పల్లవి : ఓటమ్మా... నీకు దండమే
నా మాట వింటవా ఓటమ్మా
చరణం 1 :
ప్రజాస్వామ్యానికి నీవు
ప్రతిరూపమే...ఓటమ్మా
ఐదేళ్లకోసారి నీవు
ఓట్ల పండుగై
వస్తున్నావÐమ్మా
అందరినొకసారి
పలుకరిస్తవే నీవు
నీ పండుగైపోయాక
మాటాడవెందుకే ఓటమ్మా
– ఓటమ్మా... నీకు
చరణం 2 :
రాముని చేతిలో బాణం..
నీవమ్మా
విష్ణు చేతిలో
చక్రములే తిరుగుతున్నావు
నోటుకు, మత్తుకు,
కులాల కుంపట్ల మధ్య నీవు
వజ్రాయుధమే నీవు ఓటమ్మా
అమ్ముడు పోకే ఓటమ్మా
– ఓటమ్మా...నీకు
చరణం 3 :
అంబేద్కరూ కలం చేత నీవు
జ్ఞానమై వెలిగిన ఓటమ్మా
ఈ జగతిలో బ్రహ్మాస్త్రం నీవు
ఓటేసే మహాశయులారా
ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాము
ఆలోచించి ఓటు వేయీ నీవు
అప్పుడే ఓటమ్మా ఎల్లకాలం ఉంటుంది
– ఓటమ్మా...నీకు
– పానుగంటి నాగన్న, జానపద కళాకారుడు, వెంకటాపురం, వనపర్తి
ఓటు వజ్రాయుధం (పాట)
Published Tue, Nov 27 2018 8:59 AM | Last Updated on Tue, Nov 27 2018 9:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment