ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 19 నుంచి 26 వరకు నామినేషన్లు
మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్
ధన ప్రవాహానికి పక్కా ప్రణాళికలు
ఏలూరు సిటీ : రాజకీయ చైతన్యానికి ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికకు నగారా మోగటంతో రేసులో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈనెల 19నుంచి 26తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 2వరకు గడు వు విధించారు. మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్ చేపడతారు. మాజీ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి కృష్ణారావు, పీడీఎఫ్ మద్దతుతో బరి లోకి దిగిన సామాజికవేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థులుగా పిల్లి డేవిడ్‌కుమార్, విశ్రాంత పీడీ సత్యనారాయణ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలోనూ రూటే సెప‘రేటు’ అన్నట్టుగా అభ్యర్థులు ధన ప్రవాహాన్ని పోటెత్తించేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇద్దరు అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో భారీగా నజరానాలు వెదజల్లగా, ఈ సారి అంతకంటే ఎక్కువగా సొమ్ములు, బహుమతులు పంపిణీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాయిలాల పంపిణీ బాధ్యతలను కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు అప్పగించిన నాయకులు, ఇతర సంఘాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గాలం వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో 9,250మంది ఓటర్లు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 12,654 మంది ఉన్నారు. వీరిలో అగ్రస్థానం ఉపాధ్యాయులదే. ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఓటర్లు సుమారు 13వేల నుంచి 14వేల మంది ఉంటారని అంచనా. అధ్యాపకులు, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఓటర్లు 7వేల మంది ఉన్నట్టు తెలుస్తోంది.
మండలి వే‘ఢీ’
Published Mon, Feb 16 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement