bhuma brahmananda reddy
-
కలహాలు.. కలవని నేతలు
సాక్షి, నంద్యాల: తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనతో నంద్యాలలో భగ్గుమన్న విబేధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరూ సర్దుకుపోవాలని సూచించినా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అలక వీడకపోవడంతో మాజీ మంత్రి ఫరూక్ వర్గంలో అయోమయం నెలకొంది. నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గతేడాది నవంబర్ వరకు ఉన్నారు. టికెట్ తనకే ఇస్తారన్న ఆశతో నాలుగున్నరేళ్ల పాటు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, ఆర్థికంగానూ నష్టపోయారు. అయితే కనీస సమాచారం ఇవ్వకుండా ఆయన స్థానంలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కి ఇన్చార్జిగా టీడీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి బ్రహ్మం వర్గం స్తబ్ధుగా ఉంటోంది. కొత్త ఇన్చార్జ్గా నియమితులైన ఫరూక్‌కు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. అయినప్పటికీ చివరిలోపు టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో భూమా బ్రహ్మం ఉంటూ వచ్చారు. వ్యక్తిగతంగా కార్యక్రమాలకు హాజరవుతూ తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే భూమా బ్రహ్మానికి షాక్ ఇస్తూ టీడీపీ నంద్యాల అభ్యర్థిగా ఫరూక్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ఖరారు చేయడంతో భూమా వర్గం ఒక్కసారిగా కంగుతింది. బాబు మాట బేఖాతర్.. నంద్యాల టికెట్ ఫరూక్‌కి ఇస్తున్నట్లు ప్రకటించడంతో భూమా బ్రహ్మం పది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో మూడు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి ఇద్దరు కలిసి పనిచేయాలని భూమా బ్రహ్మానికి సూచించారు. అయినా బ్రహ్మం అలక వీడలేదు. స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వకపోవడంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఫరూక్, భూమా బ్రహ్మాన్ని అనంతపురం పిలిపించుకుని మాట్లాడారు. అధికారంలోకి వస్తే తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడతో బ్రహ్మం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోకేశ్‌తో మాట్లాడిన అనంతరం ఎలాంటి ప్రకటన చేయకుండా నంద్యాలకు రాకుండా నేరుగా హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భూమా, ఫరూక్ ఎడమొహం, పెడ మొహంగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నడవాలో లేక నాలుగున్నర్రేళ్ల పాటు తమకు అండగా ఉన్న నేత వెంట నడవాలో తెలియక డైలమాలో పడ్డారు. -
వాడుకొని వదిలేయడం బాబుకు అలవాటే!
ఆక్ పాక్ కరివేపాక్ ఫిలాసఫీని అలానే కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి కోలుకోలేని షాకిచ్చారాయన. నంద్యాల నియోజక వర్గం భూమా అఖిలప్రియ- భూమా బ్రహ్మానందరెడ్డిలో ఒకరికి ఇస్తానన్నట్లు చెబుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఎన్.ఎం.డి.ఫరూక్‌ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీకోసం కష్టపడితే ఇపుడు తమని పక్కన పెట్టి మోసం చేశారని భూమా బ్రహ్మానంద రెడ్డి లోలోనే కుత కుత లాడిపోతున్నారు. అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి ఆయన్ను రక రకాలుగా ప్రలోభాలు పెట్టి వేధించి టిడిపిలో చేరేలా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా టిడిపిలో చేరారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి గెలిచిన అఖిల ప్రియ చంద్రబాబు ప్రలోభాలతో టిడిపిలో చేరారు. 2017లో భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అయినా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నుండి తానే పోటీ చేయాలని బ్రహ్మానందరెడ్డి ఆశపడుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం జిల్లాలో భూమా కుటుంబం నుండి ఒకరికే టికెట్ ఇస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ చేత నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రహ్మానందరెడ్డి-అఖిల ప్రియ మధ్య రచ్చ రాజేసి ఇద్దరి మధ్య పోటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే ఎన్. ఎం.డి. ఫరూక్ ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ కు టికెట్ కేటాయించినట్లే అంటున్నారు పార్టీ నేతలు. అయిదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం తాను పార్టీలోనే ఉంటే ఇపుడు తనను పక్కన పెట్టడం ఏం న్యాయమని బ్రహ్మానంద రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి వెన్నుపోటుకు తెగబడ్డారని బ్రహ్మానంద రెడ్డి తన అనుచరులతో చెప్పుకుని బాధ పడుతున్నారట. ఫరూక్ కు టికెట్ ఇస్తే మాత్రం ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని బ్రహ్మానందరెడ్డి తన కోటరీ సభ్యులతో అంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది . మొత్తానికి వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నియోజక వర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. -
బాబుకు షాక్...ఇండిపెండెంట్ అభ్యర్థిగా భూమా!
నంద్యాల: ఎన్నికలకు నాలుగైదు నెలలు సమయం ఉండగానే తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. నంద్యాలలో ఈ పరిస్థితి తారాస్థాయికి చేరింది. రానున్న ఎన్నికల్లో నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్‌కు టికెట్ ఇస్తున్నామని, సహకరించాలని భూమా బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు చెప్పారు. మొహం మీదే ఈ విషయం చెప్పేయడంతో భూమా వర్గీయులు టీడీపీ అధినేతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో భూమా బ్రహ్మానందరెడ్డి తన నివాసంలో అనుచరులు, పార్టీ నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాకు అన్యాయం జరుగుతుందని అనుకోలేదు మాజీ మంత్రి ఫరూక్‌కు టికెట్ ఇస్తున్నాం.. నువ్వే గెలిపించాలి. నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి న్యాయం చేస్తా అని చంద్రబాబు హైదరాబాద్‌లో తనతో చెప్పారని, దీన్ని ఎలా నమ్మాలని కార్యకర్తలతో భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేసుకున్నానని, నాలుగున్నరేళ్లు పార్టీ నాయకులకు అండగా నిలిచానని, తనకే టికెట్ ఇవ్వాలని చెప్పినా వినిపించుకోలేదని సమావేశంలో భూమా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నంద్యాలలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకే పార్టీ అధినేత అన్యాయం చేస్తారని అనుకోలేదని కార్యకర్తలతో వాపోయారు. ఫరూక్‌కు సహకరించొద్దు.. రెబల్‌గా పోటీ చేద్దాం మాజీ మంత్రి ఫరూక్‌కు ఎవరు సహకరించవద్దు.. 15రోజులు చూసి అప్పటికీ చంద్రబాబు దిగిరాకపోతే వచ్చే ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేద్దామని అనుచరులకు భూమా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి పోటీగా మనం కార్యక్రమం నిర్వహిద్దాం. ఎవరి సత్తా ఏమిటో బాబుకు తెలిసేలా చేద్దాం. ఇందుకు తనకు అందరు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు. భూమాపై మాజీ మంత్రి గుస్సా! ఫరూక్‌కు టికెట్ ఇస్తే గెలవడని, ఆయనకు సహకరించే ప్రసక్తే లేదని చంద్రబాబుకు భూమా బ్రహ్మం తెలియజేయడంతో ఫరూక్ వర్గీయులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భూమా బ్రహ్మానందరెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు ఎవరూ వెళ్లవద్దని, తనకే టికెట్ ఒకే అయ్యిందని అందరూ తనవెంటే రావాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఫోన్లు చేసి చెబుతున్నారు. ఆదివారం భూమా నిర్వహించిన సమావేశానికి సైతం ఎవరూ వెళ్లొద్దని నాయకులకు ఆయన ఫోన్లు చేశారు. టీడీపీలో ఉండాలంటే తనతో ఉండాలని లేకపోతే పార్టీ పదవులు ఉండవని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూమా, ఫరూక్ మధ్య నెలకొన్న విభేదాలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. -
నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్!
‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు. అయితే డోన్ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! స్వయంకృతాపరాధం భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్‌కు టిక్కెట్ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది. ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. అఖిలకు అందరూ దూరమే.. ► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. ► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. ► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
Kurnool, Nandyal: టీడీపీలో రగులుతున్న అసమ్మతి మంటలు
తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డోన్ అభ్యరి్థగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా డోన్ నుంచి కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కేఈ వ్యాఖ్యానించడం చూస్తే నేరుగా అధిష్టానంతోనే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనేది స్పష్టమవుతోంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి కర్నూలు: టీడీపీలోని బలమైన కుటుంబాల్లో కేఈ కుటుంబం ఒకటి. ముఖ్యంగా డోన్ నియోజకవర్గాన్ని 40 ఏళ్లుగా తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2014 నుంచి కేఈ ప్రతాప్ టీడీపీ ఇన్చార్జ్గా కొనసాగారు. 2014, 2019లో డోన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో ఏడాది కిందట ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. ఆపై డోన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఏకంగా సుబ్బారెడ్డిని అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనపై కేఈ కుటుంబం తీవ్రంగా రగిలిపోయింది. కేఈ వర్గీయులు బహిరంగంగా సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించారు. బహిరంగ విమర్శలు చేశారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా చంద్రబాబు తీరు మారలేదు. రాజకీయంగా బలపడే ఉద్దేశంతోనే ‘బీసీ’ పావులు కర్నూలు, నంద్యాల జిల్లా టీడీపీలో కేఈ, భూమా కుటుంబాల పెత్తనం సాగుతోంది. 2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కూడా సైకిలెక్కింది. ఈ మూడు కుటుంబాల పెత్తనమే సాగుతుందని, వీరికి చెక్ పెట్టి రెండు జిల్లాల రాజకీయాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేది టీడీపీ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో చంద్రబాబుకు కూడా బీసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్గా కూడా నియమించారు. అధిష్టానం వద్ద ఉన్న చొరవతో జిల్లాలో బలమైన కుటుంబాలను బలహీన పరిచేలా పావులు కదుపుతున్నారు. తొలుత కేఈ కుటుంబం బలం తగ్గించేందుకు పత్తికొండకే పరిమితం చేసి డోన్ టిక్కెట్ దక్కకుండా ధర్మవరం సుబ్బారెడ్డి వెనుక తానే ఉండి వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఖర్చు కూడా తానే భరిస్తానని బీసీ ఇచ్చిన హామీతోనే సుబ్బారెడ్డిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భూమా, కేఈ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిని దెబ్బతీసేందుకు కుటుంబానికి ఒకే టిక్కెట్ ప్రతిపాదన బీసీనే చంద్రబాబు వద్ద పదే పదే ప్రతిపాదించారని తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఆళ్లగడ్డలో అఖిలకు టిక్కెట్ ఇస్తే, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి కాకుండా మైనార్టీ కోటాలో ఫరూక్ కుమారుడు ఫిరోజ్‌కు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. అలాగే కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ దక్కకుండా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి బోయ, కురబలను బరిలోకి దింపితే బాగుంటుందని బీసీనే ప్రతిపాదించారని సమాచారం. ఈ దెబ్బతో కోట్ల కుటుంబం నుంచి కూడా సుజాతమ్మకు టిక్కెట్ దక్కే అవకాశాలు ఉండవు. దీంతో కేఈ, భూమా, కోట్ల కుటుంబాల బలం తగ్గించడంతో పాటు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తే ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి, ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఎదగాలని పథకం రచించారు. దీన్ని అమలు చేయడంలో భాగంగానే ఒక్కొక్క పావు కదుపుతున్నారని టీడీపీలోని కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా డోన్ నుంచే పోటీ కేఈ ప్రభాకర్ జన్మదినాన్ని బుధవారం డోన్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో ఘనంగా నిర్వహించారు. ఓరకంగా కేఈ బలపరీక్ష నిర్వహించారు. ఈ వేదికపై నుంచి కేఈ ప్రభాకర్ ఏకంగా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. ‘జనబలం లేనివారిని ఇన్చార్జ్గా నియమించారు. వీరితో పారీ్టకి ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీలో ఉంటుంది’ అని తేలి్చచెప్పారు. అంతటితో ఆగకుండా తనకు జనబలంతో పాటు ధనబలం కూడా ఉందనే సంగతి మరవొద్దన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే జన, ధన బలంతో ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని కేఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆపార్టీ తో పాటు అన్ని పారీ్టల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. అసలు ఈ వివాదానికి ఆద్యుడు బీసీ జనార్దన్‌రెడ్డి అని కేఈ కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగజారుతున్న ప్రతిష్ట కర్నూలుకు వచ్చిన ‘న్యాయరాజధాని’కి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుకు జిల్లా వాసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ప్రజలంతా ‘న్యాయరాజధాని’ కావాలనే భావనలో ఉండటం, చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరించడం టీడీపీకి పెద్ద అడ్డంకి. దీన్ని దాటుకుని ముందుకు వెళ్లడమే కష్టమనే భావనలో ఉన్న టీడీపీని అంతర్గత రాజకీయాలు, నేతల ధిక్కారస్వరాలు మరింత దిగజారుస్తున్నాయి. -
భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో గుబులు.. ఆజ్యం పోసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒక ప్రాంతంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే మరో ప్రాంతంలో నేతలు నైరాశ్యంలో మునిగి తేలుతున్నారు. టీడీపీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సాక్షి, కర్నూలు: నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని టీడీపీ నేతల్లో నిస్తేజం నెలకొంది. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అంతర్గత కలహాలను ప్రోత్సహించడంపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా వర్గపోరు నడుస్తోంది. ‘ఫిరోజ్ యువసేన’ పేరుతో సోషల్ మీడియాలో బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. అసంతృప్తులకు ఆజ్యం పోసిన చంద్రబాబు.. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని నేతల అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో టీడీపీలో కీలకంగా ఉండే భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ భూమా అఖిలప్రియకు ఇస్తే, ఆ కుటుంబానికి రెండో అవకాశం ఇవ్వబోరని, నంద్యాలలో తాను రేసులో ఉండొచ్చని ఫిరోజ్ భావించారు. దీంతో ఇటీవల చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్రహ్మానందరెడ్డిపై విమర్శలు చేయిస్తున్నారు. భూమా వైఖరితోనే నంద్యాలలో టీడీపీకి ఈ దుస్థితి దాపురించిందని ప్రచారం చేయిస్తున్నారు. గత మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయించారు. భూమా వర్గీయులు సైతం ఫిరోజ్ వర్గానికి వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ క్లస్టర్ మీటింగ్‌లో వేదికపైనే తనను సమావేశానికి ఆహ్వానించలేదని బ్రహ్మానందరెడ్డిపై ఫిరోజ్ అసంతృప్తి వెలిబుచ్చారు. దీనికి స్పందించిన భూమా.. టీడీపీలో విభేదాలు సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా ఎదుర్కొంటానన్నారు. ఎమ్మెల్సీ ఫరూక్ కనుసన్నల్లోనే ఫిరోజ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా ఇటీవల ఓ సందర్భంలో ‘‘పాలు అమ్ముకునేవారిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేశారని’’ భూమా బ్రహ్మానందరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ‘భూమా’కు వ్యతిరేకంగా ఫరూక్ ఫ్యామిలీకి బీసీ సహకరిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి సైతం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెబుతున్నారు. ముగ్గురు నేతల మధ్య విభేదాలు పెరిగిపోవడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉండలేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కేఈ, కోట్ల కుటుంబాల్లోనూ టిక్కెట్ల గుబులు టీడీపీ ఆవిర్భావం నుంచి భూమా, కేఈ కుటుంబాలు జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరించాయి. భూమా కుటుంబం టీడీపీ వీడిన తర్వాత కేఈ కుటుంబ పెత్తనం నడిచింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పచ్చ కండువా వేసుకున్నారు. ఆపై భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీలో కీలకంగా ఉన్నాయి. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మూడు కుటుంబాల్లోనే గుబులు రేపుతున్నాయి. మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో ముగ్గురు నేతలు ఉన్నారు. కుమారుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ ఇన్చార్జ్గా ఉన్నారు. కేఈ సోదరుడు కేఈ ప్రతాప్ 2019లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. బేతంచెర్ల మునిసిపల్ ఎన్నికల సమయంలో కేఈ ప్రతాప్‌ని తప్పించి ధర్మవరం సుబ్బారెడ్డికి డోన్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్‌కు నియోజకవర్గం లేదు. దీంతో ఈయన ఆలూరు టిక్కెట్ కోసం యత్నిస్తున్నారు. ఆలూరు దక్కకపోతే కర్నూలు నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామంటే కోట్ల సుజాతమ్మతో పాటు కేఈ ప్రభాకర్‌కు కూడా టిక్కెట్ దక్కదు. దీంతో వీరంతా టీడీపీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంపీ టిక్కెట్ కాదని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చిన పార్టీని కాదని కోట్ల సుజాతమ్మ బయటకు రాలేరు. అయిష్టంగానైనా ఆమె టీడీపీలో కొనసాగనున్నారు. అయితే కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ మాత్రం టీడీపీ వీడి బయటకు రావాలనే యోచనలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఏడాది కిందట టీడీపీకి తాను రాజీనామా చేశానని కూడా కేఈ ప్రభాకర్ ప్రకటించారు. ఆపై అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా కర్నూలు, నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు కొందరు సరైన రాజకీయ ఫ్లాట్‌ఫాం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో ఉన్నారు. నేతల వర్గపోరు, అసంతృప్తుల మధ్య నలగలేక కార్యకర్తలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు
నంద్యాల: వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా నంద్యాల టీడీపీ నేతల మధ్య అప్పుడే మూడు ముక్కలాట మొదలైంది. నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు వర్గ పోరు బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి లోలోపల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమదంటే తమదేనని అనుచరులకు చెప్పుకుంటూ వర్గ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రజల నుంచి మద్దతు లేక విలవిలలాడుతుంటే నాయకుల వర్గపోరు టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పి తెప్పిస్తోంది. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఓ లాడ్జ్‌లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు హాజరయ్యారు. చదవండి: ('ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు.. కాసింత బువ్వ పెట్టండ్రా') ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండీ ఫరూక్ తనయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ.. ‘క్లస్టర్ సమావేశానికి తనను ఏ కారణం చేత పిలువలేదో అర్థం కావడం లేదు. జిల్లా ప్రధాన కార్యదర్శినే పిలువక పోతే ఎలా? మన మధ్య ఐక్యత లేకుంటే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమావేశానికి తాను ఎవరినీ పిలువలేదని, టీడీపీ కార్యాలయం నుంచే ఫోన్లు చేశారని, ఒకరిని దూరంగా ఉంచాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే సమావేశానికి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్ హాజరైనా వారి అనుచరులను మాత్రం సమావేశానికి దూరంగా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా సమావేశంలోనే ఫిరోజ్ తన అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏవీ జాడ ఏదీ.. క్లస్టర్ సమావేశానికి సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి గైర్హాజరై, తన వర్గాన్ని కూడా దూరంగా ఉంచడంతో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆశీస్సులు తనకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి, ఫరూక్‌కు టికెట్ వచ్చే పరిస్థితి లేదని, గతంలో వారికి అవకాశం ఇచ్చారని, ఈ సారి కొత్త నాయకుల వైపు అధిష్టానం చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో తనకే నంద్యాల అసెంబ్లీ టికెట్ వస్తుందని అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యనాయకులు దూరం నంద్యాల క్లస్టర్ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. టీడీపీ ముస్లిం, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా, మాజీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇంతియాజ్ అహమ్మద్, మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేనితో పాటు ప్రముఖ టీడీపీ నాయకులు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. నాయకుల మధ్య విభేదాలు ఉండటం, ఒకరినొకరు విమర్శించుకోవడం, పార్టీ పదవుల్లో కష్టపడిన వారికి కాకుండా నాయకుల అనుచరులకే పదవులు దక్కడంతో అసంతృప్తికి లోనైన పలువురు నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. -
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు
సాక్షి, నంద్యాల: టీడీపీ నేత, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, విజయ పాల డెయిరీ మాజీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలీశ్వరరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మోహన్‌రెడ్డి బుధవారం తెలిపారు. నంద్యాల మండలం చాబోలు పాల సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జున ఈనెల 2వ తేదీన ఏవీ అపార్టుమెంట్ వద్ద ఉండగా వీరంతా కలసి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. 20రోజుల పాటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో తిప్పుతూ మల్లికార్జున చేత ఖాళీ తెల్ల కాగితాలు, రిజిష్టర్ కాగితాలపై సంతకాలు చేయించుకుని వదిలేశారు. ఈ ఘటనపై త్రీటౌన్‌పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై 365, 384, 344, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. -
భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
కర్నూలు : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు తా ర్నాక్ తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ అక్రమంగా నంద్యాలకు తరలిస్తున్నాడు. కర్నూలు శివారులోని జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉదయమే కొండారెడ్డి కుమారుడిని వదిలేసి, మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన నారెళ్ల రాజేష్, తలారి శ్రీనివాసులను 1,2 ముద్దాయిలుగా చేర్చారు. కారు కొండారెడ్డి పేరుతో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యనను మూడో ముద్దాయిగా చేర్చారు. కొండారెడ్డికి నంద్యాలలో చంద్రిక, గాయత్రి బార్లు ఉన్నాయి. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత రేట్లు భారీగా పెరగడంతో తెలంగాణనుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. -
ఈసారి ఆశలు గల్లంతేనా?
-
నందుల కోటలో ‘‘శిల్పా’’ పట్టు..
సాక్షి, నంద్యాల : నందుల కోట నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి.. పల్లెనిద్ర–రచ్చబండ కార్యక్రమాల ద్వారా పల్లె ప్రజలకు చేరువయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా శిల్పా సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. టీడీపీ నాయకుల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం అందించలేకపోయారు. భూమా అనుచరులు అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకోవడంతో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. నంద్యాల నియోజకవర్గం 1952లో అవతరించింది. ప్రస్తుతం నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలు నియోజకవర్గం లో ఉన్నాయి. ఇప్పటి వరకు 15సార్లు నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బండిఆత్మకూరు, మహానంది మండలాలను శ్రీశైలం నియోజకవర్గంలో కలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పా డు మండలాన్ని నంద్యాల నియోజకవర్గానికి కలిపారు. ఇప్పటి వరకు నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ ఏ వర్గానికి రిజర్వ్ కాలేదు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఎన్ఎండీ ఫరూక్‌పై శిల్పామోహన్‌రెడ్డి 40,677ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇది నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ. 1978లో నబీ సాహెబ్‌పై బొజ్జా వెంకటరెడ్డి 1,693 ఓట్లతో గెలుపొందారు. ఇది నియోజకవర్గంలో అత్యల్ప మెజార్టీ. పదవులు..నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని, పీవీనరసింహరావు ప్రధాన మంత్రి పదవిని, పెండే కంటి వెంకటసుబ్బయ్య కేంద్ర హోం శాఖ మంత్రి పదివిని అలంకరించారు. అలాగే శిల్పామోహన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్‌లు మంత్రి పదవులు చేపట్టారు. -
ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం అర్రులుచాచి టీడీపీలో చేరిన నేతలకు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు తనకే సీటు అని ధైర్యంగా ఉన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఆ ఒక్కటీ తప్ప.. ఏం కావాలో చెప్పాలంటూ సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. టీజీ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయినప్పటికీ కమిటీ ఒప్పుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పూర్తి దిగాలుగా.. ఏమి చేయాలో అర్థం కాక అమరావతిలోనే ఇంకా మకాం వేసినట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు ఆయన సతీమణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. మరోవైపు కర్నూలు సీటు టీజీ భరత్‌కే కేటాయించాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థికి అయ్యే మొత్తం వ్యయాన్ని టీజీ భరించేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. ఆదోని సీటును బుట్టాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. మీనాక్షి నాయుడు సామాజిక వర్గమంతా వెళ్లి ఆ సామాజికవర్గానికి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కచ్చితంగా ఇవ్వాలంటూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ బుట్టా రేణుకకు మొండిచేయి తప్పలేదని సమాచారం. ఇక గౌరు చరిత టీడీపీలో చేరడంతో మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ సీటు కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. కేవలం నందికొట్కూరు సీటుకు అభ్యర్థిని నిర్ణయించే అధికారం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. పాణ్యం ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామనడంతో ఆయన కాస్తా చల్లబడ్డారు. ఇక నంద్యాల సీటును భూమా బ్రహ్మానందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించడంపై అటు ఏవీ సుబ్బారెడ్డి, ఇటు ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గాలు మండిపడుతున్నాయి. ఒకరికొకరు.. మొన్నటివరకు కోట్ల–కేఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నడిచింది. అయితే, కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత సీట్ల విషయంలో ఒకరికొకరు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఆలూరులో బీసీ నినాదం వల్ల కొంప మునుగుతుందని, కావున తనకు డోన్ టికెట్ కావాలని కోట్ల సుజాతమ్మ భావించారు. దీంతో కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దిగి..ఆలూరులో వీరభద్రగౌడ్‌ను ఒప్పించడంతో పాటు మాజీ ఇన్చార్జ్ వైకుంఠం ప్రసాద్, మసాల పద్మజ కూడా సహకరించేలా చేస్తానని చెప్పారు. దీంతో డోన్ సీటును కేఈ ప్రతాప్‌కే వదులుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధపడినట్టు తెలుస్తోంది. అలాగే కోడుమూరు సీటు విష్ణువర్దన్‌రెడ్డి వర్గానికి కాకుండా కోట్ల వర్గానికే ఇవ్వాలని కూడా కేఈ కృష్ణమూర్తి గొంతు కలిపినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా సామాన్య కుటుంబాలను ఫ్యాక్షన్ కోరల్లో బలిచేసిన రెండు కుటుంబాలు తమ వద్దకు వచ్చే సరికి సర్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. -
చెల్లెలి బాటలో అన్న
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలో అధికార టీడీపీ నేతల అలక కొనసాగుతోంది. తన మద్దతుదారులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆమె అన్నయ్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఇదే వైఖరి ప్రదర్శించారు. తనకు ప్రభుత్వం కల్పించిన భద్రతను వద్దన్నారు. గన్మెన్లను తిప్పి పంపించారు. తన చెల్లెలికి లేని భద్రత తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత సిబ్బంది, గన్మెన్లు లేకుండానే సోమవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తన వర్గీయుల ఇళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేయడాన్ని నిరసిస్తూ అఖిలప్రియ గురువారం గన్మెన్లను తిప్పిపంపారు. అధికార పార్టీ నేతల అసంతృప్తి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వ్యవహారశైలిపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి, ఎమ్మెల్యే మద్దతుదారులు అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. (అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు) -
టీడీపీలో రగడ
కర్నూలు, నంద్యాల: రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు– కడప జాతీయ రహదారిపై ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాల వివాదం వీరిమధ్య విభేదాలను మరింతగా పెంచాయి. ఈ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నంద్యాల తాలూకా పోలీసులు టీడీపీ కౌన్సిలర్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు కట్టడంతో భూమా వర్గం భగ్గుమంటోంది. మూడు రోజుల క్రితం మంత్రి ఫరూక్ తనయుడు వక్ఫ్‌బోర్డు స్థలాల వద్దకు వెళ్లడంతో అక్కడ స్థానికులు అడ్డుకొని మీరెన్ని భూములు ఆక్రమించారో అందరికీ తెలుసునంటూ పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఓవర్‌బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారి పక్కన జామియా మసీదుకు చెందిన సర్వేనెం.278, 231, 236లో వక్ఫ్‌బోర్డు భూములు 75.76ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ సెంటు రూ.5లక్షల నుంచిరూ.8లక్షల వరకు పలుకుతోంది. ఈ భూములను కొందరు ఆక్రమించుకొని కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు ఆపాలని రెండు నెలల క్రితం తహసీల్దార్ జయరామిరెడ్డి.. స్థలాల వద్దకు వెళ్లి నిర్మాణ దారులకు తెలియజేశారు. వక్ఫ్‌బోర్డు స్థలాల్లో వేసిన రహదారులను తొలగించి ఈ స్థలాలు వక్ఫ్‌బోర్డుకే చెందినవి, వీటిలో ఎలాంటి కట్టడాలు కట్టవద్ద, ఈ స్థలాలు అమ్మినా... కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఆక్రమణ దారులు ఈ హెచ్చరిక బోర్డులను తొలగించి యథావిధిగా స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు కడుతున్నారు. ఈ నిర్మాణాలు చేస్తున్నది టీడీపీ నాయకులు కావడంతో అధికారులు ఏం చేయలేకపోయారు. ఆగ్రహించిన ముస్లిం నాయకులు... మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్, మంత్రి ముఖ్య అనుచరుడు అంజాద్‌బాషా రెండు రోజుల క్రితం వక్ఫ్‌బోర్డు స్థలాల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముస్లిం నాయకుడు సయ్యద్ హుసేన్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంలో నవాబులు తమ తాతలకు ఈ స్థలం ఇచ్చారని, ఈ స్థలాన్ని తాము ఐదుగురు అన్నదమ్ములం పంచుకున్నామని, వీరికేం సంబంధం ఉందని ప్రశ్నించారు. మంత్రి ఫరూక్ అనుచరుడు అంజాద్‌బాషా.. 200ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు నిర్మించారని, అప్పుడు ఆ భూములు వక్ఫ్‌బోర్డుకు చెందినవని, వారికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఫరూక్ కూడా గతంలో వక్ఫ్‌బోర్డు భూముల్లో కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. దీంతో ఫరూక్ అనుచరులు, సయ్యద్ హుసేన్ మధ్య తోపులాట జరిగింది. మంత్రి అనుచరుడు అంజాద్‌బాషా అధికారం ఉందని మంత్రి కుమారుడు ఫిరోజ్‌ను తీసుకొని వచ్చి తనపై దాడికి ప్రయత్నించారన్నారన్నారు. వారు గతంలో వక్ఫ్‌బోర్డు స్థలంలో నిర్మాణాలు కట్టుకుంటే తప్పులేదా అని ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్‌తో పాటు ఐదుగురిపై కేసు నమోదు... వక్ఫ్‌బోర్డు భూముల్లో కట్టడాలు కట్టవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణ దారులు వాటిని పక్కకు పడేసి నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగించారు. అయినా వారి జోలికి వెళ్లని అధికారులు మంత్రి కుమారుడికి ఎదురు తిరిగారని, వక్ఫ్‌బోర్డు అధికారులతో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించడంపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుసేన్ ఫిర్యాదు మేరకు నూనెపల్లెలో వక్ఫ్‌బోర్డు స్థలాలు ఆక్రమించుకొని కట్టడాలు నిర్మిస్తున్నవారిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ కొండారెడ్డితో పాటు భూమా రాఘవరెడ్డి, క్రాంతికుమార్, వీరన్న, హరిబాబు, పరుచూరి శ్రీరాములుపై సెక్షన్ 447కింద కేసు నమోదు చేశామన్నారు. అసంతృప్తిలో భూమా వర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పని చేసిన తమపై కేసు నమోదు చేయడం పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి చెందిన టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని ఓ కౌన్సిలర్ తెలిపినట్లు సమాచారం. నంద్యాలలో ఇంత వరకు స్తబ్దతగా ఉన్న ఫరూక్ వర్గీయులు కార్యాలయాల్లో అధికారులపై పెత్తనం చెలాయిస్తుండటంతో ఎమ్మెల్యే వర్గం డీలా పడుతున్నట్లు తెలుస్తోంది. -
అధికారులపై ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చిందులు
సాక్షి, కర్నూలు : మున్సిపల్ అధికారులపై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి నగర్లో ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులను సోమవారం ఆయన అడ్డుకున్నారు. దీంతో అధికారులకు ఆయనకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత ఉప ఎన్నికల సమయంలో ఇల్లు, షాపులు పగలగొడితే మాట్లాడని బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు జోక్యం చేసుకోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. -
‘కారుణ్యం’ చూపరా?
మంగళగిరి(తాడేపల్లిరూరల్): గుంటూరు జిల్లా వెలగ పూడిలోని రాష్ట్ర సచివాలయం ప్రధాన గేటు వద్ద మంగళ వారం అక్కాచెల్లెళ్లు షాకిరా, ఫాతిమా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. సీఎంకు గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు జిల్లా నుంచి రాగా, భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి సిద్ధమయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితులను అంబులెన్స్‌లో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కాచెల్లెళ్లతోపాటు వచ్చిన తల్లి మొహిద్దీన్‌షా.. విషయం తెలిసి విలపిస్తూ కుమార్తెల వద్దకు వెళ్లింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో మహబూబ్ పీరా అనే వ్యక్తి వ్యవసాయ కార్యాలయంలో వీఏవోగా పనిచేస్తూ 20 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తమ మూడో కుమార్తె ఫాతిమాకు తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇవ్వాలని పీరా భార్య మొహిద్దీన్‌షా అధికారులను కోరుతోంది. పెద్ద కుమార్తె బేగం భర్త చనిపోయాడని, రెండో కుమార్తె షాకిరాకు పెళ్లి చేసినా భర్త వదిలేశాడని.. దీంతో వారిద్దరూ తన వద్దే ఉంటున్నారని చెప్పారు. సాయం కోసం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కలిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఆయన కూతురైన మంత్రి అఖిలప్రియను, ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని కలిశామని, ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ, ఇప్పించడం లేదని పేర్కొంది. ముఖ్యమంత్రిని కలవడానికి ఇప్పటికే పదిసార్లు వెలగపూడి సచివాలయానికి వచ్చామని, తమ గోడు ఎవరూ వినిపించు కోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తాజాగా పదకొండోసారి కూడా పోలీసులు అడ్డగించారని అన్నారు. -
అఖిల ప్రియ అనుచరుల వీరంగం
సాక్షి, నంద్యాల: గురువారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలోని మంత్రి అఖిలప్రియ నివాసానికి సమీపంలో ఆమె అనుచరులు వీరంగం వేశారు. నడిరోడ్డుపై తల్లీకొడుకులను చితకబాదారు. అందరూ చూస్తుండగానే కాళ్లతో తన్నారు. పట్టణంలోని పద్మావతినగర్‌లో మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన రోడ్డుపై ఓ పేద కుటుంబం చిన్న టీ బంకు పెట్టుకొని జీవనం సాగిస్తోంది. గురువారం ఈ బంకులో మంత్రి అనుచరులు తమ సామాన్లు పెట్టుకున్నారు. రాత్రి అవుతుండటంతో తాము ఇంటికి వెళ్లాలని, సామాన్లు తీసుకువెళ్లమని బంకు నిర్వాహకురాలు చిన్నయమ్మ, ఆమె కుమారుడు శీను కోరారు. దీంతో మంత్రి అనుచరులు కోపోద్రిక్తులయ్యారు. తాము ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘మాకే ఎదురు చెబుతారా’ అంటూ ఇద్దర్నీ చితకబాదారు. ఆమె కుమారుడి నోటి నుంచి రక్తం పడుతున్నా వదలకుండా కొట్టారు. అరగంట పాటు ఈ దౌర్జన్యకాండ సాగింది. మంత్రి అనుచరులు కావడంతో స్థానికులు అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. పేపర్లో రాస్తే మమ్మల్ని చంపేస్తారు: విలేకరులకు జరిగిన సంఘటన గురించి చెప్పడానికి కూడా బాధితులు భయపడ్డారు. ‘మీరు పేపర్లో వార్తలు రాస్తే మమ్మల్ని చంపేస్తారు.. రాయొద్దు..’ అంటూ బతిమాలారు. ‘టీలు, సిగరెట్లపై రూ.వెయ్యి, 2 వేలు అప్పులు పెడతారు. వారు ఇచ్చినప్పుడే తీసుకుంటున్నాం. కొన్ని సార్లు అసలు ఇవ్వరు. అయినా మేము ఏనాడూ అడిగింది లేదు. ఈ రోజు ఇంటికి వెళ్లాలి.. సామాన్లు తీసుకోండని చెప్పడం మా తప్పయ్యింది..’ అంటూ రోదించారు. గాయాలైన వారు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే కేసు రాసుకుంటారని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని భూమా అనుచరులు సూచించడంతో బాధితులు వారు చెప్పిన విధంగానే చేయడం వారిలో భయాందోళనలకు నిదర్శనంగా నిలిచింది. -
ప్రలోభాలదే పైచేయి
♦ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం ♦ 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గిన భూమా బ్రహ్మానందరెడ్డి ♦ పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ♦ ‘నోటా’కు నాల్గో స్థానం కర్నూలు (అర్బన్)/ నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలదే పైచేయి అయ్యింది. డబ్బు పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారం..ఇలా పలు అంశాలు అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మొదలుకుని పోలింగ్ వరకు సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కొనసాగిన విషయం విదితమే. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు. కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా వారికి కనీస స్థాయిలో కూడా ఓట్లు లభించలేదు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించగా, సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, 1,73,187 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. దీంతో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపును మొత్తం 19 రౌండ్లుగా చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగగా.. 16వ రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 654 ఓట్లు అధికంగా వచ్చాయి. మిగిలిన 17, 18, 19 రౌండ్లలో కూడా టీడీపీ ఆధిక్యత చాటుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు రావడం గమనార్హం. ‘నోటా’కు ఏకంగా 1,231 ఓట్లు లభించడంతో నాల్గో స్థానంలో నిలిచింది. మిగిలిన అభ్యర్థుల్లో అబ్దుల్‌సత్తార్‌కు 338, భవనాశి పుల్లయ్య 154, రాఘవేంద్ర 75, రావు సుబ్రమణ్యం 94, వల్లిగట్ల రెడ్డప్ప 108, మహబూబ్‌బాషా 400, కాంతారెడ్డి 234, గురువయ్య 122, నరసింహులు మాదిగ 802, బాలసుబ్బయ్య 289, ముద్దం నాగనవీన్ 789, రఘునాథరెడ్డి 483 ఓట్లు సాధించరారు. నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల మండలంలోని గ్రామాల్లో టీడీపీ భారీ మెజార్టీ సాధించింది. గోస్పాడు మండలంలో మాత్రం ఆ పార్టీకి 800 మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ఎన్నికల అధికారులు మొత్తం 250 మందికి పోస్టల్ బ్యాలెట్లను పంపారు. ఇందులో చిరునామాలు సక్రమంగా లేని కారణంగా 39 పోస్టల్ బ్యాలెట్లు తిరిగి వచ్చాయి. మిగిలిన 211 పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత ఉద్యోగులు ఉపయోగించుకోలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభివృద్ధి ఆగుతుందని.. ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నంద్యాలలో ఆగమేఘాలపై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హడావుడిగా రోడ్ల విస్తరణ ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేసింది. మొత్తమ్మీద రూ.1,500 కోట్ల వరకు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది. ఉప ఎన్నికలో టీడీపీ గెలవకపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని, రోడ్ల విస్తరణ బాధితులకు పరిహారం కూడా రాదని..ఇలా పలువిధాలుగా ప్రచారం సాగించారు. అలాగే పింఛన్లు, రేషన్ నిలిపిపోతాయని లబ్ధిదారులను బెదిరించారు. భారీగా డబ్బుతో పాటు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, మద్దతుదారులపై పోలీసులను ఉసిగొల్పారు. ఈ విధంగా ప్రలోభపెట్టి, భయపెట్టి, దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ గెలిచిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు, అధికారంతోనే టీడీపీ గెలుపు టీడీపీ కేవలం డబ్బు, అధికారంతోనే ఉప ఎన్నికలో విజయం సాధించింది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మా పార్టీ శ్రేణులను టార్గెట్ చేయడమే కాకుండా ప్రలోభాలకు గురిచేశారు. లొంగని వారిని సోదాల పేరిట భయపెట్టారు. అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలెవరూ నమ్మలేదు. కేవలం పింఛన్లు, కార్డులు తొలగిస్తారన్న భయంతోనే టీడీపీకి ఓటు వేశారు. భూమా కుటుంబంపై సింపతీ కూడా కొద్దివరకు పనిచేసింది. ఓడినా, గెలిచినా నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయం. – శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి అభివృద్ధి పనులు కొనసాగిస్తాం నంద్యాలలో అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నా విజయానికి కృషి చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి -
ఈసీ కొరడా.. టీడీపీ కొంపకొల్లేరే..!
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యధేచ్చగా అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి షాక్ తగిలింది. నిబంధనలను పట్టించుకోకుండా టీడీపీ చేసిన చిన్న తప్పే ఆ పార్టీ పాలిట శాపంగా మారబోతోంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ తరఫు ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చును అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి ఖర్చు కిందే లెక్కయనుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు చేయొచ్చు. అభ్యర్థి తరఫు ప్రచారం నిర్వహించే వారి ప్రచారానికి అయ్యే ఖర్చుకు, అభ్యర్థి తన ప్రచారానికి చేసే ఖర్చుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, అభ్యర్థి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారో.. వారందరి పేర్లను ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వారంలోగా ఎన్నికల కమిషన్‌కు అందించాల్సివుంటుంది. టీడీపీ చేసిన తప్పేంటి.. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వారం రోజుల్లోగా తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫు ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తారన్న వివరాలను ఈసీకి అందించలేదు. నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల తర్వాత ప్రచారానికి వెళ్లే స్టార్ క్యాంపెయినర్ల వివరాలను టీడీపీ ఈసీకి పంపింది. దీంతో ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించిన స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులను భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల ఖర్చు కింద ఈసీ లెక్కయనుంది. ఎన్నికల్లో చేసిన ఖర్చు రూ.28 లక్షలు దాటినట్లయితే.. ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కమెడియన్ వేణు మాధవ్, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ముందే ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరఫు నంద్యాలలో ప్రచారం నిర్వహించనున్న 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్ల జాబితాను ఆగస్ట్ 2వ తేదీనే ఎన్నికల కమిషన్‌కి పంపింది. -
పోలింగ్ బూత్‌లో భూమా నాగ మౌనిక దౌర్జన్యం
వైఎస్సార్సీపీ ఏజెంట్‌ను భయపెట్టేందుకు విఫలయత్నం నంద్యాల అర్బన్ : నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా నాగ మౌనిక పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం చేశారు. భారీగా అను చరు లను వెంటే సుకుని వచ్చి ఎన్జీఓ కాలనీ పోలింగ్ బూత్‌లో దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ రిలీవింగ్ ఏజెంట్‌ను బెదిరించడానికి విఫల యత్నం చేశారు. ‘అతన్ని అరెస్ట్ చేయండి. మీకు చేతకాకపోతే మా వాళ్లను పంపి సెటిల్ చేస్తా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతను వారి దాడి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లగా ‘వాన్ని పట్టుకోండి రా..’ అని వేలు చూపిస్తూ తన వెంట ఉన్న అనుచరులను ఆదేశించారు. పోలీసులు ఆపేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ‘వాన్ని అరెస్ట్ చేయకపోతే నా మనుషులకు నేను సమాధానం చెప్పలేను.. తక్షణమే అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ పోలీసులను హెచ్చరించారు. -
భూమా బ్రహ్మానందరెడ్డిపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
నంద్యాల: నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. భూమా బ్రహ్మానందరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (ఐటీ) రిటర్న్స్ సమర్పించలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి తనది హిందు అవిభాజ్య కుటుంబమని తన నామినేషన్లో పేర్కొన్నారని, అయితే భూమా కుటుంబం హిందు అవిభాజ్యమైతే గతంలో అఖిలప్రియ నామినేషన్లో ఎందుకు పేర్కొనలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఆదాయ, వ్యయ వివరాలు వెల్లడించనందుకు ఆ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అభ్యంతరాలను ముందుకు తీసుకురాగా.. ఇతర అభ్యర్థుల నామినేషన్ల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌పై టీడీపీ అభ్యంతరం లేవనెత్తింది. శిల్పా నామినేషన్ పేపర్లను అటెస్ట్ చేసిన నంద్యాలకు చెందిన నోటరీ రామతులసీ రెడ్డి..తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదంటూ టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించిన టీడీపీ.. రామ తులసీరెడ్డి తన నోటరీని 2013 నుంచి రెన్యువల్ చేసుకోలేదని తెలిపింది. అయితే నోటరీ రెన్యువల్ అన్నది చాలా చిన్న విషయమని, అఫిడవిట్ లోపం కింద దీన్ని పరిగణించబోరని న్యాయకోవిదులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఏ విషయమైనా వెల్లడించకపోయినా.. లేక అసత్యాలు ప్రకటిస్తేనే అది నామినేషన్ లోపం కిందికి వస్తుంది కానీ.. నోటరీ రెన్యువల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పేర్కొన్నారు. కాగా టీడీపీ యధేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘిస్తూ నిన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు పొన్నాపురం కాలనీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీడీపీ బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. -
నంద్యాలలో టీడీపీ అభ్యర్థి నామినేషన్
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆయన స్వగృహం నుంచి మున్సిపల్ స్కూల్, సంజీవనగర్, శ్రీనివాస సెంటర్ మీదుగా టెక్కె మార్కెట్‌యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రసన్నకుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. -
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
కర్నూలు: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు. -
ఉప ఎన్నికలో గెలిపిస్తే రౌడీషీట్ ఎత్తేస్తాం
♦ తెలుగుదేశం బంపర్ ఆఫర్ ♦ నంద్యాలలో గెలిచేందుకు అడ్డదారులు ♦ రౌడీషీట్‌పై నారా లోకేశ్‌తో మాట్లాడతానన్న సోమిశెట్టి నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలవడానికి అధికార పార్టీ నిర్లజ్జగా అన్ని అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే రౌడీషీటర్లపై రౌడీషీట్లను తొలగిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం రౌడీషీటర్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పట్టణంలోని ఓ హోటల్లో బుధవారం టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో పోలీసులు కొందరు యువకులపై కేసులు పెట్టి రౌడీషీట్ తెరిచారని, వాటిని తొలగించాలని కోరారు. దీనిపై సోమిశెట్టి స్పందిస్తూ మంత్రి నారా లోకేశ్ త్వరలోనే నంద్యాలలో పర్యటిస్తారని అప్పుడు ఆయనతోఈ విషయం చర్చిస్తామని చెప్పారు. రౌడీషీట్ తొలగింపునకు ఏటా డిసెంబర్లో జాబితాను రూపొందిస్తారని, అప్పుడు పేర్లను తొలగిస్తామన్నారు.