కౌంటింగ్‌కు రెడీ
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏలూరు, భీమవరం పట్టణాల్లో పక్కా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం, దాని పరిధిలోని ఏలూ రు, దెందులూరు, ఉంగుటూరు, చింతల పూడి, పోలవరం అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వట్లూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో చేపడతారు. రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపును వట్లూరులోని సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం, దాని పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను భీమవరంలోని విష్ణు విద్యాసంస్థల క్యాంపస్‌లో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికార యం త్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం వరకు నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నా రు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, వాటికి సమీపంలో జనం పెద్దఎత్తున గుమిగూడి ఉండటం నిషేధం. ఎక్కువ సంఖ్యలో వాహనాల రాకపోకలను నిషేధించారు.
కౌంటింగ్ ఇలా...
తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం బ్యాలెటింగ్ యూనిట్లను ఏడేసి చొప్పున స్ట్రాంగ్ రూమ్‌లనుంచి బయటకు తీసుకొస్తారు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఏడు టేబుల్స్‌పై ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్‌ను ఉంచి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజల్ట్ బటన్‌ను మీటుతారు. అదేవిధంగా ఎంపీ ఓట్లకు సంబంధించిన బ్యాలెటింగ్ యూనిట్లను ఒక్కొక్క టేబుల్‌పై ఒక్కొక్కటి చొప్పున ఉంచి రిజల్ట్ బటన్ మీటుతారు. వాటి పైభాగంలో డిస్ప్లే అయ్యే ఫలితాలను నమోదు చేసుకుం టారు.
ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ దాదాపు 24నుంచి 36 రౌండ్లలో పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపు విరామం లేకుండా కొనసాగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిద్ధార్థ జైన్ చెప్పారు. భోజన విరామ సమయం ఉండదని తెలిపారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు శుక్రవారం ఉదయం 7 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్ర రంభిస్తామని తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. 8 గంటలలోపు వచ్చే ప్రతి పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్నా రు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలకులు తనిఖీ చేస్తారని వివరించారు.
పోలింగ్ శాతం ఇలా...
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో సగటున 82.74 శాతం ఓట్లు పోలయ్యాయి. 15 నియోజకవర్గాల్లోని 3,055 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 29,21,520 మంది ఓటర్లు ఉండగా, 24,17,337 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా 86.60 శాతం ఓట్లు పోల య్యూరుు. అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో 70.45 శాతం పోలింగ్ నమోదైంది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 83.62 శాతం నమోదైంది. మొత్తం 14,27,300 మంది ఓటర్లకు గాను 11,93,449 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 13,24,380 మంది ఓటర్లు ఉండగా, 10.82,754 మంది ఓటేశారు. ఇక్కడ 85.62 శాతం పోలింగ్ నమోదైంది.