ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో నామినేషన్ల పర్వం ఐదో రోజైన బుధవారం ఊపందుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజున మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యూయి. దీంతో ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్య 76కి చేరింది. బుధవారం ఏలూరు లోక్‌సభ స్థానానికి 8, నరసాపురం లోక్‌సభ స్థానానికి 2, అసెంబ్లీ సెగ్మెంట్లకు 44 నామినేషన్లు దాఖలయ్యూరుు.
అట్టహాసం నడుమ...
నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థి వంక రవీంద్రనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీగా ఆయన భార్య, తణుకు మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ వంక రాజకుమారి నామినేషన్ వేశారు. ఇదే స్థానానికి ప్రేమ్ జనతాదళ్ అభ్యర్థిగా గీతా దాస్ నామినేషన్ సమర్పించారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), డమ్మీగా ఆయన సతీమణి పద్మవల్తీదేవి నామినేషన్లు వేశారు. ఏలూరు ఎంపీ స్థానానికి ఎంసీపీఐ (యు) తరఫున శావనపూడి నాగరాజు, బహుజన సమాజ్ పార్టీ నుంచి నేతల రమేష్‌బాబు, జనవాహిని పార్టీ నుంచి సీవీ శారదాదేవి, స్వతంత్ర అభ్యర్థులుగా కోరుకొండ విజయలక్ష్మి పండిట్, నన్నపనేని గంగాధరరావు, ఈలప్రోలు చంద్రశేఖర్ నామినేషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ స్థానాలకు ఇలా... : ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), టీడీపీ అభ్యర్థిగా బడేటి కోటరామారావు (బుజ్జి), జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి మధ్యాహ్నపు బలరామ్, జనవాహిని పార్టీ అభ్యర్థిగా డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ బాబు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుంచి కె.పోలారి, లోక్‌సత్తా అభ్యర్థిగా చిక్కా భీమేశ్వరరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా రేవతిప్రసాద్, కోరుకొండ విజయలక్ష్మి పండిట్ నామినేషన్లు వేశారు. భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రంధి శ్రీని వాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా యార్లగడ్డ రాము,
సమైక్యాంధ్ర పార్టీ నుంచి వి.మధువర్మ, లోక్‌సత్తా నుంచి జవ్వాది సత్యనారాయణ, బీఎస్పీ నుంచి యాళ్ల పెద్దిరాజు నామినేషన్లు వేశా రు. ఆచంట టీడీపీ అభ్యర్థిగా పితాని సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. తణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీర్ల రాధయ్య, అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ, నరసాపురం అసెంబ్లీ స్థానానికి టీడీ పీ తరఫున చేగొండి సూర్యప్రకాష్, లోక్‌సత్తా నుంచి నల్లం సూర్యచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ఇందుకూరి వరప్రసాదరాజు నామినేషన్లు సమర్పించారు. కొవ్వూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానేటి వనిత, డమ్మీగా జొన్నకూటి బాబాజీరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా అరిగెల అరుణకుమారి, పాలకొల్లు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుణ్ణం నర్సింహ నాగేం ద్రరావు (నాగబాబు), టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, కాంగ్రెస్ అభ్యర్థిగా కరిమెరక బాలనాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కడలి భాస్కరరావు, బీఎస్పీ అభ్యర్థిగా కంది సుందరరామ్మూర్తి,
స్వతంత్ర అభ్యర్థిగా వజ్రపు ధర్మరాజు, నిడదవోలు కాంగ్రెస్ అభ్యర్థిగా కామిశెట్టి సత్యనారాయణ, బీఎస్పీ తరఫున గుమ్మాపు చిత్రసేన్, తాడేపల్లిగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా దేవతి పద్మావతి నామినేషన్లు సమర్పించారు. తాడేపల్లిగూడెం టీడీపీ, స్వతంత్ర అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ ఒక్కొక్క నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గానికి సీపీఐ అభ్యర్థిగా మండల నాగేశ్వరరావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అడ్డాల సత్యనారాయణ, స్వతం త్ర అభ్యర్థిగా మంచాల నాగేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఉండి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గాదిరాజు లచ్చిరాజు, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా బి.కృష్ణగాంధీ, ఉంగుటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లి అప్పారావు నామినేషన్లు సమర్పిం చారు. గోపాలపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరాావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తలారి వెంకటేశ్వరరావు, చింతలపూడి స్వతంత్ర అభ్యర్థిగా లాగు కుమారి, మహాజన సోషలిస్ట్ పార్టీ నుంచి సొంగా విజయ నామినేషన్లు వేశారు. పోలవరం టీడీపీ అభ్యర్థిగా మొడియం శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థిగా నడపల సోమరాజు నామినేషన్లు దాఖలు చేశారు.
పోటెత్తిన నామినేషన్లు
Published Thu, Apr 17 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement
Advertisement