Updates..
అసెంబ్లీలో బుగ్గన ప్రసంగం
►డేట్ అనేది మెన్షన్ చేయకుండా అగ్రిమెంట్ చేసుకున్నారు
►తేదీ లేకుండా అగ్రిమెంట్ చేసుకోవడం ఒక విచిత్రం
►2015-16లో రూ. 371 కోట్లు రిలీజ్ చేశారు
►డిజైన్ టెక్ అనేది ఒక డొల్ల కంపెనీ
►ఎంఓయూ పూర్తయ్యాకే ఓ కంపెనీ స్థాపించారు
►కీలక పదవుల్లో ఓ ప్రైవేటు వ్యక్తిని పెట్టారు.. గంటా సుబ్బారావుని అందలం ఎక్కించారు
►ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తే మనం పట్టించుకోకుండా ఉండాలా?
►దోచుకుని దొరికితే సన్మానం చేయాలా?
►ఇందులో సుమన్‌బోస్ కీలక వ్యక్తి
►సదరు వ్యక్తి గుజరాత్‌లో సోమేంద్ర బోస్ అని, ఇక్కడ సుమన్ బోస్ అని సిగ్నేచర్ చేశారు
►ఈ స్కామ్‌కు సంబంధించి తనకు నచ్చిన ప్రైవేటు వ్యక్తిని చంద్రబాబు పెట్టుకున్నారు
►మనకు ఇంటర్నెట్‌లో స్కిల్ అంశాలకు సంబంధించి చాలా వరకూ ఫ్రీగానే దొరుకుతుండగా సీమెన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్లు ఇస్తుందంటూ కట్టు కథని చెప్పారు.
►ప్రభుత్వ డబ్బును బయటకు తీయడానికే ఈ పని చేశారు
►ప్రభుత్వ డబ్బును రూ. 371 కోట్లు తీసేసి.. 3 వేల కోట్లు ఎవరో ఇస్తారంటూ కథలు వినిపించారు.
►ఇందులో చాలా క్లియర్‌గా స్కామ్‌కు తెరలేపాడు
►టెండర్లకు పోకుండా రూ. 371 కోట్లు ఎలా ప్రభుత్వ నిధులను బయటకు లాగాలానే స్కామ్‌లో భాగంగానే ఇది జరిగింది
►3వేల కోట్ల రూపాయలు ఒక సృష్టి అయితే దాని ద్వారా ఒక క్రెడిట్ పొందాలనే ప్రయత్నం చేశాడు బాబు
►ప్రభుత్వ నిధులు లాగేయడానికి సీమెన్స్ కంపెనీనిని చంద్రబాబు వాడుకున్నారు.
బాలకృష్ణతో జాగ్రత్త
►బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదన్న ఎమ్మెల్యే బియ్యపు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. ఆయనకు మెంటల్ ఉన్నట్లు ఒక ఆస్పత్రి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇలాంటి వ్యక్తి ప్రవర్తన అసెంబ్లీలో ఇతర సభ్యులకు ఇబ్బందికరం. దీని కోసం సభలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
— YSR Congress Party (@YSRCParty) September 22, 2023
- ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి #TDPGoonsInAssembly… pic.twitter.com/GOMVoSc64U
12:18PM
స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా పేర్ని నాని ప్రసంగం
►ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు
►ఇప్పుడు ప్రశ్నిస్తే కాదు.. లేదు అని డైలాగ్‌లు చెబుతున్నారు
►ఇష్టారాజ్యంగా ధనం దోచుకున్నారు
►ఐఏఎస్‌ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు
►చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యం
►కేవలం సాంకేతిక కారణాలే కోర్టుల్లో చెబుతున్నారు
►బాబు జైలుకెళ్లగానే ఆయన సీట్లో బాలయ్య కూర్చున్నారు
►అసెంబ్లీలో కూడా బాబు చైర్‌లో కూడా బాలయ్య నిలబడ్డారు.
►చంద్రబాబు స్కామ్ ఏంటన్నది మనవడికి కూడా అర్ధమవుతోంది
►సీమెన్స్ రూ. 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందంలో లేదు
►చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుట్ర అమలు చేశాడు
►డిజైన్‌టెక్ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేశాడు
►చంద్రబాబు డబ్బును ఎత్తేయడంలో ఎంతో ఆత్రంగా వ్యవరించారు.
►స్కిల్ స్కామ్‌లో ఏం జరుగుతుందో చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికీ అసలు విషయం తెలియదు
►గంటా సుబ్బారావును తీసుకొచ్చి అందలం ఎక్కించారు
►డొల్ల కంపెనీలకు స్కిల్ నిధులు మళ్లింపు
►అక్కడ నుంచి హవాలా ద్వారా చంద్రబాబు ఖాతాలోకి చేరాయి
►వికాస్ ఖన్వేలర్, సుమన్ బోస్‌లిద్దరూ తోడు దొంగలే
అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా కన్నబాబు ప్రసంగం
►డొల్ల కంపెనీలు పెట్టి అడ్డంగా దోచుకున్నారు
►ఏ మొహం పెట్టుకుని నీతి పాలన చేశామని చెప్పుకుంటున్నారు
►డబ్బులను రకరకాల అకౌంట్‌లలోకి మళ్లించారు
►రూ. 371 కోట్ల స్కామ్ జరిగితే అది పెద్ద స్కామా అంటూ యెల్లో మీడియా సిగ్గు లేకుండా కథనాలు రాస్తోంది
►చంద్రబాబు కానుకలోనూ అవినీతి చేశారు
►చంద్రబాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగింది
►ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు
►చేసిన నేరాలకు జైల్లో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది
►ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచాడు చంద్రబాబు
►యెల్లో మీడియా చూపిస్తున్నది అంతా అసత్యాలే
►ఎంతోమంది సీజేలను చూసి ఇప్పుడు రాజమండ్రి సీజేలో ఊచలు లెక్క పెడుతున్నాడు
►చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమే
►కేబినెట్‌లో అప్రూవ్ చేసింది ఒకటి.. ఒప్పందం చేసుకుంది మరోలా
►కరెంట్‌పోతే చీకట్లో సంతకాలు పెట్టామనడం సిగ్గుచేటు
►పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగింది
►సెక్రటేరియట్‌లో నోట్‌ఫైళ్లు మొత్తం మాయం చేశారు:
►అప్పటి కేబినెట్‌నే చంద్రబాబు తప్పుదారి పట్టించారు
►యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారు
►విజనరీ అనే చెప్పుకుని చంద్రబాబు.. ఇప్పుడు ప్రిజనరీగా మారారు:
►17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు
►ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్ట్ చేశారు
►ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు
►బెయిల్ మీద వచ్చిన సుమన్‌బోస్‌కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరం
►చంద్రబాబు అవినీతిని ఐటీ బట్టబయలు చేసింది
►ఎన్టీఆర్ అంత గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు
►చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు
►చంద్రబాబు ఆదేశాల మేరకు స్కిల్ నిధులను విడుదల చేశారు
►స్కిల్ స్కామ్ నిధులు నేరుగా తన ఖాతాలోకే వస్తాయి కాబట్టి.. దానిపై చంద్రబాబుకు అంతప్రేమ
►టన్నులు అంటే బరువు కాదు.. కోట్లు అనే అర్థం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్
►ఒకే రోజు.. ఒకే విధంగా రూ. 371 కోట్లు రిలీజ్ చేశారు
►బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట
►వాదనలు విన్న తర్వాతే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది
11:04AM
►స్కిల్ సామ్‌పై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ
10: 51AM
►అసెంబ్లీలో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన
►విజిల్స్‌తో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు
►విజిల్స్ ఆపాలని స్పీకర్ విజ్ఞప్తి
►అయినా పట్టించుకోని టీడీపీ సభ్యులు
►అసెంబ్లీ నుంచి నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ సస్పెన్షన్
► ఒకరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్
►టీడీపీ సభ్యులను మానసిక ఆస్పత్రికి తరలించాలి: బియ్యపు మధుసూదన్
►అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదు: బియ్యపు మధుసూదన్
10:40AM
►తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ
10:38AM
►శాసనమండలి మళ్లీ వాయిదా
10: 30AM
►టీడీపీ సభ్యులకు చైర్మన్ హెచ్చరిక
►సభలో ఈ ప్రవర్తన సరికాదన్న చైర్మన్
10:28AM
► మండలిలో టీడీపీ సభ్యులు ప్రకార్డులతో నిరసన
►అరుపులు కేకలతో గందరగోళంగా మారిన సభ
►కొనసాగుతున్న క్వశ్చన్ అవర్
►మార్షల్స్‌ను నెట్టి వేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి బొత్స సత్యనారాయణ
10:21AM
►వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన మండలి
►మండలిలో మోహరించిన మార్షల్స్
►టిడిపి సభ్యులు చైర్మన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న మార్షల్స్
►నినాదాలు చేస్తున్న టిడిపి సభ్యులు
►క్వశ్చన్ అవర్ ను ప్రారంభించిన చైర్మన్
10:13AM
►శాసనమండలి ఐదు నిమిషాల పాటు వాయిదా వేసిన చైర్మన్
10:02AM
►రెండో రోజు ప్రారంభమైన మండలి సమావేశాలు
►మండలిలో చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ఇచ్చిన టిడిపి సభ్యులు
►జాబ్ క్యాలెండర్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన పిడిఎఫ్ సభ్యులు
►వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్
►చైర్మన్ చైర్ చుట్టు నిలబడి నిరసన తెలియజేస్తున్న టిడిపి సభ్యులు
►ప్రాపర్ ఫార్మేట్ లో వస్తే చర్చిస్తామన్న చైర్మన్
►నినాదాలు చేస్తున్న టిడిపి సభ్యులు..
09:54AM
►దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి: మంత్రి కాకాణి
►పిరికిపందల్లా పారిపోవద్దు: మంత్రి కాకాణి
►దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించడం సరికాదు: మంత్రి కాకాణి
►బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు: మంత్రి కాకాణి
►టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: మంత్రి కాకాణి
► చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు: మంత్రి కాకాణి
09:51AM
►సభ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
► అచ్చెన్నాయుడు, బి. అశోక్‌లు సస్పెన్షన్
► ఈ సెషన్ మొత్తం సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్‌లు సస్పెన్షన్
►సభలో విజిల్స్ వేస్తూ రెచ్చిపోయిన బాలకృష్ణ
09:42AM
►రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయింది: మంత్రి జోగి రమేష్
►అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నాడు: మంత్రి జోగి రమేష్
►కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నాడు: మంత్రి జోగి రమేష్
09:40AM
►వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ
►సభను అడ్డుకునే యత్నం చేస్తున్న టీడీపీ
రెండో రోజు మారని టీడీపీ సభ్యుల తీరు
►స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు
►టీడీపీ సభ్యుల తీరుతో సభను వాయిదా వేసిన స్పీకర్
► టీడీపీ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని. సభలోకి ప్రవేశించిన మార్షల్స్. నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు రభస సృష్టించడంతో సభలో ప్రత్యేక చర్యలకు ఆదేశించిన స్పీకర్.
► స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు.
► సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇది టీడీపీ ఆఫీసు కాదు. చట్ట సభ. ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనవసర పదాలు ఉపయోగిస్తే మేము సహించం. సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోం. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే ఊరుకునేది లేదు. ఈరోజు చర్చ ఉంది. టీడీపీ సభ్యులు పాల్గొనాలి.
► సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం. టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలి. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలుంటాయి. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడాలి.
► అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు. సభకు రావాడంతోనే నిరసనకు దిగిన టీడీపీ సభ్యులు.
► రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల నినాదాలు. రెండో రోజు కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు. సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం.
► అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.
► అసెంబ్లీ పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, అరెస్ట్‌పై మేము చర్చకు సిద్దం. ఎప్పుడైనా.. ఎక్కడైనా మేం చర్చకు రెడీ. టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి చర్చకు రావాలి. ప్రాపర్ ఫార్మాట్‌లో టీడీపీ చర్చకు రావాలి. టీడీపీ చర్చలో పాల్గొనాలి.. పారిపోవద్దు. బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదు.. టీడీపీలో తిప్పాలి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ మీసం తిప్పితే బాగుండేది. సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరు. మీరు నీతిమంతులైతే దమ్ముంటే చర్చకు రండి. బాలకృష్ణ రీల్ హీరో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రియల్ హీరో.
09:00AM
► ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి.
► నేడు అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చర్చ జరుగనుంది.
► అసెంబ్లీకి ముందుకు పలు బిల్లుల వచ్చే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటిరోజు..
శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగజారుస్తూ, స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్లరగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపోయారు. పయ్యావుల, తదితరులు సీనియర్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు.
మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ..
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment