
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు.కూటమి ప్రభుత్వ ఓటమిపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమికి చెంపదెబ్బ. టీడీపీ,జనసేన కూటమి పార్టీలకు చావుదెబ్బ తగిలింది. ఎల్లవేళలా మోసం పనిచేయదని తేలిపోయింది. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన,బీజేపీ సహా కూటమి పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు.
ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు. చంద్రబాబు చేసిన మోసాలను తిప్పికొడుతూ ఇవాళ గట్టి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం..మూడు జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేసింది’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment