Illegal liquor Transport
-
అక్రమ మద్యానికి అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీకి క్రమేణా అడ్డుకట్ట పడుతోంది. ఇటు అనంతపురం జిల్లా, అటు శ్రీసత్యసాయి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) పోలీసులు చెక్‌పోస్టుల్లో పకడ్బందీగా తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం వ్యాపారులకు చెక్ పెడుతున్నారు. ఇప్పుడు రెండు జిల్లాల్లోనూ సారా తయారీ, ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021లో నమోదైన కేసులతో పోలి్చతే 2022లో సగం కేసులు కూడా నమోదు కాలేదు. సగానికి తగ్గిన అరెస్టులు 2021లో 9 మాసాల్లో (జనవరి నుంచి సెపె్టంబర్ 30 వరకు) కాపు సారా, నల్లబెల్లం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (అక్రమ మద్యం) రవాణా కేసుల్లో 3,417 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది తొమ్మిది మాసాల్లో 1,419 మంది మాత్రమే అరెస్టయ్యారు. దీన్నిబట్టి అక్రమ మద్యం నియంత్రణ ఏస్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా కర్ణాటక నుంచి గతంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విచ్చల విడిగా మద్యం వచ్చేది. కర్ణాటక – శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్టు వద్ద భారీ స్థాయిలో మద్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గించడం కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో 15 గ్రామాలను నాన్పెయిడ్ లిక్కర్ అమ్మే గ్రామాలుగా గుర్తించారు. అందులో ఇప్పటికే 8 గ్రామాల్లో అమ్మకాలు పూర్తిగా లేకుండా చేశారు. శ్రీసత్యసాయిలో 8 గ్రామాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరినీ ఉపేక్షించం సరిహద్దుల్లో నిఘా వేసి జిల్లాలోకి అక్రమంగా వస్తున్న మద్యం, వాహనాలను నియంత్రించాం. పర్యవేక్షణ పెంచడం ఒకటైతే.. ప్రధానంగా ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే మద్యం తగ్గింది. రానురాను ఈ కేసుల సంఖ్య మరింతగా తగ్గిస్తాం. ఈ కేసుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. –రామ్మోహన్రావు, అడిషనల్ ఎస్పీ, సెబ్ -
కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ కార్యకర్తలు
సాక్షి, సోమందేపల్లి: మండలంలోని వివిధ ప్రాంతాలకు కర్ణాటక మద్యం తరలిస్తూ నలుగురు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. మంగళవారం సాయంత్రం సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కర్ణాటకలోని అక్కంపల్లి నుంచి గురుమూర్తి, గంగాధర్, ప్రసాద్, అనిల్, ఆంజనేయులు, మూర్తి నాలుగు కేస్ల్లో టెట్రా ప్యాకెట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. చదవండి: పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు లేరు పోలీసుల కళ్లుగప్పి ప్రసాద్, ఆంజనేయులు పరారయ్యారు. అరెస్ట్ అయిన వారిలో అనిల్ సీబీఎన్ ఆర్మీ కీలక సభ్యుడు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి అనిల్‌తో పాటు పరారీలో ఉన్న ప్రసాద్ ప్రధాన అనుచరులు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అందులో పట్టుబడ్డవారంతా టీడీపీ కార్యకర్తలే
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు మద్యనియంత్రణకు తూట్లు పొడుస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మద్యం రవాణాపై ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కాలం చెల్లిన బీర్ల అమ్మకాలపై విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామన్నారు. గడువు తీరిన స్టాక్‌ను ల్యాబ్‌లకు పంపి పరీక్షలు నిర్వహించాలని అధికారులతో చెప్పినట్లు పేర్కొన్నారు. అక్రమ మద్య రవాణా జరుగుతుందంటూ కొన్ని చోట్ల నుంచి వస్తున్న ఆరోపణలపై అధికారులతో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాను టీడీపీ నేతలే చేస్తున్నారన్నారు. అమరావతి మండలంలో నిన్న ఒక్కరోజే 9096 బాటిళ్లను పట్టుకున్నామని.. అందులో పట్టుబడ్డ వారంతా టీడీపీ కార్యకర్తలేనని నారాయణ స్వామి దుయ్యబట్టారు. (చదవండి : ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే) -
మల్లెపూలలో మద్యం బాటిళ్లు
-
మల్లెపూలలో మద్యం బాటిళ్లు
సాక్షి, ఉరవకొండ: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేయడానికి సివిల్, ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేసి పట్టుకుంటున్నా అక్రమార్కులు తమ దందా వీడటం లేదు. శనివారం రాత్రి విడపనకల్లు ఎస్ఐ గోపీ ఆధ్వర్యంలో విడపనకల్లు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్విఫ్ట్ డిజైర్ కారులో మల్లెపూల బస్తాలు తరలిస్తున్నారు. పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా తాము మల్లెపూల వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులూ తెలిపారు. పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో మల్లెపూల బస్తాలు లోపల చూడగా అందులో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బయటపడ్డాయి. హైవార్డ్స్ బాటిళ్లు 87, వీస్కీ టెట్రా ప్యాకెట్లు 88, 8 పీఎం బాటిళ్లు స్వాధీనం చేసున్నారు. ఎస్ఐ గోపీ కేసు నమోదు చేసి కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉరవకొండ సెబ్ ఆధ్వర్యంలో దాడులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సూపరిండెంట్ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్ సీఐ శ్యాంప్రసాద్, విడపనకల్లు ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమం మద్యం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, నాగేంద్ర ద్విచక్రవాహనంలో 40 విస్కీ బాటిళ్లు, 96 హైవార్డ్స్ విస్కీ బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన అశోక్, మంజునాథ్‌ల నుంచి 192 హైవార్డ్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామ శివార్లలో పాల్తూరు గ్రామానికి చెందిన నాగరాజు వద్ద 96 విస్కీ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సిబ్బంది రియాజ్ అహ్మద్, వెంకటేష్, రమేష్‌బాబు, రామకృష్ణ, వీరారెడ్డి, మౌలాలి, శైలజలు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం స్వాధీనం చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలో పోలీసులు విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో 380 కర్ణాటక మద్యం బాటిళ్లు, ఒక ద్విచక్రవాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణస్వామి, నాగేంద్రలు కర్ణాటక రాష్ట్రంలోని తిరుమణి నుంచి మద్యం తీసుకువచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. సెబ్ ఉక్కుపాదం అనంతపురం క్రైం: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఆదివారం జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపారు. 5322 టెట్రా ప్యాకెట్లు, 25 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 19 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశారు. అలాగే ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న ఇసుకను సీజ్ చేశారు. -
ఆటకట్టు, ఎక్కడిక్కడ మద్యం సీజ్
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యాన్ని తెచ్చి అమ్మి సొమ్ముచేసుకొంటున్నారు. చెక్ పోస్టుల్లో నిఘా పెరగటంతో అడ్డదారులు ఏర్పాటు చేసుకొని పోలీసుల కళ్లుకప్పి దందా కొనసాగిస్తున్నారు. అయితే, అక్రమరవాణా దారుల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కొరడా ఝళిపిస్తోంది. మూడంచెల చెక్‌పోస్టు విధానంతో నాన్ డ్యూటీ పెయిడ్ అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది. తాజాగా కృష్ణలంక,పెనమలూరు, నున్న ,గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చోట్ల ఏకకాలంలో ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .కొరియర్ సర్వీస్ ద్వారా తరలిస్తున్న 2,804 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .రవాణాకు ఉపయోగించిన ఆటో, లారీని సీజ్ చేశారు. మరోపక్క పరివర్తన పేరుతో ఎస్ఈబీ అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ సారా తయారీ దారుల్లో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టకపోతే పీడీ యాక్టులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు . -
భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
కర్నూలు : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు తా ర్నాక్ తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్ 3336 స్విఫ్ట్ డిజైర్ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్ అక్రమంగా నంద్యాలకు తరలిస్తున్నాడు. కర్నూలు శివారులోని జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉదయమే కొండారెడ్డి కుమారుడిని వదిలేసి, మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. నంద్యాలకు చెందిన నారెళ్ల రాజేష్, తలారి శ్రీనివాసులను 1,2 ముద్దాయిలుగా చేర్చారు. కారు కొండారెడ్డి పేరుతో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యనను మూడో ముద్దాయిగా చేర్చారు. కొండారెడ్డికి నంద్యాలలో చంద్రిక, గాయత్రి బార్లు ఉన్నాయి. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత రేట్లు భారీగా పెరగడంతో తెలంగాణనుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. -
మహారాష్ట్రకు మన మద్యం
పొరుగు రాష్ట్రంలోని గడ్చిరోలిలో మద్య నిషేధం ఇక్కడి నుంచి లిక్కర్ అక్రమ రవాణా చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌శాఖ సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా మద్యం అక్రమంగా మహా రాష్ట్రకు తరలుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో రెండేళ్లుగా మద్యనిషేధం అమల్లో ఉంది. దీంతో దొంగ చాటుగా లభిస్తున్న మద్యానికి అక్కడ డిమాండ్ ఎక్కు వగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమ్మేందుకు అను మతించిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. తూర్పు అడవుల్లో గోదా వరి తీరం వెంబడి ఈ దందా యథేచ్ఛగా కొనసాగు తోంది. కాటారం, మహదేవపూర్‌లకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. బెల్ట్‌షాపుల పేరు చెప్పి.. మహదేవపూర్ మండలంలో మూడు వైన్ షాపులు ఉన్నారుు. ఇందులో రెండు మహ దేవపూర్‌లో ఉండగా కాళేశ్వరంలో ఒక షాపు ఉంది. కాటారంలో మూడు వైన్‌షాపులు ఉన్నారుు. వీటికి అనుబంధంగా తూర్పు ఏజెన్సీలో వందల సంఖ్యలో బెల్టుషాపులు కొనసాగుతు న్నారుు. బెల్టుషాపులకు సరఫరా చేసే ముసుగులో మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. గోదావరి తీరం వరకు చేరు కున్న మద్యాన్ని ఆటోలు, పడవల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణ మద్యం మహారాష్ట్రలో రెట్టింపు ధర పలుకుతోంది. క్వార్టర్, హాఫ్, ఫుల్ ఇలా పరిమాణం ఏదైనా రేటు డబుల్‌గా ఉంటోంది. మహారాష్ట్రకు మద్యం తరలింపు ద్వారా లాభాలు అధికంగా ఉండటంతో క్రమంగా ఈ దందాలో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మార్గాల గుండా.. మన రాష్ట్రంలో కాళేశ్వరం - మహారాష్ట్రలోని సిరొంచ మధ్య వంతెన నిర్మాణం పూర్త రుు్యంది. గతంలో పడవల ద్వారా తరలిన మద్యం గత మూడు నెలలుగా ఈ వంతెన మీదుగా ఆటోలు, వ్యాన్ల ద్వారా సిరొంచకు తరలుతోంది. కొన్ని సందర్భాల్లో మహా రాష్ట్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా ఎక్కువగా ఇక్కడి వ్యక్తులే పకడ్బందీగా సరఫరా చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ నుంచి గోదావరి నదికి అవతలి వైపు ఉన్న నడిగూడకు పడవల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా మహారాష్ట్ర వైపు ఉన్న ఆసరెల్లి, అంకీస పట్టణా లకు మద్యాన్ని తరలిస్తున్నారు. పలిమెల మండలం దమ్మూరు నుంచి పడవల మీదుగా గోదావరి దాటి ఛత్తీస్‌గఢ్ లోని భూపాలపట్నం పరిసర ప్రాంతాలకు ఇక్కడి మద్యం రవాణా అవుతోంది. నిద్రమత్తులో ఎకై ్సజ్ శాఖ.. మన రాష్ట్రంలో అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రంలో అమ్ముతుంటే అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. నిత్యం డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, పడవల ద్వారా రవాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. మద్యం తరలించే మార్గాల్లో ఎటువంటి తనిఖీలూ నిర్వహించడం లేదు. దీంతో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ వ్యాపా రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం మహా రాష్ట్రలో సిరొంచ, నగరం, కమలాపూర్, అంకీస, అసరెల్లి, నడిగూడ, చింతలపల్లి తదితర ప్రాంతాల్లో తెలంగాణ మద్యం చీకటి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతోంది.