దళిత చైర్మన్‌కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన | YSRCP Members Protested Against The Government Behavior With Dalit Chairman, More Details Inside | Sakshi
Sakshi News home page

దళిత చైర్మన్‌కు అవమానం..తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన

Sep 27 2025 5:41 AM | Updated on Sep 27 2025 12:55 PM

YSRCP members protested against the government behavior

మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు పేరు కూడా లేకుండా ఏర్పాటు చేసిన శిలాఫలకం

విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన శాసన మండలి  

జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు ఆహ్వానించలేదు

ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలకూ పిలుపు లేదు

అసెంబ్లీ, మండలి విప్‌ల భవనాల ప్రారంభోత్సవానికీ అదే తీరు

సభాధ్యక్షుడికి విలువ లేదా? ఇదేనా మీరిచ్చే గౌరవం? 

సభానాయకుడు సమాధానం చెప్పాలి.. చైర్మన్‌ మోషేన్‌ రాజుకు  క్షమాపణ చెప్పాలి.. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన 

తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన చైర్మన్‌.. క్షమాపణ చెప్పకుండా దాటవేసిన మంత్రులు 

సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్‌ రాజ్యంగబద్ధ పదవి. సభాధ్యక్ష స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతో అధ్యక్షస్థానాన్ని అగౌరవపరుస్తోంది. అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. రాజ్యాంగస్థానాన్ని ఓ దళిత సభ్యుడు అధిరోహించారన్న అక్కసుతోనే ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళిత వర్గానికి చెందిన చైర్మన్‌ మోషేన్‌ రాజుకు జరుగుతున్న వరుస అవమానాలపై శుక్రవారం శాసన మండలి దద్దరిల్లింది. 

వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. శాసనసభా నాయకుడైన సీఎం చంద్రబాబునాయుడు మండలికి వచ్చి దీనికి సమాధానం చెప్పాలని, చైర్మన్‌ను బేషరతుగా క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు. మండలిలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పకుండా దాటవేయడంతో ప్రతిపక్ష స­భ్యు­లు పెద్దపెట్టున నినాదాలుచేశారు. 

ఈ అంశంలో ప్రభు­త్వ తీరుపై చైర్మన్‌ మోషేన్‌రాజు కూడా తీవ్ర అసహనం వ్య­క్తం చేశారు. చైర్మన్‌కు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మండలిని పలుమార్లు వాయిదా వేసినా సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో చేసేది లేక చైర్మన్‌ శనివారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.

దళితుడైనందున చైర్మన్‌ను అవమానిస్తారా?: బొత్స
‘‘అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండలి చైర్మన్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం. అసెంబ్లీ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినా అసెంబ్లీ స్పీకర్‌తో పాటు‡ మండలి చైర్మన్‌ను ఆహ్వానించాలి. గౌరవించాలి.. కానీ కావాలనే పిలవడం లేదు. ఇలా జరగడం తొలిసారి కాదు.. ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. సభా గౌరవానికి సంబంధించిన అంశం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అంటూ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

‘‘తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకూ చైర్మన్‌ను ఆహ్వానించలేదు. లోక్‌సభ స్పీకర్‌ పాల్గొన్న ఆ కార్యక్రమంలో మా లాంటి వారిని పిలిచారా? లేదా? మా సభ్యులను పిలిచారో లేదా అనేది కాదు.. మండలి చైర్మన్‌గా మిమ్మల్ని పిలవాలి కదా? ఎందుకు పిలవలేదు? ఇటీవల జరిగిన ప్రజాప్రతిని«ధుల క్రీడా పోటీలకూ చైర్మన్‌కు పిలుపు లేదు. ప్రభుత్వం తరçఫున అధికారికంగా జరిగే కార్యక్రమాలకు చైర్మన్‌ను పిలవకుండా పదేపదే అవమానిస్తున్నారు. 

దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారనే కదా.. కావాలని అవమానిస్తున్నారు. అసెంబ్లీ, మండలి విప్‌ల భవనాల ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను పిలిచి మండలి చైర్మన్‌ను పిలవకపోవడం అన్యాయం. కనీసం శిలాఫలకంపైనా మండలి చైర్మన్‌ పేరు కూడా వేయలేదు.’’ అంటూ శిలాఫలకం ఫొటో చూపిస్తూ బొత్స తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మండలి చైర్మన్‌ను భాగస్వామ్యం చేయకపోవడం చాలా తప్పు అని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని, క్షమాపణ చెప్పాల్సిందేనని నిలదీశారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్య­త వహిస్తారని, రెండు సభలకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మండలికి రావాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ ఆలోచన ఏంటి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూశామా? మనల్ని మనమే కించపరుచుకుంటే.. ఎలా? ఇదేనా సభాధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం’’ అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు 
చైర్మన్‌ విచారం వ్యక్తం చేయడంతో ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. షేమ్‌..షేమ్‌.. సభానాయకుడు వచ్చి వివరణ ఇవ్వాలి.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ మండలిని హోరెత్తించారు. ఈ దశలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ‘‘చైర్మన్‌ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు లేవనెత్తిన అంశం చాలా సున్నితమైనది. 

ఈ అంశంలోకి కులాలను తీసుకురావడం సరికాదు. ఏం జరిగిందో తెలుసుకుని చక్కదిద్దే యత్నం చేద్దాం. ఎందుకు ఈ  పొరపాటు జరిగిందో స్పీకర్, కార్యదర్శితో మాట్లాడి తెలియజేస్తున్నాం. దీనికి కమిటీ ఉంది. ప్రివిలేజ్‌ కమిటీని అడగండి. మీరు  సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదు’’ అంటూ చెప్పుకొచ్చారు. తానిప్పుడే కార్యదర్శితో మాట్లాడానని, విప్‌ల భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించని విషయం తనకు తెలియదు కానీ.. తిరుపతి కార్యక్రమానికి మిమ్మల్ని (చైర్మన్‌ను) పిలిచారని చెప్పారని మంత్రి అచ్చెన్న వ్యాఖ్యానించడంతో  చైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

‘మంత్రి చెబుతున్న ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా.. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇది ముమ్మాటికీ సభను తప్పుదోవ పట్టించడమే. ఏం జరిగిందో సభలో పెట్టండి చర్చిద్దాం. వ్యవస్థ గురించి మాట్లాడేందుకు సిద్ధమైతే కావాలంటే వేరొకర్ని చైర్మన్‌ స్థానంలో కూర్చొబెడదాం’’ అంటూ చైర్మన్‌ పేర్కొన్నారు. 

ప్రివిలైజ్‌ కమిటీలో చర్చిద్దామన్న మంత్రులు..క్షమాపణ చెప్పాల్సిందేనన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
మండలిలో ఏ వ్యవహారాలు జరిగినా ప్రభుత్వానికి, సీఎంకు సంబంధాలు ఉండవు. అసెంబ్లీ, మండలిలో ఏ కార్యక్రమం జరిగినా సీఎంకు సంబంధం ఉండదు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయడం సరికాదు. ఈ అంశాన్ని ప్రివి­లైజ్‌ కమిటీలో పెట్టి మాట్లాడదాం. జరిగిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకుందాం’’ అంటూ మంత్రులు అనగానే ప్ర­తి­పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన అవమానాలకు బాధ్యత వహిస్తూ సభానాయకుడు మండలికి వచ్చి చైర్మన్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక మండలిని శనివారానికి వాయిదా వేశారు.

‘చాలా అవమానకరంగా ఉంది’ : మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు
‘ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి..ఈ అంశంపై నేను చర్చించడం బాగుండదు. కావాలంటే ప్యానల్‌ స్పీకర్‌ను కూర్చోబెడతాను. ఇది నాకు చాలా ఎంబరాసింగ్‌గా ఉంటుంది’ అంటూ చైర్మన్‌ మోషేన్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలనూ మోషేన్‌రాజు తీవ్రంగా ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement