నామినేషన్ల జోరు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో నామినేషన్ల స్వీకరణ గురువారం ఆరో రోజుకు చేరుకుంది. ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ స్థానాలకు 9మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 58 మంది అభ్యర్ధులు 82 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గోపాలపురం సెగ్మెంట్ నుంచి గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
పార్లమెంటరీ స్థానాలకు...
ఏలూరు పార్లమెంటరీ స్థానానికి తోట చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ), ముసునూరి నాగేశ్వరరావు (కాంగ్రెస్), ఉడా వెంకటేశ్వరరావు (ఇండిపెండెంట్) నామినేషన్లు దా ఖలు చేశారు. నరసాపురం పార్లమెంటరీ స్థానానికి వైఎ స్సార్ సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన వంక రవీంద్రనాథ్ గురువారం మరో రెండు సెట్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇదే స్థానానికి గోకరాజు గంగరాజు (బీజేపీ), ఆయన కుమారుడు వెంకట కనక రంగరాజు (డమ్మీగా), కనుమూరి రఘురామకృష్ణంరాజు (బీజేపీ, టీడీపీ) అతని భార్య రమాదేవి (బీజేపీ, టీడీపీ) నామినేషన్లు వేశారు. ప్రత్తి సూర్యనారాయణ, మేడపాటి వరహాలరెడ్డి (ఇండిపెండెంట్) కూడా నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు.
14 అసెంబ్లీ సెగ్మెంట్లలో...
ఏలూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్ అల్లూరి వెంకటపద్మరాజు (కాంగ్రెస్), షేక్ మస్తాన్ బాషా (ఆమ్ ఆద్మీ) నామినేషన్లు వేశారు. తాడేపల్లిగూడెం స్థానానికి తోట గోపీ (వైఎస్సార్ సీపీ) మరో రెండు సెట్లు, ఆయన భార్య మంగాదేవి మరో రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఇదే స్థానానికి పైడికొండల మాణిక్యాలరావు, యేగిరెడ్డి సత్యనారాయణ (టీడీపీ), సీతాల మోహన్‌చందు (ఇండిపెండెంట్), కొల్లేపర పూర్ణచంద్రరావు (ఇండిపెండెంట్), దెందులూరు స్థానానికి చింతమనేని ప్రభాకర్ (టీడీపీ), కమ్మ శివరామకృష్ణ (జై సమైక్యాంధ్ర), పాలకొల్లు నుంచి త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (టీడీపీ), స్వతంత్ర అభ్యర్థులుగా గుమ్మాపు సూర్యవరప్రసాద్, అలిగి పాండురంగారావు,
మేడిది రాజబాబు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆచంట స్థానానికి ముదునూరి ప్రసాదరాజు (వైఎస్సార్ సీపీ), ఆయన సతీమణి శారదావాణి, రాయపల్లి మధుకిరణ్ (ఇండిపెండెంట్), కాతా డెంకలయ్య (మహాజన పార్టీ), చింతలపూడిలో డాక్టర్ మద్దాల దేవీప్రియ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), కోటా రత్నం (బీఎస్పీ), బలువూరి నర సింహరావు (ఇండిపెండెంట్), ప్రత్తిపాటి ప్రభుదాసు (ఎంసీపీఐ-యు), నిడదవోలు ఎస్.రాజీవ్‌కృష్ణ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), అతని భార్య అర్చన, బూరుగుపల్లి శేషారావు (టీడీపీ), అతని భార్య విశాలాక్షి, జీడిగుంట్ల భాస్కర శ్రీరామకృష్ణ (లోక్‌సత్తా), స్వతంత్య్ర అభ్యర్థులుగా చిట్టూరి సూర్యనారాయణ, జక్కంశెట్టి వెంకటరాకేష్ నామినేషన్లు వేశారు. భీమవరంలో వీరవల్లి రామకృష్ణ, బొక్కా వరదాచార్యులు (ఇండిపెండెంట్లు), గొల్లమందల ప్రమీల (ఐసీసీపీ), తటవర్తి రాజ్యలక్ష్మి (పిరమిడ్), జవ్వాది సత్యనారాయణ (లోక్‌సత్తా)
నామినేషన్లు వేశారు. ఉంగుటూరు స్థానానికి పుప్పాల వాసుబాబు (వైఎస్సార్ సీపీ), గన్ని వీరాంజనేయులు (టీడీపీ), గన్ని భరత్ (టీడీపీ), కారెం లెనిన్ (బీఎస్పీ), గెడ్డం నాగవిశ్వేశ్వరరావు, ఎలిచర్ల ప్రభుదాసు (ఇండిపెండెంట్లు), ఉండి స్థానానికి చోడదాసి వెంకటేశ్వరరావు (ఇండిపెండెంట్), నర్సాపురం నుంచి తాడిమేటి కృష్ణవేణి (పిరమిడ్ పార్టీ), కట్టా వేణుగోపాల్ కృష్ణ (ఇండిపెండెంట్) నామినేషన్లు దాఖలు చేశారు. తణుకు స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి చీర్ల రాధయ్య సతీమణి చీర్ల పద్మశ్రీ (డమ్మీ), కొడమంచిలి సత్యనారాయణ, ఇరగవరపు మణికంఠం, శీరం సత్యనారాయణ (ఇండిపెండెంట్లు), కొవ్వూరు స్థానానికి బూసి సురేంద్రబెనర్జీ (బీజేపీ), అరిగెల అరుణకుమారి (కాంగ్రెస్), పోలవరం స్థానానికి కంగల పోసిరత్నం (కాంగ్రెస్), ఆమె భర్త కంగల శ్రీరామ్, తెల్లం రామకృష్ణ (సీపీఎం), పోలోజు నాగేశ్వరరావు (డమ్మీ), సోడెం వెంకటేశ్వరరావు (సీపీఐ) నామినేషన్లు దాఖలు చేశారు.