
నిందితులతో ఎక్సైజ్ పోలీసులు
కర్నూలు : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు తా ర్నాక్ తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్‌ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ అక్రమంగా నంద్యాలకు తరలిస్తున్నాడు. కర్నూలు శివారులోని జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉదయమే కొండారెడ్డి కుమారుడిని వదిలేసి, మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన నారెళ్ల రాజేష్, తలారి శ్రీనివాసులను 1,2 ముద్దాయిలుగా చేర్చారు. కారు కొండారెడ్డి పేరుతో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యనను మూడో ముద్దాయిగా చేర్చారు. కొండారెడ్డికి నంద్యాలలో చంద్రిక, గాయత్రి బార్లు ఉన్నాయి. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత రేట్లు భారీగా పెరగడంతో తెలంగాణనుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment