Time: 03:20 PM
► శాసన మండలి, శాసన సభ రేపటికి వాయిదాపడింది.
Time: 03:05 PM
► మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఈ సంధిగ్ధతను తొలగించేందుకు మండలిని తిరిగి కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు.
Time: 03:00 PM
► అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Time: 02:21 PM
►1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని.. 90 ఏళ్లుగా కులపరమైనా జనాభా లెక్కలు లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప.. కచ్చితమైన లెక్క లేదన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతం ఉందన్నారు. వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదన్నారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Time: 02:12 PM
►అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
Time: 01:32 PM
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Time: 12:30 PM
►కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని వేణుగోపాల కృష్ణ అన్నారు.
►ఏపీ శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. గోవింద్‌రెడ్డి, ఇషాక్, విక్రాంత్ వర్మ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.
Time: 11:17 AM
►ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ప్రశ్నించారు. మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Time: 10:39 AM
►అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన అన్నారు.
Time: 10:30 AM
►ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది.
Time: 9:38 AM
దేశంలోనే ఆదర్శమైన పథకం ఆరోగ్యశ్రీ అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
Time: 9:30 AM
►ఆరోగ్యశ్రీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2446 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. గతంలో కేవలం 1059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగేంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 1387 వ్యాధులను అదనంగా చేర్చడం జరిగిందని మంత్రి తెలిపారు.
Time: 9:15 AM
సాక్షి, అమరావతి: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కులాలవారీగా బీసీ జనగణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. నేడు ఏపీ శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment