పతనం దిశగా టీడీపీ
సాక్షి, ఏలూరు : ఎన్నో కుట్రలు.. మరెన్నో కుతంత్రాలు.. పదవులో ఉన్నన్నాళ్లు అక్రమాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు అధికారమే పరమావధిగా ఈ ఎన్నికల్లోనూ అడ్డదారులు తొక్కుతున్నారు. టక్కుటమార విద్యలెన్నో ప్రదర్శిస్తున్నారు. అబద్ధాన్ని వందసా ర్లు చెప్పడం ద్వారా అదే నిజమని భ్రమింపచేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యూరు. అయి నా ప్రజాక్షేత్రంలో చతికిలపడక తప్పడం లేదు. టీడీపీ అధినేతతోపాటు ఆ పార్టీ అభ్యర్థులు చెబుతున్న మాటల్లోని అంతరార్థాన్ని, ఇస్తున్న హామీల్లోని డొల్లతనాన్ని ప్రజలు పసిగడుతున్నారు. వాస్తవాలను గుర్తిస్తున్నారు. అరుునా.. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నాలను మాత్రం టీడీపీ నేతలు మానుకోవడం లేదు.
అద్దె జనమే దిక్కు
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమకు తెలి సిన పద్ధతుల్లో ప్రజల్ని ఓట్లు అభ్యర్థించడం సహజం. కొందరు
అంతకుముందు తాముచేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయమని అడుగుతారు. మరికొందరు తమకు అధికారమిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని చెబుతారు. టీడీపీ నేతలు, అభ్యర్థులు మాత్రం ఇందుకు భిన్నంగా కొత్త పద్ధతుల్ని అవలంభిస్తున్నారు. వక్రమార్గాల్లో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కులాల చిచ్చు పెడుతున్నారు. ఆర్థిక అంశాలతో ప్రభావితం చేస్తున్నారు. అయినా జనం రావడం లేదంటే వారిపై ప్రజలకు ఎంతటి అపనమ్మకం ఉందో అర్థమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయూనికి లేని బలాన్ని ఉన్నట్లుగా సంబరపడిపోయి, దానినే ప్రచారం చేసుకుని ధీమాగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు క్రమక్రమంగా తమ బలమేంటో అర్థమైంది.
జనం ఛీ కొడుతున్నారన్న విషయం తెలిసొచ్చింది. ఆ పార్టీ తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థుల వెంట ప్రచారానికి పట్టుమని పదిమంది కూడా రావడం లేదు. జనం లేకుండానే ముఖ్య నాయకులు రోడ్ షోలు, పర్యటనలు సాగిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు తరుణోపాయం ఆలోచించారు. రోజుకు ఇంత ఇస్తామంటూ కాంట్రాక్టు పద్ధతిపై కిరారుు మనుషుల్ని సమకూర్చుకుంటున్నారు. ఎన్ని రోజులు ప్రచారంలో పాల్గొనాలి, ఎంత సమయం వెంట తిరగాలి అనేది ముందుగానే ఒప్పందం చేసుకుని దానికి తగ్గట్టుగా సొమ్ములు ఇచ్చేవిధంగా కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నారు. అలా తెచ్చిన వారిని చూపించి తమ వెనుక జనం ఉన్నారని చెప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కొన్నిచోట్ల వారిని ఛీదరించుకోవడంతో అభ్యర్థుల వెంట వెళుతున్న కిరారుు మనుషులు సైతం ‘ఎందుకొచ్చాంరా బాబూ’ అని నిట్టూరుస్తున్నారు.
టీడీపీ ఇక కనుమరుగే
ప్రచారానికే పాట్లు పడుతున్న టీడీపీ ఈ ఎన్నికల్లో పూర్తిగా పతనమై, కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు సైతం తమ గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. కొన్నిచోట్ల డబ్బులు దండగ అనుకుని ప్రచారం మానేస్తుంటే.. కొన్నిచోట్ల తప్పదన్నట్టు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న ఓటర్లు తమను కష్టాల్లో ఆదుకునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.