నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
కర్నూలు: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 29న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు.