
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది.
ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.