notification release
-
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్‌వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.ఈ మేరకు జూలై 2వ (నేడు) నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 5న కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 15 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించింది. 19న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20 నుంచి 22లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు (దివ్యాంగులు, ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) సర్టిఫికెట్లను 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనుంది.ఈ విద్యార్థులు విజయవాడలోని ఎస్ఆర్ఆర్, విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాలి. ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ (https://cets.apsche.ap.gov.in/ APSCHE/OAMDC23/OAMDCHome.html) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. -
ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్, జ్ఞానేశ్
న్యూఢిల్లీ: నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్రం నియమించింది. వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్‌కు పంపించింది. కాగా, వీరి నియామక విధానాన్ని సంబంధిత సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. ‘‘ ఈ పేర్లను పరిశీలించాలంటూ 212 మంది పేర్ల జాబితాను గత రాత్రి నాకు ఇచ్చారు. తెల్లారితే సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన భేటీ ఉంది. రాత్రి ఇచ్చి మధ్యాహ్నంకల్లా 212 మందిలో ఎలక్షన్ కమిషనర్‌గా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపికచేయడం మానవమాత్రులకు సాధ్యమా? బుధవారం ప్యానెల్ భేటీ జరగడానికి కేవలం 10 నిమిషాల ముందు తుది జాబితా అంటూ ఆరు పేర్లున్న లిస్ట్ ఇచ్చారు. ఈ తుది జాబితా నుంచి సుఖ్బీర్, జ్ఞానేశ్‌ల పేర్లను ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారుచేశారు. అయితే ఈ ప్రతిపాదిత పేర్లలో ఈ ఇద్దరినే ఎందుకు ఎంపిక చేశారో నాకైతే అర్ధంకాలేదు. సుప్రీంకోర్టు గత తీర్పు ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఈ ఎంపిక కమిటీలో ఉంటే బాగుండేది’ అని అధీర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్యానెల్లో మోదీ, అ«దీర్తోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే గత నెల 14వ తేదీన రిటైర్ కావడం, మరో ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్, జ్ఞానేశ్‌లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. అఖిలభారత సరీ్వస్లోకి రాకముందు సుఖ్బీర్ అమృత్‌సర్‌లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కలి్పంచిన ఆరి్టకల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నూతన ఎలక్షన్ కమిషనర్లను ఎంపికచేసేందుకు సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో విపక్షనేతలతో సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటుచేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరిచింది. దీనికి అనుగుణంగా కేంద్రం చట్టం చేసింది. కానీ సీజేఐకి బదులు కేంద్రమంత్రికి ప్యానెల్లో స్థానం కలి్పంచింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం కోర్టు విచారణ జరగనుంది. -
వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 234 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. 7 వరకు దరఖాస్తులకు అవకాశం కాగా ఎన్హెచ్ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్ వైద్య పోస్టులకు http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డుకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది. -
జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగుతుంది. పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల హాల్ టికెట్లు పరీక్షకు మూడు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మిగతా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. తొలి దశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఉంటుంది. రెండో దశ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏ సెషన్‌కైనా, లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష పలితాలను ఫిబ్రవరి 12వ తేదీన వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులోనూ 10 టాపిక్స్, ఫిజిక్స్‌లో 12 టాపిక్స్ తీసివేత కోవిడ్ సమయంలో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ సిలబస్‌ను కుదించారు. దీంతో కొన్ని టాపిక్స్‌లో బోధన జరగలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని జేఈఈ మెయిన్స్ సిలబస్‌లోనూ ఈసారి భారీ మార్పులు చేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల్లో పది చొప్పున, ఫిజిక్స్‌లో 12 చొప్పున టాపిక్స్‌ను జేఈఈ మెయిన్స్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు. జేఈఈ పరీక్ష కఠినంగా ఉంటోందనే సంకేతాలు రావడంతో ఈసారి పరీక్ష పేపర్ కూర్పులోనూ మార్పులు చేశారు. ముఖ్యంగా గణితంలో సుదీర్ఘ పద్ధతిలో సమాధానాలు రాబట్టే ప్రశ్నల నుంచి కొంత వెసులుబాటు ఇచ్చారు. మాథ్స్‌లో కఠినంగా భావిస్తున్న ట్రిగా్నమెట్రిక్స్ ఈక్వేషన్స్, మేథమెటికల్ రీజనింగ్‌ను తొలగించారు. దీనివల్ల సమాధానాలు రాబట్టేందుకు సమయం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
