ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం: ఉత్తమ్
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో సోమవారం ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు పాత పెద్ద నోట్ల రద్దు అంశంతో పాటు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడతామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.