ఏజెంట్సే అధికం
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలేందుకు కొద్దిగంటల సమయమే మిగిలి ఉంది. శుక్రవారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు యంత్రాం గం ఏర్పాట్లు చేసింది. ఈసారి కౌంటింగ్ పరిశీలనకు అభ్యర్థుల తరఫున వెళ్లే ఏజెంట్ల సంఖ్య భారీగా ఉండబోతోంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఏలూరు, నరసాపురం లోక్‌సభా స్థానాల్లో 29మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 169 మం ది అభ్యర్థులు ఉండగా, ఒక్కొక్క అభ్య ర్థి తరఫున 8మంది చొప్పున మొత్తం గా 1,536మంది ఏజెంట్లు కౌంటింగ్‌కు హాజరు కానున్నారు. అభ్యర్థులు, వారి తరఫున హాజరయ్యే ఏజెంట్లతో కలిపి మొత్తంగా 1,705 మంది వ్యక్తులు కౌంటింగ్ హాల్స్‌లో ఉంటారు. మరో విషయం ఏమిటంటే.. అభ్యర్థుల తరఫున వెళ్లే ఏజెంట్లు అందరూ మగవారే కావడం. మహిళా ఏజెంట్లు పదుల సం ఖ్యలో కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. అభ్యర్థులంతా పురుషులనే ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. ఇదిలావుండగా, ఓట్ల లెక్కింపునకు కేవలం వెరుు్యమంది సిబ్బందిని మాత్రమే వినియోగిస్తుండగా, ఏజెం ట్లు 1,536 మంది ఉండటం విశేషం.
8మంది చొప్పున ఎందుకంటే...
ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రతి అభ్యర్థి 8 (7+1) మంది చొప్పున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కల్పించారు. ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియకు ఏడు టేబుల్స్ చొప్పున వినియోగించాలని యంత్రాంగం నిర్ణరుుంచింది. కౌంటిం గ్‌కు ఎన్ని టేబుల్స్‌ను వినియోగిస్తే.. అంతమంది ఏజెంట్లను అనుమతి స్తారు. ఈ దృష్ట్యా ఏడు టేబుల్స్‌లో ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరఫున ఒక్కొక్క ఏజెంట్‌ను అనుమతిస్తారు. మరో ఏజెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఉండి ఓట్ల వివరాలను సరిచూసుకునే అవకాశం కల్పించారు. ఏలూరులో అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 17 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారందరి తరఫున మొత్తంగా 136 మంది ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌లో అడుగుపెట్టనున్నారు. మొత్తంగా అన్నిచోట్ల కలిపి ఎంతమంది ఏజెంట్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తూ పాస్‌లు జారీ చేస్తారనేది గురువారం తేలనుంది.
ఏజెంట్ల నియూమకం ఇలా...
కౌంటింగ్ ఏజెంట్ల నియామకం గురువారం నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ తరఫున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫారం-18ను పూర్తిచేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉం టుంది. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఏజెంట్లుగా వ్యవహరిం చేందుకు అర్హులు. నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులనైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. అరుుతే, ఏజెంటుగా వెళ్లేవారు నేర చరితులు కానివారై ఉండాలి.
సిట్టింగ్‌లకు ప్రవేశం లేదు
ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి కౌంటింగ్ హాల్‌లోకి కేంద్ర, రాష్ట్ర మంత్రులను, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎమ్మెల్సీలను అనుమతించరు. దీంతోపాటు రాష్ట్ర, జాతీయ సహకార సంస్థల ప్రతినిధులు, రాజకీయంగా నియమితులైన ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా నియమించుకోవడం నిషేధం. అదేవిధంగా వీళ్లెవరూ కౌంటింగ్ కేంద్రంలోకి రాకూడదు. అరుుతే, పోటీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లి పరిశీలన చేసుకోవచ్చు.
ఏలూరు, భీమవరంలో కౌంటింగ్
ఏలూరు లోక్‌సభ, దాని పరిధిలోని ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపును వట్లూరులోని రామచంద్రరావు ఇంజినీరింగ్ కళాశాలలో చేపడతారు. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం సెగ్మెంట్ల ఓట్లను వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఓట్లతోపాటు దాని పరిధిలోని తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను భీమవరంలోని విష్ణు కళాశాలలో లెక్కిస్తారు.