ఆయుష్‌లో 156 వైద్యుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆగస్టు ఏడో తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అదే నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకోసం mhsrb.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 37, మల్టీ జోన్–2లో 17 పోస్టులను భర్తీ చేస్తారు. హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 23, మల్టీ జోన్–2లో 10 పోస్టులను భర్తీ చేస్తారు. యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 36, మల్టీ జోన్–2లో 33 భర్తీ చేస్తారు. అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18–44 ఏళ్ల వయసుగల వారై ఉండాలి. ఈ పోస్టుల పేస్కేల్ రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఖాళీలను చేర్చడం లేదా తొలగించడం.. ఏదైనా ఉంటే ఫలితాల ప్రకటన వరకు చేస్తారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక.. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. సంబంధిత అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంగా అప్లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), లోకల్ ఏరియా కోసం స్టడీ సర్టిఫికెట్ (1 నుంచి 7వ తరగతి), కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ), బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ కోరే దరఖాస్తుదారులకు తాజా ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు రుసుము కింద ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు తప్పని సరిగా రూ. 200 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. -
నాలుగేళ్ల బీఈడీ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత ఒకే సమయంలో డిగ్రీ, బీఈడీ కలిపి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుంది. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తెలంగాణలో మూడు విద్యా సంస్థలకు నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహించేందుకు అనుమతి లభించింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్ఐటీ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో 250 సీట్లు ఉంటాయి. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయవచ్చని ఎన్టీఏ పేర్కొంది. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా.. ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తెలంగాణలో మూడు కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీకి అనుమతించారు. వీటిలో మొత్తం 250 సీట్లు ఉన్నట్టు ఎన్టీఏ తెలిపింది. -
ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. -
ఎల్ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది. -
తొలి విడత నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొదటి విడత జరిగే లోక్‌సభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో కూడిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 535 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు విడతలుగా జరిపేందుకు ఎన్నికల సంఘం గత వారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏప్రిల్ 11వ తేదీన 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అత్యంత ఉత్కంఠగా జరగబోయే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, కాషాయ దళాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగేదిక్కడే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం (25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5)ల్లోని మొత్తం స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు సీట్ల చొప్పున, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లోని ఒక్కో సీటుకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 9 చోట్ల, బిహార్‌లోని 40 సీట్లకు గాను 4, పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో 2, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఒడిశాలో 4, జమ్మూకశ్మీర్ 6 సీట్లలో 2 చోట్ల కూడా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ ఆఖరు నోటిఫికేషన్ జారీ అయిన 18వ తేదీ నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీతో, నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీతో గడువు ముగియనుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 నియోజకవర్గాల్లో బరిలో మిగిలే అభ్యర్థులు ఎవరనే విషయంలో మార్చి 28వ తేదీన స్పష్టతరానుంది. అన్ని చోట్లా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అంటే, సాయంత్రం 4, 5, 6 గంటలకు ముగియనుంది. -
రూ. 20 కడితే ఆధార్ సర్వీసులు
