‘నోటా’ మాట
- జిల్లాలో నోటా ఓటు వినియోగించిన ఓటర్ల సంఖ్య 15,334
- పాలకొల్లులో అత్యల్పం.. పోలవరంలో అత్యధికం
ఏలూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్) ఓటును జిల్లాలో 15,334 మంది వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులలో ఎవరూ నచ్చకపోతే ఆ విషయూన్ని తెలియజేసేందుకు ఓటర్లకు నోటా అవకాశాన్ని కల్పిం చాలంటూ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా అందుబాటులోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 29లక్షల 21వేల 520 మంది ఓటర్లు ఉండగా, వారిలో 24లక్షల 17వేల 337 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా నోటా కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున వె మందికి పైగా వ్యతిరేక ఓటును ఉపయోగించుకున్నారు. నోటా బటన్ నొక్కి ఈ అభ్యర్థులు మాకొద్దని చెప్పారు. అత్పల్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో 739 మంది నోటా బటన్‌ను మీటగా.. గిరిజనులు ఉండే పోలవరం నియోజకవర్గంలో అత్యధికంగా 1,738 మంది నోటా ఓటును వినియోగించి ఈ విషయంలో అందరికంటే తమకే చైతన్యం అధికమని నిరూపించుకున్నారు.