సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో ది ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్(రెండో సవరణ) బిల్లు 2020 చర్చ సాగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కూడా ప్రతిపక్షం అడ్డుకుంటుందని విమర్శించారు. అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకోవడం దారుణమన్నారు. పాడైపోయిన రోడ్లను అభివృద్ధి చేయడానికి బిల్లును ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని గుర్తు చేశారు. చదవండి: వారికి జీతం ఎంత పెంచినా తక్కువే: మంత్రి బుగ్గన
‘మీది చిత్తూరు జిల్లానే మాది చిత్తూరు జిల్లానే. జిల్లాలో మన ఇద్దరం కలిసి ఏ ప్రాంతానికైనా వెళ్దాం. మా ప్రభుత్వం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందని ప్రజలు చెప్తే నా పదవికి నేను రాజీనామా చేస్తాను. మా ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని ప్రజలు చెప్తే లోకేష్ రాజీనామా చేయాలి’. అని నారా లోకేష్‌కు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తమది కాదని, ఎన్టీఆర్ స్థాపించిందని ప్రస్తావించారు. ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే మీరందరూ ఒంటరిగా మిగిలి పోతారని అన్నారు. ఇదిలా ఉండగా శాసనమండలిలో మరొక బిల్లును టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ది ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్ ట్రేడ్స్ కాలింగ్ అండ్ ఎంప్లాయిమెంట్స్ (సవరణ) బిల్లు-20 20 బిల్లుపై టీడీపీ నేతలు డివిజన్ కోరారు. బిల్లుకు 24 మంది టీడీపీ ఎమ్మెల్సీలు వ్యతిరేకించగా అనుకూలంగా తొమ్మిది మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఓటేశారు. తటస్థంగా అయిదుగురు ఎమ్మెల్సీలు ఓటేశారు. చదవండి: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్!
Comments
Please login to add a commentAdd a comment