న్యూఢిల్లీ: కస్టమర్ ధ్రువీకరణ కోసం (కేవైసీ) ఆధార్ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ ధృవీకరణ సర్వీసులకోసం ప్రతి ఈ–కేవైసీ లావాదేవికి రూ. 20 (పన్నులు సహా), ఇతరత్రా ప్రతి లావాదేవీ ధృవీకరణ (యస్ లేదా నో) కోసం రూ. 0.50 (పన్నులు సహా) చెల్లించాల్సి ఉంటుంది. అని పేర్కొంది. ‘ఆధార్ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150–200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది‘ అని అధికారిక వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్ ప్రకారం.. ► ఆధార్ సేవలను వినియోగించుకున్నాక ఇన్వాయిస్ వచ్చిన 15 రోజుల్లోగా వ్యాపార సంస్థలు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన పక్షంలో నెలకు 1.5 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ–కేవైసీ సేవలు కూడా నిల్చిపోతాయి. ► ఇప్పటికే ఆధార్ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్ ఆథెంటికేషన్ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది. ► ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఆథెంటికేషన్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్ నమోదు, అప్డేట్ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది. -
మోగిన రాజ్యసభ నగారా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 2న పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రెండేళ్ల రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సభ్యులతోపాటు.. ఇటీవల సభ్యత్వానికి రాజీనామా చేసిన, మృతిచెందిన సభ్యుల ఖాళీలను కలుపుకుని 17 రాష్ట్రాల్లో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం పెరగనుంది. 58 స్థానాలు ఏప్రిల్ 2న ఖాళీ అవనుండగా.. కేరళ ఎంపీ వీరేంద్ర కుమార్ గతేడాది డిసెంబర్లో రాజీనామా (ఏప్రిల్ 2022 వరకు సమయం ఉన్నప్పటికీ) చేసిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణల్లో.. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18 రాజ్యసభ స్థానాలుండగా.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 11కు, తెలంగాణకు 7 సీట్లను లాటరీ పద్ధతిలో నిర్ణయించారు. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితా ప్రకారం.. ఏప్రిల్ 2 తర్వాత ఏపీ నుంచి ముగ్గురు ఎంపీల (దేవేందర్ గౌడ్, రేణుక చౌదరి, చిరంజీవి) పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల (సీఎం రమేశ్, రాపోలు ఆనంద భాస్కర్) సభ్యత్వం ముగియనుండగా.. జూలై 2017న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. జాబితాలో మహామహులు.. పదవీకాలం ముగుస్తున్న సభ్యుల్లో కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, రాందాస్ అథావలే తదితరులున్నారు. కాంగ్రెస్‌తోపాటు పలు ప్రాంతీయ పార్టీనుంచి కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10సీట్లలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. యూపీ (10 స్థానాలు), బిహార్, మహారాష్ట్ర (చెరో ఆరు), పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ (ఐదేసి), కర్ణాటక, గుజరాత్ (తలో నాలుగు) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్తాన్ (చెరో మూడు), జార్ఖండ్‌లో రెండు, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలో ఒకటి చొప్పున మొత్తం 59 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ మొదటి, రెండు, మూడేళ్ల సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ప్రొఫెసర్ శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 14 దరఖాస్తు చివరి తేదీగా నిర్ణయించామన్నారు. రూ.150 అపరాధ రుసుంతో 18 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలన్నారు. కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
కర్నూలు: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 5న ఎన్నిక జరగనుంది. జూలై 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 19న వాటిని పరిశీలించి పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 21. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసే అభ్యర్థులను 20 మంది ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపరచాలి. ఈ 40 మందీ పార్లమెంటు సభ్యులే అయ్యుండాలి. ఎన్నిక సమయంలో ఓటు వేసేందుకు ఎంపీలకు ప్రత్యేక పెన్‌లను ఇస్తారు. అది కాకుండా వేరే పెన్లతో ఓటు వేస్తే తిరస్కరణకు గురవుతుంది. అయితే ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటివరకు అటు ఎన్డీయే కానీ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఆయన రెండు పర్యాయాలు వరుసగా ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఎస్కేయూ కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల
– జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం – ఆగస్టులో స్నాతకోత్సవం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం(కాన్వొకేషన్) ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 20 చివరి తేదీగా నిర్ణయించారు. తొలిసారిగా కాన్వొకేషన్ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజును సైతం ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, మీ సేవ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తు పూర్తయ్యి, ఫీజును చెల్లించిన తర్వాత హార్డ్‌కాపీని ‘ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ, అనంతపురం ’ చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. 2014, 15, 16 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య), ఎం.ఫిల్, పీహెచ్డీ (రెగ్యులర్) పూర్తి చేసిన వారికి కాన్వొకేషన్ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. వీరే కాకుండా అంతకుముందే ఉత్తీర్ణతులై.. కాన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే..వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు, ఆన్లైన్ దరఖాస్తు తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజుunజీఠ్ఛిటటజ్టీy.్చఛి.జీn అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్నాతకోత్సవాన్ని ఆగస్టులో ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని గవర్నర్ ముందస్తు అనుమతితో వెల్లడించనున్నారు. -
వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కడప: యోగి వేమన వర్సిటీ(వైవీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 23 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పూర్తి చేసిన దరఖాస్తులను అప్లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుం లేకుండా మే 10 వరకు , రూ. 500 అపరాధ రుసుంతో మే 11 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మే 18లోపు అప్లోడ్ చేయాలి. వైవీయూ, అనుబంధ కళాశాలల్లోని 28 విభాగాల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైవీయూ సెట్ కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ఇతర వివరాలను వైవీయూ వెబ్సైట్ www.yogivemanauniversity.ac.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
18 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ
సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మిగిలిన 18 మద్యం దుకాణాలకు శుక్రవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో ఇటీవల 16 మద్యం దుకాణాలు మిగిలిపోగా రెండు అక్రమ మద్యం అమ్మిన కేసులో రద్దయిన విషయం తెలిసిందే. మొత్తం 18 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. 16 మద్యం దుకాణాలను రూ. 30 లక్షలకు, ఒకటి రూ. 11,33, 335, మరొకటి 10,83,335ల స్లాబ్‌లో నోటిఫై చేశా రు. ఔత్సాహికులు ఈనెల 27వ తేదీ లోగా సంగారెడ్డిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామ్ ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 28న ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలను కేటాయిస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్‌లో షాప్ నంబర్ 2,4, ముత్తంగి, పటాన్‌చెరులోని షాప్‌నంబర్ 1, 2, 3, 5, 7, 10, పాటి, రామచంద్రపురం షాప్ నంబర్ 2, 7, 9, తెల్లాపూర్, నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొల్లారం షాప్ నంబర్ 2,5 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కోహీర్, సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సదాశివపేట మండలం పెద్దాపూర్ షాప్‌నకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ సారైనా దరఖాస్తులు వచ్చేనా? జిల్లాలో కొన్నేళ్లుగా మిగిలిపోయిన 16 మద్యం దుకాణాలకు ఔత్సాహికుల నుంచి ఆసక్తి కరువైంది. పటాన్చెరు, రామచంద్రాపురం, బొల్లారం పారిశ్రామిక వాడలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావడంతో స్లాబ్ పద్ధతిన ఆయా షాప్‌లకు ప్రభుత్వం రూ. 30 లక్షలు కేటాయించింది. ఈ కారణంగా ఇంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టినప్పటికీ సరైన లాభాలు ఆర్జించ లేమన్న కారణంగానే ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీంతో కొన్నేళ్లుగా.. అధికారులు నోటిఫికేషన్ వేస్తున్నప్పటికీ ఈ 16 మద్యం దుకాణాలకు మాత్రం దరఖాస్తులు సమర్పించడం లేదు. ఈ సారైనా ఈ దుకాణాలకు దరఖాస్తులు వస్తాయో?రావో? చూడాలి మరి. -
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఎన్నికలు మార్చి 16న నిర్వహించనున్నారు. మార్చి 19న కౌంటింగ్ జరుపుతామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ, తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రవేశాలు
డీఎన్బీ సెట్ - 2015 నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ‘డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఎన్బీ సెట్)- 2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ - జనవరి 2015 విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో థెరపీ, రేడియో డయాగ్నసిస్, అనెస్తీషియాలజీ, డెర్మటాలజీ అండ్ వెనీరియాలజీ, రెసిపిరేటరీ డిసీజెస్, న్యూక్లియర్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యామిలీ మెడిసిన్, రూరల్ సర్జరీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, మెటర్నల్ చైల్డ్ హెల్త్, ఫీల్డ్ ఎపిడిమియాలజీ అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబరు 18 వెబ్సైట్: http://cet.natboard.edu.in/ మరిన్ని నోటిఫికేషన్ల కోసం http://sakshieducation.com చూడవచ్చు -
'రేపే ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఎల్.వేణుగోపాల్‌రెడ్డి వెలడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈలోగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి పెట్టాలని తెలిపారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామన్నారు. ఇప్పటికే ఈ ఇరురాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రొ.ఎల్. వేణుగోపాల్ రెడ్డి వివరించారు.