ఏలూరు, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో ఘట్టమైన పరిశీలన కార్యక్రమం సోమవారం సజావుగా ముగి సింది. పరిశీలన అనంతరం ఏలూరు లోక్‌సభా స్థానంలో ఒకరు, నరసాపురం లోక్‌సభా స్థానంలో ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యూరుు. రెండు ఎంపీ స్థానాల్లో 33 మంది, అసెంబ్లీ స్థా నాల్లో 205 మంది నామినేషన్లు సజావుగా ఉన్నట్లు తేల్చారు. ప్రధాన అభ్యర్థులకు డమ్మీలుగా దాఖలైన నామినేషన్లను బీఫారాలు ఇవ్వలేదనే కారణంతో తిరస్కరించారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ప్రతిపాదకులతో సంతకాలను పూర్తిగా చేరుుంచకపోవడం వల్ల వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యూరుు. ఏలూరు లోక్‌సభా స్థానానికి ఆంధ్రరాష్ట్ర ప్రజా సమతి పార్టీ అభ్యర్థి గోవాడ కనకదుర్గ నామినేషన్ పత్రాలపై తక్కువ మంది ప్రతిపాదకులు సంతకాలు చేయడంతో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ తిరస్కరించారు. ఈ స్థానంలో మిగిలిన 17 మంది నామినేషన్లు సజావుగానే ఉన్నట్లు తేల్చారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కనుమూరి రఘురామకృష్ణంరాజు, అతని భార్య రమాదేవి బీజేపీ, టీడీపీ తరఫున వేసిన నామినేషన్లకు బీఫారాలు సమర్పించకపోవడంతో తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజుకు డమ్మీగా ఆయన కుమారుడు గోకరాజు కనక రంగరాజు సమర్పించిన నామినేషన్‌ను సైతం బీ ఫారం ఇవ్వలేదనే కారణంతో తిరస్కరించారు.
47 మంది అవుట్
Published Tue, Apr 22 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM
Advertisement