెల్సీ అభ్యర్థి తాడి శకుంతల ‘‘ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించాల్సిన బోండా ఉమామహేశ్వరరావు రౌడీలా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బోండా, నగర టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న తమ అనుచరులతో ఉన్నప్పటికీ పోలీసులు వారిని ఎందుకు అనుమతించారు. పోలీసులు టీడీపీ నేతలను మాత్రమే పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతించి మీడియా ప్రతినిధులను, ఇతర పార్టీల నాయకులు ఎందుకు కట్టడి చేశారు?. ఎమ్మెల్యే బోండా తన అనుచరులతో కలసి డబ్బులు పంచి రౌడీయిజం చేశారు. శాసనసభలో మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదు. బయట కూడా అలాగే ప్రవర్తిస్తే జనం ఊరుకోరు.’’ జిల్లా ప్రధాన పోరు వీరి మధ్యే గుంటూరు-కృష్ణా కె.ఎస్ లక్ష్మణరావు(పీడీఎఫ్), ఎ.ఎస్.రామకృష్ణ(టీడీపీ) ఉభయ గోదావరి జిల్లాలు కేవీవీ సత్యనారాయణరాజు(టీడీపీ), రాము సూర్యారావు(పీడీఎఫ్), పరుచూరి కృష్ణారావు -
మాస్టార్ల మేలుకొలుపు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయనేది బహిరంగ రహస్యమే. రూ.ఐదు వేల నగదు, వెండి గ్లాసులు, బంగారు ఉంగరాలు, టాబ్లెట్ పీసీలు, సెల్ఫోన్లు, వగైరాలతో కొందరి మాస్టార్ల ఓట్లు అంగట్లో సరుకులుగా మారిపోయాయి. బహిరంగ మార్కెట్లో వేలం మాదిరిగా ఉపాధ్యాయుల ఓట్ల విక్రయాలు బాహాటంగానే జరిగిపోతున్నాయి. అయితే, ఎన్ని తాయిలాలు ఇచ్చినా.. ఎంత డబ్బు పంచినా గెలుపు మీద నమ్మకం లేని కార్పొరేట్ శక్తులు చివరకు ఉపాధ్యాయులను బెదిరింపులకు గురి చేస్తున్నాయట. అధికార పార్టీ బహిరంగ మద్దతుతో హల్చల్ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫు అనుచరులు ప్రచారంలో చివరి అంకంగా దాదాగిరీని ఎంచుకున్నారట. ముందు నోట్లకట్టలు విచ్చలవిడిగా పంచిన సదరు అభ్యర్థి అనుచరులు చివర్లో ‘మీరు ఓట్లు వేయకుంటే అంతే సంగతులు’ అని మాస్టార్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. ‘ప్రభుత్వం మాదే. పొరపాటున మేం కాకుండా ఎవరైనా గెలిచారా. మీ అందరి జాతకాలు మావద్ద ఉన్నాయి. ఒక్కొక్కరి అంతు తేలుస్తాం’ అని రెండురోజుల నుంచి నేరుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సొమ్ములు పంచుతున్నారన్న మరక తమతోపాటు బరిలో ఉన్న అందరికీ అంటించాలన్న దురుద్దేశంతో ప్రత్యర్ధుల తరఫు కూడా కొంతమందికి సదరు అభ్యర్థి నోట్లు పంచారట. ‘పోటీ లో ఉన్న ఫలానా మాస్టారు పంపించా రు. ఇతరుల మాదిరి ఎక్కువ ఇచ్చుకోలేక వెయ్యితో సర్దుకోమన్నారు’ అంటూ కొంతమందికి రూ.వెయ్యి నోట్లు పంచారట. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇన్ని జిమ్మిక్కులు.. ఇన్ని చిల్లర వేషాలు చూడలేదని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారంటే ప్రలోభాలు, బెదిరింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రభు త్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం కార్పొరేట్ శక్తులు రూ.కోట్లు ఖర్చుచేసి ఓట్లు దండుకోవాల్సిన అవసరం ఏముం ది? ఈ రోజు ఓటు హక్కు వినియోగించే ఉపాధ్యాయుల్లో ఈ ఒక్క ప్రశ్న ఉదయిస్తే చాలు. డబ్బుతో గెలుపు గుర్రం మీద స్వారీ చేయొచ్చని విర్రవీగుతున్న కార్పొరేట్ శక్తుల ఆశలు తలకిందులవుతాయి. మరి మాస్టార్లు ఏ మేరకు విజ్ఞత చూపిస్తారో చూడాల్సిందే.! ‘అంబికా’ కథ అంతేనా ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు అంబికా కృష్ణ రాజకీయ భవితవ్యం ఓ విధంగా ప్రశ్నార్థకంగానే తయారైంది. వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ముద్ర ఏలూరు నగరం మీద ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే పవర్లో ఉంటేనే ఎవరికైనా విలువ. కానీ ఇప్పుడు ఆ ‘పవర్’ ఆయనతో దోబూచులాడుతోంది. గత ఎన్నికల సమయాన సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో బడేటి బుజ్జికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో టీడీపీ వాణిజ్య సెల్ నాయకుడి హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి తన సామాజికవర్గ ఓటర్లను టీడీపీ వైపు మళ్లించేందుకు ఆయన శక్తిమేర ప్రయత్నించారు. నందమూరి బాలకృష్ణ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో కూడా వీరభద్ర వంటి భారీ సిని మా తీసిన నేపథ్యం ఉండటంతో బాలయ్య మద్దతు అంబికా కృష్ణకే ఉంటుందని ఆశిం చారు. అటు పార్టీకి చేసిన సేవ.. ఇటు బాలయ్య మద్దతు నేపథ్యంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానంతనదేనని అంబికా కృష్ణ ధీ మాగా ఉన్నారు. కానీ సరిగ్గా ఎమ్మె ల్సీ కేటాయింపుల వేళ ఈయనకు ఆశాభంగమే మిగిలింది. నమ్మిన వారికి మేలు చేయని, ఆశించిన వారి కి అందలం ఎక్కించని బాబు వ్యవహార శైలితో అంబికా కృష్ణ కంగుతిన్నారు. అసంతృప్తి ఉన్నా ఇప్పటికిప్పుడు బయటపడితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. కార్పొరేషన్ పదవుల పందేరంలోనైనా తనకు సముచిత స్థానం దక్కుతుందన్న ఆశతో చివరకు తనను తానే ఊరడించుకున్నారని అంటున్నారు. అంటే అప్పటివరకు అంబికా కృష్ణ ముందున్న కర్తవ్యం.. వేచి వేచి.. చూసి చూసి...! పచ్చచొక్కాల సేవలో పౌర సంబంధాల శాఖ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధికారుల పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలియజేయడం.. వెరసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా పనిచేయడం పౌర సంబంధాల శాఖ అధికారుల విధి. కానీ జిల్లా పౌర సంబంధాల శాఖలోని కొందరు మాత్రం టీడీపీ కార్యకర్తల మాదిరి పనిచేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ఓ ఘటనే. ఈ మధ్యనే జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమ కవరేజీని భుజానకెత్తుకున్న సమాచార శాఖ అధికారి ఒకరు పత్రికల వారికి ఫోన్‌చేసి ‘ఫలానా నాయకుడి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఫొటోలు పంపిస్తున్నాం. బాగా కవర్ చేయండి’ అని సిఫార్సు చేశారు. ‘అదేంటి.. ఆ కార్యక్రమ కవరేజికి మీకు ఏం సంబం ధం. వాళ్ల ఫొటోగ్రాఫర్లు, వ్యక్తిగత సిబ్బంది ఉంటారు కదా’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే.. ‘అబ్బే ఊరకే ఫోన్ చేశాను. మీ ఇష్టం’ అంటూ ఫోన్ పెట్టేశారు. ఇదండీ మన పశ్చిమ పౌర సంబంధాల శాఖ అధికారుల పనితనం. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
మార్కులేయనున్న మాస్టర్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధం నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ 117 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు 453 మంది సిబ్బంది వినియోగం కాకినాడ సిటీ :పరీక్ష పేపర్లు దిద్ది.. విద్యార్థులకు మార్కులు వేసే మాస్టర్లు.. శాసనమండలి బరిలో ఉన్న అభ్యర్థులకు మార్కులు వేసి, వారి తలరాతలను నిర్ధారించనున్నారు. శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం జరిగే పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఉపాధ్యాయ ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 453 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వీరిలో 129 మంది పీఓలు, మరో 129 మంది ఏపీఓలు, 195 మంది ఓపీఓలు ఉన్నారు. మొత్తం 117 పోలింగ్ కేంద్రాలను 27 రూట్లుగా విభజించి 27 మంది జోనల్ అధికారులను నియమించారు. 129 మంది మైక్రో అబ్జర్వర్లతో పోలింగ్ కేంద్రాలవద్ద నిఘా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను నియమించారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో శనివారం పయనమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని డివిజన్ కేంద్రాల నుంచి సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. రెండు జిల్లాల్లో 21,551 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ వేలేరుపాడులోని 112 నంబ ర్ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా నలుగురు, నర్సాపురం డివిజన్ భీమవరం పట్టణంలోని 101వ నంబర్ పోలింగ్ కేంద్రం లో అత్యధికంగా 1070 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో 68 పోలింగ్ కేంద్రాలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,176 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 721 పెద్ద బ్యాలెట్ బాక్సులను, 1090 చిన్న బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. జిల్లాను 21 రూట్లుగా విభజించి, 21 మంది జోనల్ అధికారులను, 75 మంది మైక్రో అబ్జర్వర్లను పర్యవేక్షణకు నియమించారు. ప్రిసైడింగ్ అధికారులుగా 75 మందిని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా మరో 75 మందిని, ఇతర పోలింగ్ అధికారులుగా మరో 107 మందిని నియమించారు. అందుబాటులో ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు ఎం.జగన్నాథం జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులుంటే ఆయన సెల్ నంబర్ 88976 32532, ల్యాండ్‌లైన్ 0884-2350549కు ఫోన్ చేయవచ్చు. పోటీలో 15 మంది ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నోటాతో కలిపి ఎడమవైపున ఎనిమిది, కుడివైపున ఎనిమి ది మంది పేర్లతో బ్యాలెట్ పత్రం రూపొందించారు. అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడుల్లో ఓటర్లు తమకు నచ్చినవారికి ప్రాధాన్యతా ఓటు వేయాలి. పోలింగ్ కేంద్రం వద్ద సరఫరా చేసే వైలట్ స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటర్లు ఓటు వేయాలి. తనకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదుట ఉన్న గడిలో ప్రాధాన్యతను తెలిపే ఒకటి అంకెను తప్పనిసరిగా వేయాలి. తరువాత మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యతను తెలిపే వరుస క్రమంలో అంకెలను వేయాలి. ఒకటి అంకె వేయకుండా మిగతా అంకెలు వేసినా, అంకెను అక్షరాల్లో రాసినా, టిక్కు, ఇన్‌టూ మార్కు పెట్టినా, సంతకం, ఇతర గుర్తులు వేసినా చెల్లుబాటు కావు. -
అటు ఎండ భగభగ ఇటు ఎన్నిక సెగ
వేసవి తీవ్రత పెరుగుతుండగా మరోపక్క రాజకీయంగా శాసనమండలి ఎన్నికలు జిల్లాలో ఈ వారం కాక పుట్టించాయి. ఒకపక్క ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో చర్చనీయాంశాలుగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే ఓటర్లు. అయినా రాజకీయ ప్రమేయం లేకుండా ఈ ఎన్నికలు జరగకపోవడం విశేషం. ఇదివరకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఈ ఎన్నికలకు ఏర్పడింది. తొలిసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజును ప్రకటించింది. టీడీపీలో కీలక నేత, లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి హయాం నుంచి చైతన్యరాజుకు టీడీపీతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అదే ఈ ఎన్నికల్లో తనకు సానుకూలమవుతుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో సమస్యలు పరిష్కరించగలరనే నమ్మకాన్ని ఉపాధ్యాయుల్లో కలిగించగలిగామనే అంచనాల్లో ఉన్నారు. ఒకపక్క చైతన్యరాజు మరోవైపనాయనకు మద్ధతుగా తనయులు ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, శశివర్మ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలను జిల్లాలో మకాం పెట్టించి మరీ ప్రచారాన్ని హోరెత్తించారు. మరోపక్క ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు మొదట్లో టీడీపీ మద్ధతు లభిస్తుందని నిరీక్షించారు. ఆ ఆశ నెరవేరదని తేలిపోయాక స్వతంత్ర పోరుకు సై అన్నారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ఆయన.. విద్యాపరంగా తనకున్న పరిచయాలు, ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలు సానుకూలమవుతాయని అంచనా వేస్తున్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఉపాధ్యాయులు వెంట రాగా ఆయన రెండు జిల్లాల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో తాను చేయదలుచుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.అలాగే ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు హడావిడి, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ప్రచారాన్ని ముగించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయనకు అక్కడ విద్యాదాతగా ఉన్న మంచి పేరు ఆ జిల్లాలో కలిసివస్తుందని లెక్కలేసుకున్నారు. మన జిల్లాకు వచ్చేసరికి ఉపాధ్యాయ సంఘ బలంపైనే నమ్మకం పెట్టుకుని బరిలో గెలుపోటములను తేల్చుకోవాలని అనుకుంటున్నారు. తాయిలాలపై వివాదం ఒక అభ్యర్థి సుమారు రూ.15వేల విలువైన ఆరు వెండి గ్లాసుల గిఫ్ట్ ప్యాక్‌లను ఉపాధ్యాయులకు తన అనుచరుల ద్వారా అయితే ఆ గ్లాసులు నాణ్యత లేనివంటూ పోటీలో ప్రత్యర్థి ప్రచారం చేశారు. అయితే ఆ గ్లాసుల నాణ్యతపై నిగ్గు తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ అభ్యర్థి అనుచరుల ద్వారా సవాల్ కూడా విసరడం గమనార్హం. దీనినిబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓటు తప్పదా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎమ్మెల్యేల కోటాలో జిల్లాకు ప్రాధాన్యం ఇదిలా ఉండగా, మరోపక్క ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనంగానే జరిగినా ఆసక్తిని రేకెత్తించాయి. విభజన అనంతరం ఏర్పడ్డ రాష్ట్రంలో వచ్చిన ఐదు ఎమ్మెల్సీల్లో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు దక్కాయి. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మరొకటి టీడీపీకి దక్కాయి. మొత్తం ఐదు స్థానాల్లో పాలక పక్షం, ప్రతిపక్షం జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వడం కాకతాళీయంగా జరిగినా.. జిల్లా ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి. ఎటువంటి మాట ఇవ్వకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సీనియర్ అయిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఎమ్మెల్సీని చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన విశ్వసనీయత, విధేయతకు గుర్తింపుగా ఈ పదవి వరించింది. టీడీపీ నుంచి వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు)కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యానికి నిరాశను మిగిల్చారు. తద్వారా గతంలో ఆయనకు ఇచ్చిన మాట తప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ఓట్లు వేయించుకుని బీసీలకు మొండిచేయి చూపిన బాబుపై ఆ పార్టీలో బీసీలు భగ్గుమంటున్నారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. జిల్లాలో ఎక్కడికక్కడ చివరకు ఇళ్ల నుంచి కూడా బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేయించింది. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సీపీఎం, సీఐటీయూ నేతలను కూడా అన్యాయంగా అరెస్టులు చేసి నిర్బంధించిన చంద్రబాబు సర్కార్ పాత వాసనలు వీడలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. -
ఫస్ట్ మార్కు ఎవరికో!
శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల నాడి అంచనాలకు అందడంలేదు. మేధావి వర్గంగా పిలిచే ఉపాధ్యాయులే ఓటర్లు కావడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బడిలో పిల్లలకు వేసినట్టే.. అభ్యర్థుల్లో ఎవరికి ఉపాధ్యాయులు ఎన్ని మార్కులు వేస్తారు? ఎవరిని పాస్ చేస్తారు? ‘ఫస్ట్ మార్క’ ఎవరికి వేస్తారు అనే విషయాలు తెలియక బరిలో ఉన్న అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఈ నెల 22న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాల మాట ఎలా ఉన్నా.. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని అంటున్నారు. తెలివైన ఉపాధ్యాయులు ఎవరి పక్షాన నిలుస్తారనేదానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయ్యవార్ల మూడ్‌ను తెలుసుకునేందుకు బంధువులు, శ్రేయోభిలాషులు, వేగులను వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. రెండున్నర నెలలుగా టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు వేసిన ఎత్తులు, పై ఎత్తులు ఎంతవరకూ ఫలితాన్నిస్తాయనేదానిపై అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినా ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ కనిపిస్తోంది. కార్పొరేట్ విద్యారంగం నుంచి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), పరుచూరి కృష్ణారావు పోటీలో ఉన్నారు. చైతన్యరాజు అధికార టీడీపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే పార్టీకి చెందిన కృష్ణారావు రెబల్గాను, యుటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా రాము సూర్యారావు పోటీ పడుతున్నారు. వీరితోపాటు మరో 12 మంది కూడా బరిలో నిలిచారు. ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్నప్పటికీ పరోక్షంగా పలు వర్గాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, వాటికి అనుబంధంగా ఉన్న పలు ఇతర సంఘాలు తెరవెనుక, బయట ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. గతంలో రాజ్యసభ సీటు కోసం గట్టి ప్రయత్నం చేసి చివరి నిమిషంలో ఆ అవకాశం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, శాసన మండలిలో టీడీపీ విప్ చైతన్యరాజు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. రెండోసారి మండలిలో అడుగు పెట్టడాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా తాను సాధించిన జీఓలు తనకు ప్లస్ పాయింట్ అవుతాయని, అలాగే, గతానికి భిన్నంగా టీడీపీ మద్దతుతో బరిలోకి దిగడం సానుకూల అంశమవుతుందని చైతన్యరాజు అంచనా వేస్తున్నారు. తాను, తన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ రెండు జిల్లాల్లో పలు వర్గాలతో మమేకమవడం, మూడు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ పరిచయాలు తనకు కలసివస్తాయనే ధీమాతో ఉన్నారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి కృష్ణారావు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రగతి విద్యాసంస్థల సమర్థ నిర్వహణ, పీఈటీ సహా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉండటం సానుకూలమవుతుందనే అభిప్రాయంతో ఆయనున్నారు. టీడీపీ సభ్యత్వం నుంచి అధిష్టానం తొలగించినా ఉపాధ్యాయులను నేరుగా ప్రసన్నం చేసుకోగలిగానని ఆయన భావిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాము సూర్యారావు ప్రచారం యూటీఎఫ్ మద్దతుతో చాపకింద నీరులా సాగుతోంది. ఉపాధ్యాయుడిగా ఉన్న నేపథ్యం, ప్రాంతీయ అభిమానం పశ్చిమ గోదావరిలో సానుకూలంగా మారుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరిధీమాలో వారుండగా ప్రత్యర్థులపై బురదజల్లే ఎత్తులు వేయడంలో కూడా ఒకరిని మించి మరొకరు వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని పీఆర్టీయూ వంటి ఉపాధ్యాయ సంఘాలు నిట్టనిలువునా చీలిపోయాయి. అందుకే గతంలోకంటే ఈసారి సామాన్యులు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
వ్యూహం..ప్రతి వ్యూహం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలవడంతో అభ్యర్థులు వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. రెండు జిల్లాల్లో కలిపి 21,899 మంది ఓటర్లు ఉండగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 12,654 మంది, పశ్చిమగోదావరిలో 9,245 మంది ఉన్నారు. ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ది కీలక పాత్ర కానుంది. శాసనమండలిపునరుద్ధరణ తర్వాత జరిగిన రెండు ఎన్నికలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్, ఎస్టీయూ బలాబలాలు నువ్వా, నేనా అన్నట్టుగా ఉన్నాయి. ఫలితంగా ఈ రెండు సంఘాలకు అభ్యర్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకా పీఈటీ, పీఆర్టీయూ, ఎస్టీఎఫ్ తదితర సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. శాసనమండలిని పునరుద్ధరించిన తరువాత రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ హ వా కొనసాగటంతో ఉపాధ్యాయ వర్గాల ఆలోచనలు కూడా అటువైపే మళ్లాయి. ఉపాధ్యాయుల్లో కొందరు పగలు పాఠాలు చెబుతూ రాత్రి అభ్యర్థులకు గోప్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనంటున్నారు. ఎన్నికల నాటికి సంఘాల్లో చీలికలు! సంఘాల ప్రతినిధులు మాట ఇచ్చినా సంఘంలోని ఉపాధ్యాయులంతా ఏకతాటిపై నిలుస్తారనే నమ్మకం కలగకపోవడంతో అభ్యర్థులు మల్లగుల్లాలుపడుతున్నారు. మద్దతు విషయంలో ఒకే సంఘంలోని నాయకుల నుంచి పరస్పర విరుద్ధంగా ప్రకటనలు వస్తుండటంతో మాట తీసుకున్న అభ్యర్థులు కలవరానికి గురవుతున్నారు. ఈ పరిణామాలు ఎన్నికలు సమీపించేసరికి ఉపాధ్యాయ సంఘాల మధ్య చీలికకు దారితీయొచ్చంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు, యూటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, పార్టీ రహితంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు గొల్ల బాబూరావు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ బలపరిచిన అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌కుమార్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలా బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరి స్థాయిలో వారు పగటి పూట ప్రచారంలో బిజీగా ఉంటూ రాత్రయ్యేసరికి తెరవెనుక ఎత్తులపై కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. ఒకపక్క ప్రచారం చేసుకుంటూ పోతున్న కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలు ఆ వెనుకనే తమ అనుచరులు, సన్నిహితుల ద్వారా ఉపాధ్యాయ సంఘాల ప్రాబల్యం, కలిసివచ్చే స్థానికత, ఆర్థిక అంశాలు ప్రామాణికంగా లెక్కలు తీస్తున్నారు. నామినేషన్ బోణీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు తొలిరోజైన గురువారం బోణీ అయింది. అమావాస్య ఉదయం ఆరుగంటలకే వెళ్లిపోవడంతో పిఠాపురానికి చెందిన న్యాయవాది పేపకాయల రాజేంద్ర కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ప్రధాన అభ్యర్థులు పండితులతో సంప్రదించి నామినేషన్ల దాఖలుకు ముహూర్తాలను నిర్ణయించుకునే పనిలో ఉన్నారు. టీడీపీ మద్దతు కోసం ప్రయత్నించి విఫలమై బరిలో నిలిచిన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు ఈ నెల 25న మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ల దాఖలు తదితర వివరాలు తెలుసుకునేందుకు కలెక్టరేట్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో యాదగిరిని కలిసేందుకు వచ్చిన సందర్బంగా కృష్ణారావు ఈ విషయాన్ని ‘సాక్షి’కి ధృవీకరించారు. యూటీఎఫ్ అభ్యర్థిగా పశ్చిమగోదావరికి చెందిన రాము సూర్యారావు ఈ నెల 24న నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా ముహూర్తం విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ చైతన్యరాజు ముహూర్తం కోసం పండితులతో సంప్రదిస్తున్నారు. -
మండలి వే‘ఢీ’
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 19 నుంచి 26 వరకు నామినేషన్లు మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్ ధన ప్రవాహానికి పక్కా ప్రణాళికలు ఏలూరు సిటీ : రాజకీయ చైతన్యానికి ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికకు నగారా మోగటంతో రేసులో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈనెల 19నుంచి 26తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 2వరకు గడు వు విధించారు. మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్ చేపడతారు. మాజీ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి కృష్ణారావు, పీడీఎఫ్ మద్దతుతో బరి లోకి దిగిన సామాజికవేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థులుగా పిల్లి డేవిడ్‌కుమార్, విశ్రాంత పీడీ సత్యనారాయణ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలోనూ రూటే సెప‘రేటు’ అన్నట్టుగా అభ్యర్థులు ధన ప్రవాహాన్ని పోటెత్తించేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో భారీగా నజరానాలు వెదజల్లగా, ఈ సారి అంతకంటే ఎక్కువగా సొమ్ములు, బహుమతులు పంపిణీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాయిలాల పంపిణీ బాధ్యతలను కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు అప్పగించిన నాయకులు, ఇతర సంఘాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గాలం వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో 9,250మంది ఓటర్లు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 12,654 మంది ఉన్నారు. వీరిలో అగ్రస్థానం ఉపాధ్యాయులదే. ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఓటర్లు సుమారు 13వేల నుంచి 14వేల మంది ఉంటారని అంచనా. అధ్యాపకులు, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఓటర్లు 7వేల మంది ఉన్నట్టు తెలుస్తోంది. -
పుష్కర సన్నాహాలకు కోడ్ సంకటం!
సాక్షి, రాజమండ్రి :ఇప్పటికే నత్తకన్నా మందకొడిగా సాగుతున్న పుష్కరాల పనులకు కొత్త గా ఎన్నికల కోడ్ సంకటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో బుధవారం నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో రెండు జిల్లాల్లో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు ఉండదు. కాగా జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు జిల్లాలో సుమా రు రూ.400 కోట్లకు పైగా వెచ్చించి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ ఇంకా వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఎలా ముందుకు సాగించాలన్న సందిగ్ధం వివిధ శాఖల్లో ఏర్పడింది. కోడ్ కారణంగా ఈ పనులు నిలిచి పోయే అవకాశం ఉంది. కాగా ఈ కోడ్ పుష్కర పనులకు వర్తిస్తుందా, లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కోడ్ అనేది అన్నింటికీ సమం గా వర్తిస్తుందని మరికొందరు చెబుతున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో పుష్కర పనులు చేపడుతోంది. ఇవి ఇంకా టెండర్ల స్థాయిలోనే ఉన్నాయి. ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. నీటిపారుదల శాఖ కొన్ని పనులను మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఆ శాఖ మొత్తం రూ.42 కోట్లతో చేపట్టనున్న 164 పనుల్లో సుమారు 130 పనులకు టెండర్లు పూర్తి చేసింది. ఆ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దేవాదాయ శాఖ కూడా రూ.14 కోట్ల మేర పనులు ఇంకా పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్అండ్బీ శాఖ రూ.87.55 కోట్లతో 175 పనులు చేపడుతుండగా వీటిలో 70 పనుల వరకూ టెండర్లు పిలిచారు. ఇంకా పంచాయతీరాజ్, పర్యాటక శాఖ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు నిధులు విడుదల కావాల్సి ఉంది. కోడ్ ఉంటే మరో నెల ఆలస్యం.. ఎన్నికల కోడ్ పుష్కర పనులపై ప్రభావం చూపితే మరో నెల రోజులు పనులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 16న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 19న చేపడతారు. అంత వరకూ కోడ్ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ టెండర్లు పిలవని పనులకు కూడా ఆ తర్వాతే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఏ పనులు చేపట్టాలి, ఏ పనులు కోడ్ పరిధిలోకి వస్తాయి అనే అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. తాము కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పుష్కరాల ప్రత్యేకాధికారి జె.మురళి అంటున్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తాం.. పుష్కర పనులకు ఎన్నికల కోడ్ వర్తింపు విషయంలో ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తాం. రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్‌కు ఈ మేరకు లేఖ రాస్తున్నాం. ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉత్సవాలు. వీటిని కోడ్ నుంచి మినహాయించమని కోరతాం. పుష్కరాలు కేవలం ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే ఉంటాయి. అవి కూడా దాని కోసం నిర్దేశించిన పనులు మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ పనులను కోడ్ నుంచి మినహాయించాలి. - జె.మురళి, పుష్కరాల ప్రత్యేకాధికారి -
‘కార్పొరేట్’ల బిగ్‌ఫైట్!
త్వరలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుంపటిని రాజేశాయి. ఆ పార్టీకే చెందిన ఇద్దరు కార్పొరేట్ విద్యావేత్తల మధ్య ‘బిగ్‌ఫైట్’కు తెర లేచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కోట్లు కుమ్మరించే ఖరీదైన పోరుగా మారిపోయాయి. అందుకు తగ్గట్టుగానే అధికార టీడీపీలో ఇద్దరు ‘బస్తీ మే సవాల్’ అంటూ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజును ఇప్పటికే టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో ఆ పార్టీ జిల్లా నేతలు ఏకగ్రీవంగా బలపరిచారు. జరగనున్నది పార్టీరహితంగా, ఉపాధ్యాయ వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనా.. ఆ పార్టీలో తాజా పరిణామాలతో రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ చైతన్యరాజు పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది. ఈలోపు జరిగే ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్వెలువడుతుందని ఆశావహులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అదే పార్టీకే చెందిన ‘ప్రగతి’ విద్యాసంస్థల అధినేత కృష్ణారావు ఎమ్మెల్సీ బరిలో ఉన్నానంటూ గురువారం కాకినాడలో ప్రకటించడం పార్టీలో చిచ్చు రేపింది. మొదటి నుంచి వీరిద్దరిలో ఎవరో ఒకరే బరిలో ఉంటారని పార్టీ నేతలు భావించారు. ఆ దిశగా అంతర్గతంగా సయోధ్య కుదురుతుందనుకున్నారు. శాసనమండలిలో బలం లేని పార్టీలోకి పలువురు ఎమ్మెల్సీలను తీసుకువచ్చినందుకు ప్రతిఫలంగా చైతన్యరాజుకు మద్దతు ఇచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. చైతన్యరాజుకు టీడీపీ మద్దతు ప్రకటించాక కృష్ణారావుతో పార్టీ నేతలు మంతనాలు సాగించి.. కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. బరిలో తానున్నానంటూ కాకినాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించిన సందర్భంలో కృష్ణారావే ఈ విషయాన్ని తెలియచేశారు. కృష్ణారావుపై ఫిర్యాదు చేయనున్న ప్రత్యర్థులు గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరుస్తారని కృష్ణారావు ఆశించినా మరోసారి భంగపాటు తప్పలేదు. పార్టీలో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కృష్ణారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను వ్యతిరేక వర్గం అధిష్టానం ముందుంచే అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాడు ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుందంటూ పేరు ఎత్తకుండానే చంద్రబాబు మాట తప్పుతారని కృష్ణారావు పరోక్షంగా ఎత్తిచూపారని వారు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా పోటీ నుంచి తప్పుకునేది లేదని కృష్ణారావు తెగేసి చెప్పడం గమనార్హం. ఒకే పార్టీ నుంచి పోటీ పడుతున్న ఇద్దరూ కార్పొరేట్ విద్యా రంగానికి చెందిన వారు కావడంతో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రసపట్టుకు ఆటపట్టు కానున్నాన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న చైతన్యరాజు వ్యూహం ముందు కృష్ణారావు ప్రతివ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. -
రిటైరైనా ఓటర్లే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల జాబితా తప్పులతడకగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాబితాలో లోపాలు చక్కదిద్దకుండా ఎన్నికలకు వెళితే బోగస్ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయన్న ఆందోళన ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రచారం, వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన అభ్యర్థులు కూడా ఓట్ల తకరారుపై తర్జనభర్జనపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. ఆ స్థానానికి ఈలోగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలు చైతన్యరాజు, పరుచూరి కృష్ణారావులతో పాటు రాము సూర్యారావు (యూటీఎఫ్) తదితరులు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుంది. కాగా చనిపోయిన, రిటైరైన, అర్హత లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారంటూ జిల్లా యంత్రాంగానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయి. ఈనెల 16న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను బట్టి 116 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 21,899 మంది ఉపాధ్యాయ ఓటర్లు (తూర్పుగోదావరిలో 12,654, పశ్చిమగోదావరిలో 9,245) ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈనెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదు చేపట్టారు. అంతకు ముందు నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం రెండు జిల్లాల్లో 13,658 మంది ఓటర్లు ఉన్నారు. మునుపెన్నడూ లే నట్టు ఈ దఫా ప్రైవేటు ఉపాధ్యాయులూ ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలతో అవకాశమిచ్చింది. కొత్తగా ఓటు హక్కు కోసం 9,458 మంది దరఖాస్తు చేసుకుంటే 9,231 మంది అర్హులని తేల్చి జాబితాలో చేర్చారు. ఇతరప్రాంతాలకు వలసపోయిన, మృతి చెందిన వారిని గుర్తించి 990 ఓట్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. మూడు వేల వరకు రిటైరైన వారివే.. మూడేళ్ల క్రితమే రిటైరైన ఉపాధ్యాయులనూ జాబితా నుంచి తొలగించ లేదని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. 21 వేల ఓట్లలో రిటైరైన వారివి మూడు వేల వరకు ఉన్నాయంటున్నారు. అంబాజీపేట మండలం తొండవరం ఉన్నత పాఠశాలలో రిటైరైన ఎ.రాధాకృష్ణమూర్తి, ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ పాఠశాలలో రిటైరైన కె.పురందరరావు, అమలాపురం రూరల్ మండలం బండార్లంక ఉన్నత పాఠశాలలో రిటైరైన ఎ.చంద్రరావుల పేర్లు జాబితాలో ఉన్నాయి. సీరియల్ నం.283లో కె.శివరావు, నం.237లో కె.నారాయణమ్మ, నం.92లో పి.సుబ్బలక్ష్మి, నం.74లో జి.సోమేశ్వరరావు, నం.72లో సీహెచ్ సూర్యనారాయణ రిటైరైన వారే. అమలాపురం డీవైఈఓగా రిటైరైన ఆకొండి శారదా దేవి(నం. 26) రెండేళ్ల క్రితం, నం.65లో నమోదైన జి.ఎస్.వి.రవికృష్ణ, నం.185లో నమోదైన వై.ఎల్.ఎన్.శాస్త్రిలు ఏడాది క్రితం మృతిచెందినా జాబితాలో పేర్లున్నాయి. 2011లో హైస్కూల్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు బదిలీ అయిన జి.శోభ (నం.19), డి.రామకృష్ణ (నం.278)లకు ఓట్లు ఉన్నాయి. సీరియల్ నం.732లోని గోపాలకృష్ణ, 281లోని వై.ఎస్.వి.రమణలకు రెండేసి ఓట్లు ఉన్నాయి. చాలా పాఠశాలల్లో నవంబరు 2011కు ముందే రిటైరైన వారి పేర్లు సవరించిన జాబితాలో ఉన్నాయి. ఈ విషయంపై ఉపాధ్యా య సంఘాలు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశాయి. ఒక ప్రాంతంలో ప నిచేసి 2011 నవంబరు తరువాత వేరొక ప్రాంతానికి బదిలీ అయిన ఉపాధ్యాయులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారు. గతంలో తహశీల్దార్లకు ఫిర్యాదు చేసినా ఓట్లు తొలగించే అధికారం లేదని విడిచి పెట్టేశారంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ ఎన్నికల సెల్‌ను సంప్రదించగా ఫారమ్-8లో సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రిటైరైన ఉపాధ్యాయులకూ ఓట్లు.. రిటైరైన ఉపాధ్యాయులు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇలాంటి వారు మూడువేల మంది ఉండొచ్చని అంచనా. వారంతా నవంబరు 2011కు ముందు రిటైరైన వారే. జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాను సవరించి బోగస్ ఓట్లు తొలగించాలి. - టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ ఓటర్ల జాబితా తప్పుల తడక.. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. జాబితాను సరిచేశాకే ఎన్నికలు నిర్వహించాలి. గత ఎన్నికల్లో చాలా మంది ఉపాధ్యాయులు ఓట్లు లేక నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో అర్హుల ఓట్లు గల్లంతయ్యాయి. అటువంటివి చక్కదిద్దాలి. -పి.ఎన్.వి.వి.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ -
రాజుదే పైచేయి
త్వరలో జరగనున్న శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం హోరాహోరీగా తలపడిన ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖుల్లో.. మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజుదే పైచేయి అయ్యింది. మొదటి నుంచీ పార్టీ మద్దతు కోసం పోటీ పడిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు ఈ పరిణామంతో డీలా పడ్డారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మద్దతు ఖాయమని ఆదినుంచీ ధీమాతో ఉన్న కృష్ణారావు స్వతంత్రంగా బరిలోకి దిగుతారా లేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు కూడగట్టేందుకు చైతన్యరాజు, కృష్ణారావు చివరివరకూ ప్రయత్నాలు చేశారు. చివరకు జిల్లాలో మెజార్టీ పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో చైతన్యరాజు సఫలీకృతులయ్యారు. పార్టీ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ బీసీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరుల సమక్షంలో.. పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థిగా చైతన్యరాజు పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించారు.టీడీపీ నిర్ణయంతో కంగుతిన్న కృష్ణారావు వర్గం పార్టీ నేతల తీరుపై మండిపడుతోంది. మొదటినుంచీ చెబుతున్నట్టే పార్టీ మద్దతు ఉన్నా.. లేకున్నా కృష్ణారావు స్వతంత్రంగానైనా బరిలో నిలవడం ఖాయమని ఆయన అనుచరవర్గం చెబుతోంది. అయితే ఆయనను అధిష్టానం బుజ్జగిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రహితంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచిన అనంతరం సిటింగ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చైతన్యరాజు మరోసారి బరిలో నిలవనున్నట్టు ముందుగానే ప్రకటించారు. ఆయన పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఈ తరుణంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు మండలిలో ప్రభుత్వ విప్ పదవి కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో మరోసారి పోటీ చేసి చైతన్యరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ మద్దతు కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చైతన్యరాజుకు పోటీగా టీడీపీ మద్దతు కోసం ప్రగతి విద్యాసంస్థల అధినేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం టిక్కెట్టు ఆశించి భంగపడిన పరుచూరి కృష్ణారావు కూడా ప్రయత్నించారు. పెద్దాపురం టిక్కెట్టు ఇస్తామని నమ్మించి చివరి నిమిషంలో రాజప్పకు ఇచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు పార్టీ మద్దతు ఖాయమని కృష్ణారావు గట్టి నమ్మకంతోనే ఉన్నారు. మాట ఇచ్చి కూడా టిక్కెట్టు ఇవ్వలేదన్న సానుభూతి, సామాజిక నేపథ్యం కలిసి వస్తుందని ఆయన ఆశించారు. కానీ లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచీ పార్టీలోని జిల్లా ముఖ్య నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, గతంలో రాజ్యసభ ఎన్నికల్లో బరి నుంచి తప్పుకోవడం, వివాదరహితుడనే పేరు ఉండడంతో.. మెజార్టీ నేతలు చైతన్యరాజువైపే మొగ్గు చూపారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైతన్యరాజుకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో కృష్ణారావు వర్గీయులు ఆత్మపరిశీలనలో పడ్డారంటున్నారు. చైతన్యరాజుకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కృష్ణారావును పార్టీ అధిష్టానం బుజ్జగించి, బరిలో లేకుండా చేసే వ్యూహాలకు జిల్లా నేతలు పదును పెడుతున్నారు. కృష్ణారావు విషయాన్ని అధిష్టానమే చూసుకుంటుందని జిల్లా నేతలు ధీమాగా చెబుతున్నారు. అలాగని ఇందుకు కారణం మాత్రం వారు చెప్పడంలేదు. కృష్ణారావు భవిష్యత్ వ్యూహం ఎలా ఉన్నా.. ఇద్దరు కార్పొరేట్ విద్యారంగ ప్రముఖులు బరిలోకి దిగే యత్నాలు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కృష్ణారావు స్వతంత్ర పోరుకు సై అంటారా? అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కు తగ్గుతారా అనేది టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. అధినేత నిర్ణయించారు : పర్వత కాకినాడ సిటీ : శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజును అభ్యర్థిగా నిలపాలని తమ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు టీడీపీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు తెలిపారు. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైతన్యరాజు విజయానికి పార్టీ జిల్లా నాయకులు కృషి చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, చైతన్యరాజు, ఎమ్మెల్సీ రవివర్మ, పార్టీ నేతలు గన్ని కృష్ణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గంగ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.