
చంద్రబాబుతో సీబీఎన్ ఆర్మీ సభ్యుడు అనిల్ (ఫైల్), మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో అనిల్, ప్రసాద్ (ఫైల్)
సాక్షి, సోమందేపల్లి: మండలంలోని వివిధ ప్రాంతాలకు కర్ణాటక మద్యం తరలిస్తూ నలుగురు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. మంగళవారం సాయంత్రం సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కర్ణాటకలోని అక్కంపల్లి నుంచి గురుమూర్తి, గంగాధర్, ప్రసాద్, అనిల్, ఆంజనేయులు, మూర్తి నాలుగు కేస్‌ల్లో టెట్రా ప్యాకెట్లు తరలిస్తూ పట్టుబడ్డారు.
చదవండి: పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు లేరు
పోలీసుల కళ్లుగప్పి ప్రసాద్, ఆంజనేయులు పరారయ్యారు. అరెస్ట్ అయిన వారిలో అనిల్ సీబీఎన్ ఆర్మీ కీలక సభ్యుడు. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి అనిల్‌తో పాటు పరారీలో ఉన్న ప్రసాద్ ప్రధాన అనుచరులు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment