సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు మద్యనియంత్రణకు తూట్లు పొడుస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మద్యం రవాణాపై ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కాలం చెల్లిన బీర్ల అమ్మకాలపై విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామన్నారు. గడువు తీరిన స్టాక్‌ను ల్యాబ్‌లకు పంపి పరీక్షలు నిర్వహించాలని అధికారులతో చెప్పినట్లు పేర్కొన్నారు. అక్రమ మద్య రవాణా జరుగుతుందంటూ కొన్ని చోట్ల నుంచి వస్తున్న ఆరోపణలపై అధికారులతో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాను టీడీపీ నేతలే చేస్తున్నారన్నారు. అమరావతి మండలంలో నిన్న ఒక్కరోజే 9096 బాటిళ్లను పట్టుకున్నామని.. అందులో పట్టుబడ్డ వారంతా టీడీపీ కార్యకర్తలేనని నారాయణ స్వామి దుయ్యబట్టారు. (చదవండి : ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే)
Comments
Please login to add a commentAdd a comment