సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరపాలనుకున్నామని, బీఏసీ సమావేశంలో ప్రతిపక్షం అడిగారని వారానికి పెంచామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని మండిపడ్డారు.
చదవండి: రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం: విజయసాయిరెడ్డి
కౌరవసభ అని ఆరోపించి వెళ్లిపోయారని, వాస్తవానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని శ్రీకాంత్ మండిపడ్డారు. ఈ సభలో బీసీలు, మైనారిటీల అంశాలతోపాటు మహిళా సాధికారత, వరదల వల్ల నష్టపోయిన వాటిపై, విద్యారంగంపై సుధీర్ఘంగా చర్చ జరిపామని తెలిపారు. నేరుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.
చదవండి: AP: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా
34 గంటలు చర్చలు జరిపామని, 93 మంది సభలో మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. కానీ ప్రతిపక్షం రాకపోవడం దారుణమని, సభలో మహిళలను కించపరిచింది టీడీపీ అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానం చెప్పామని.. వారి వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. తమ ప్రభుత్వం ఎవరినీ అవమానించదని, అనేక అంశాలపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment