ఆరు నామినేషన్లు ఉపసంహరణ | six nominations withdrawal in Eluru | Sakshi
Sakshi News home page

ఆరు నామినేషన్లు ఉపసంహరణ

Published Wed, Apr 23 2014 12:38 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

six nominations withdrawal in Eluru

ఏలూరు, న్యూస్‌లైన్: నామినేషన్ల ఉపసం హరణ పర్వం మొదలైంది. మంగళ వారం ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇద్దరు, నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసిన మాగంటి పద్మవల్లిదేవి, స్వతంత్ర అభ్యర్థి ఈలప్రోలు చంద్రశేఖర్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తపల్లి జానకిరామ్, పాలకొల్లులో మేకా శశికళ, చింతలపూడిలో స్వతంత్ర అభ్యర్థి లాగు కుమారి, తాడేపల్లిగూడెంలో తోట మంగాదేవి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బుధవారం 3గంటల వరకే ఉపసంహరణకు గడువు ఉంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఆ పార్టీ తరఫున చాలాచోట్ల రెబల్స్ బరిలో ఉండటం టీడీపీని వణికిస్తోంది. ఉపసంహరణ పర్వం పూర్తికాగానే ఎక్కడికక్కడ బరిలో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటారుుస్తారు. తెలుగు అక్షర క్రమంలో అభ్యర్థులకు వాటిని కేటాయిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement