నా చివరి రక్తం బొట్టు వరకు.... | Chandrababu naidu visits eluru | Sakshi
Sakshi News home page

నా చివరి రక్తం బొట్టు వరకు....

Published Sat, Aug 15 2015 5:17 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

నా చివరి రక్తం బొట్టు వరకు.... - Sakshi

నా చివరి రక్తం బొట్టు వరకు....

ఏలూరు: నా చివరి రక్తం బొట్టు వరకు గోదావరి జిల్లాలకు అన్యాయం చేయనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చంద్రబాబు మాట్లాడుతూ... పాడిపూడి నుంచి పోలవరం కాల్వ ద్వారా కృష్ణాకు నీరు తరలిస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా అవసరాలు తీరిన తర్వాతే తాడిపూడి నుంచి పోలవరం కాల్వకు మళ్లీస్తామని తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో పట్టిసీమ నుంచి నీటిని వదులుతామన్నారు. 2018 కంటే ముందే పోలవరం నిర్మిస్తామని చెప్పారు.

కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామన్నారు. నదుల అనుసంధానం కలను నిజం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్దే అని తెలిపారు. పంద్రాగస్టు రోజున పట్టిసీమను జాతీకి అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు. నెలాఖరు కల్లా తోటపల్లి నుంచి విజయనగరం జిల్లాకు నీరు అందిస్తామని వెల్లడించారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement