కర్నూలు : కర్నూలు జిల్లాలోని బేతంచర్ల మండలం బుద్ధవరం గ్రామ పరిసర ప్రాంతంలో సారాబట్టీలపై మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. డోన్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో 4,500 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.
ఈక్రమంలో గ్రామ పరిధిలో సారా కాయడానికి ఏర్పాటు చేసిన పలుబట్టీలను ధ్వంసం చేశారు. నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
సారాబట్టీలపై దాడులు : 4,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
Published Tue, Jul 28 2015 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement