సమస్యాత్మక గ్రామమైన ఆత్మకూరు మండలం సిద్దాపురంపై ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడులు చేశారు.
ఆత్మకూరు రూరల్ (కర్నూలు) : సమస్యాత్మక గ్రామమైన ఆత్మకూరు మండలం సిద్దాపురంపై ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడులు చేశారు. కర్నూలు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ నాగమణి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని ఇళ్లనూ సోదా చేశారు. అనంతరం సమీపంలోని నల్లమల అడవుల్లో ఉన్న నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు.
మొత్తం 11, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కాగా 120 లీటర్ల నాటుసారా లభ్యమయింది. మొత్తం 56 ఇనుప డ్రమ్ములను, 40 కేజీల బెల్లాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఈ దాడుల్లో ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ఎక్సైజ్ సీఐలు యాభైమంది సిబ్బంది పాల్గొన్నారు.