నంద్యాలలో టీడీపీ అభ్యర్థి నామినేషన్
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆయన స్వగృహం నుంచి మున్సిపల్ స్కూల్, సంజీవనగర్, శ్రీనివాస సెంటర్ మీదుగా టెక్కె మార్కెట్‌యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రసన్నకుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.