నేడు ‘వైఎస్సార్ జనభేరి’ | YSR Jana Bheri in Eluru | Sakshi
Sakshi News home page

నేడు ‘వైఎస్సార్ జనభేరి’

Published Wed, Apr 16 2014 12:58 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

నేడు  ‘వైఎస్సార్ జనభేరి’ - Sakshi

నేడు ‘వైఎస్సార్ జనభేరి’

 ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సాధారణ ఎన్నికల ప్రచార కా ర్యక్రమంలో భాగంగా ఉదయం చింతలపూడిలో, సాయంత్రం గోపాలపురంలో నిర్వహించే జనభేరి సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఉదయం 9 గంటలకు చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విజయమ్మ రోడ్ షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చింతలపూడి వరకూ రోడ్ షో సాగుతుంది. ఉదయం 10 గంటలకు చింతలపూడిలో జరిగే జనభేరి సభలో విజయమ్మ మాట్లాడతారు.
 
 సాయంత్రం 4 గంటలకు గోపాలపురం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని జనభేరి సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కన్వీనర్ తలశిల రఘురాం షెడ్యూల్ విడుదల చేశారు. నాయకులు, కార్యకర్తలు విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కొవ్వూరు నియోజకవర్గంలోనూ విజయమ్మ పర్యటనను ఏర్పాటు చేయాలని మొదట భావించినా సమయాభావం వల్ల చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాలకే పరిమితం చేశారు. ఇదిలావుండగా, వైఎస్ విజయమ్మ మంగళవారం రాత్రి లింగపాలెం మండలం ధర్మాజీగూడెం చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement