నాలుగో రోజు 16
ఏలూరు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. నాలుగో రోజైన మంగళవారం ఏలూరు లోక్‌సభ స్థానానికి ఒక నామినేషన్ దాఖలు కాగా, 9 అసెంబ్లీ స్థానాలకు 15మంది నామినేషన్లు వేశారు. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ఏలూరు పార్లమెంటరీ స్థానం నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియూ అభ్యర్థిగా టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన ఉప్పల వెంకటరామారావు నామినేషన్ వేశారు.
పోలవరంలో తుమ్మెర హరిప్రసాద్, నిడదవోలులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ముక్కాముల అన్నవరప్రసాద్, ఆచంటలో సీపీఎం తరఫున కేతా గోపాలన్, పాలకొల్లు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గంపల మల్లికార్జునరావు, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ నయూబ్స్రూల్, నరసాపురంలో ఇండిపెండెంట్లుగా కూనపరెడ్డి వీరవెంకట రంగారావు, కూనపరెడ్డి నాగవెంకటలక్ష్మి, తణుకులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండి యా అభ్యర్థి కోటిపల్లి వెంకట శ్రీనివాస్, తాడేపల్లిగూడెంలో సమైక్యాంధ్ర పార్టీ తరఫున మరపట్ల రాజు, బీఎస్పీ నుంచి గుంపుల సత్యకృష్ణ, ఎంసీసీఆర్(ఎంఐ) తరఫున సరిపల్లి కుమార్‌రాజు, ఉంగుటూరులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పెరుమాళ్ల మురళీ కృష్ణ, దెందులూరులో కాంగ్రెస్ తరఫున మాగంటి వీరేంద్రప్రసాద్ (బబ్బు) నామినేషన్లు వేశారు. కొవ్వూ రు, భీమవరం, ఉండి, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
నేడు, రేపు జాతర
ఈనెల 16, 17 తేదీలు మంచి రోజులుగా భావిస్తున్న అత్యధికులు ఆ రెండు రోజుల్లో నామినేషన్లు వేసేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల నాని, టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి, పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు బుధవారం నామినేషన్లు వేయనున్నారు.
17న తోట చంద్రశేఖర్ నామినేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ముసునూరి నాగేశ్వరరావు అదే రోజున నామినేషన్ వేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.