
పోలింగ్ బూత్‌లో భూమా నాగ మౌనిక దౌర్జన్యం
ఓ వైపు నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంటే మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.
టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతను వారి దాడి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లగా ‘వాన్ని పట్టుకోండి రా..’ అని వేలు చూపిస్తూ తన వెంట ఉన్న అనుచరులను ఆదేశించారు. పోలీసులు ఆపేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ‘వాన్ని అరెస్ట్ చేయకపోతే నా మనుషులకు నేను సమాధానం చెప్పలేను.. తక్షణమే అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ పోలీసులను హెచ్చరించారు.