silpa mohan reddy
-
ఒక్కడిని చూసి ఇంతమంది భయపడుతున్నారు: శిల్పా మోహన్ రెడ్డి
-
టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు
-
టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు: శిల్పా
నంద్యాల, సాక్షి: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు నంద్యాల వాసులు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు గాంధీ చౌక్ లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలో శిల్పా మోహన్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు ఇళ్లు కట్టిస్తామన్న మాట పచ్చి అబద్ధమని ఈ సందర్భంగా శిల్పా తెలిపారు. భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో పదివేల ఇండ్లు ఫ్రీగా కట్టిస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు అడుగుతూ ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వైఎస్ జగన్ సీఎం కావటం ఖాయమని, ఆయన అధికారంలోకి రాగానే మూడు సెంట్ల స్థలం, ఉచిత ఇళ్లు మంజూరు చేస్తామని శిల్పా హామీ ఇచ్చారు. ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులు తొలగిస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఒక్క రేషన్ కార్డు పోనివ్వకుండా చూసుకునే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. రౌడీయిజంను అదుపు చేసే చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, వైఫై సదుపాయం ఇలాంటివన్నీ నెరవేర్చలేదని శిల్పా పేర్కొన్నారు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు కూలగొట్టడం, రోడ్లువేయటం కాదని, పరిశ్రమలు, విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని శిల్పా అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నానని, శిల్పా కేబుల్ పేరిట తక్కువ నగదుకే సదుపాయాన్ని కల్పించానని ఆయన పేర్కొన్నారు. మీకు ఆళ్లగడ్డ రాజకీయాలు కావాలో? నంద్యాల రాజకీయాలు కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఓటేయాలని ప్రజలకు ఆయన విజ్నప్తి చేశారు. -
నంద్యాలకు అన్న వస్తున్నాడు
-
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు
నేటి నుంచి వైఎస్ జగన్ ప్రచారం ♦ మధ్యాహ్నం ఒంటి గంటకు రైతునగరం నుంచి ప్రారంభం ♦ మొదటివిడతలో మూడు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో కీలక ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నంద్యాల మండలం రైతు నగరం నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో మొదటి రోజు 17.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ రోడ్ షోపై భారీగా నిఘా ఉంచేందుకు అధికార పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అడుగడుగునా నిఘా ఉంచి.. వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలతో అటువైపు వెళ్లిన కొద్ది మంది నేతలు కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలను కూడా సేకరించాలని నిఘా వర్గాలకు అధికార పార్టీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కుయుక్తులు.. ఇప్పటికే నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగంతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ హామీలపై జనంలో చర్చ జరగకుండా చూసేందుకు గానూ ఇతర అంశాలపై రచ్చ చేశారు. సోమవారం మరో అడుగు ముందుకేసి ఏకంగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ దుష్ప్రచారం చేశారు. అయితే, నామినేషన్‌ను ఎన్నికల సంఘం అంగీకరించడంతో అధికారపార్టీ నేతల నోళ్లకు తాళం పడింది. ఇదిలావుండగా.. జగన్ ఉప ఎన్నికల ప్రచారంపై అధికా>ర పార్టీ భారీగా నిఘా ఏర్పాటు చేసింది. అంతకుముందుగానే కొత్తగా ఏయే నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నారనే అంశాన్ని కూడా వాకబు చేస్తున్నారు. ఆయా నేతలపై ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ ప్రచారంలో కూడా మరికొంత మంది నేతలు వెంట నడిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ బహిరంగ సభ తర్వాత పార్టీలో మరింత ఊపు వచ్చిందని, ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీలపై నంద్యాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని వారు అంటున్నారు. తాజా రోడ్ షో ప్రచారంతో కేడర్‌లో మరింత ఉత్సాహం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. రోడ్‌షో ద్వారా ప్రచారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా రోడ్‌షో ద్వారా ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మొదటి రోజు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నంద్యాల మండలం రైతు నగరం నుంచి ప్రచారం ప్రారంభం కానుందన్నారు. అక్కడి నుంచి రామకృష్ణానగర్, కానాల, హైస్కూల్ కొట్టాల.. అనంతరం గోస్పాడు మండలంలోని ఎం. చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, తేళ్లపురి వరకు రోడ్‌షో ఉంటుందని వెల్లడించారు. -
హైడ్రామా
♦ ఉప ఎన్నికలో గెలవలేమని టీడీపీ కుయుక్తులు ♦ శిల్పా నామినేషన్ చెల్లదంటూ ఆర్వోకు ఫిర్యాదు ♦ మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ ♦ సాయంత్రం శిల్పా నామినేషన్‌కు ఆర్వో ఆమోదం ♦ సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు నంద్యాల : ఉప ఎన్నికలో గెలవలేమనే భయంతో అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. చివరకు నామినేషన్ల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించి అభాసుపాలయ్యారు. నాయకులను కొనుగోలు చేయడం, సోదాల పేరుతో పోలీసుల ద్వారా కౌన్సిలర్లను బెదిరించడం, ప్రచారాలను అడ్డుకోవడం.. ఇలా ఎన్ని చేష్టలు చేస్తున్నా టీడీపీ నేతలను మాత్రం ఓటమి భయం వీడడం లేదు. దీంతో చివరి ప్రయత్నంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరింపజేసేందుకు విఫలయత్నం చేశారు. సోమవారం నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్లో జత చేసిన అఫిడవిట్ చెల్లుబాటు కాదని టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దాన్ని ఇచ్చిన అడ్వొకేట్ రామతులసిరెడ్డి నోటరీ కాల పరిమితి 2013లోనే ముగిసిందని, ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోలేదని, అలాగే అఫిడవిట్‌ను రూ.100 బాండ్‌పై కాకుండా తెల్లపేపర్‌పై ఇచ్చారంటూ టీడీపీ తరఫు న్యాయవాది రామచంద్రారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉత్కంఠత నెలకొంది. 2014 ఎన్నికల్లోనూ రామతులసిరెడ్డి నోటరీగా సంతకం చేశారని, అప్పుడు సమ్మతించి.. ఇప్పుడెందుకు అభ్యంతరం పెడతారని వైఎస్సార్సీపీ నాయకులు వాదించారు. తాము ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేశామని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయలేదని, కావున ఆయన నామినేషన్ తిరస్కరించాలని వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఇద్దరి నామి నేషన్ల పరిశీలనకు సమయం తీసుకున్నారు. ఓ దశలో శిల్పామోహన్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైందంటూ కొన్ని ఛానెళ్లలో దుష్ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, రిటర్నింగ్ అధికారి ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా నామి నేషన్లు క్షుణ్ణంగా పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ స్పష్టం చేశారు. దీంతో టీడీపీ కుయుక్తులకు చెక్ పడింది. శిల్పా నామినేషన్ ఓకే కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. దొంగబుద్ధులెందుకు?: ఎన్నికల్లో గెలవలేమనే భయంతో టీడీపీ నాయకులు.. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరింపజేయాలని చూశారు. అభివృద్ధి చేశాం, గెలుస్తామని చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు ఇలాంటి దొంగ బుద్ధులెందుకు? అనవసర అభ్యంతరాలతో ప్రజలను ఉత్కంఠకు గురి చేశారు. శిల్పా నామినేషన్ ఆమోదంతో వారి కుయుక్తులకు చెక్ పడింది. వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది: ఉపఎన్నికలో ఓడిపోతామని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. అందుకే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని ఎన్నికల అధికారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నికల అధికారి నిజాయితీగా వ్యవహరించి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను ఖరారు చేశారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే ధైర్యం లేక దొంగదారిన వెళ్తున్నారు: అధికార పార్టీ నాయకులు ధైర్యంగా పోరాడలేక దొంగ దారుల్లో వెళ్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడి ఎన్నికల నియమావళి ప్రకారమే మేం నామినేషన్ వేశాం. అఫిడవిట్లో నోటరీ సంతకం కాలపరిమితి తీరిందన్న చిన్న సాకుతో నామినేషన్ ఎత్తి వేయాలని టీడీపీ నాయకులు చూశారు. వారి ఎత్తుగడ పారలేదు. శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం తథ్యం. శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి -
ముస్లిం సోదరులతో శిల్పామోహన్‌రెడ్డి సమావేశం
-
లీడర్‌తో ఒక రోజు
-
నంద్యాలలోనే కాదు 2019 లోనూ వైఎస్సార్సీపీనే
-
2019 యుద్ధానికి నంద్యాలే నాంది
-
2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాలే నాంది
⇔ ప్రజలకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ⇔ ఇది మోసపూరిత వాగ్దానాలు, కుట్రపూరిత రాజకీయాలు, అవినీతి అసమర్థ పాలనపై మీరిచ్చే తీర్పు ⇔ చంద్రబాబుకు ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి ⇔ మూడేళ్ల పరిపాలనలో ఒక్క పనైనా చేశారా? ⇔ నంద్యాలకు ప్రకటించిన ప్రతి పథకంలోనూ లంచాలే ⇔ విలువలతో కూడిన రాజకీయాల కోసమే చక్రపాణి రాజీనామా కోరా ♦ 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది నంద్యాలే. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ♦ మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి ♦ నంద్యాల ప్రజలంతా జడ్జి స్థానంలో ఉండి చంద్రబాబు లాంటి వ్యక్తికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి ♦ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. ఒక్క హామీనైనా అమలు చేశారా అని అడుగుతున్నా? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా? ♦ కేవశరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తా నని మాట ఇస్తున్నా. చంద్రబాబు ♦ చొక్కాను, ఆదినారాయణ రెడ్డి నిక్కరును ఊడదీస్తాం. ♦ ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా చేస్తాం. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 చేస్తాం. ♦ ఆర్యవైశ్య సోదరులు ప్రత్యేక కార్పొరేషన్ కోసం ఎవరివద్దకూ పోవాల్సిన అవసరం లేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తాం. ♦ నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే... చంద్రబాబు నంద్యాలకు కనీసం ఒక్క రూపా ౖయెనా విదిల్చేవాడా అని అడుగుతున్నా? ♦ నంద్యాల ఉప ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి. ♦ నంద్యాలకు చంద్రబాబు వచ్చినప్పుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని. ♦ 2018లో వైఎస్సార్సీపీకి వచ్చే ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నంద్యాలకు చెందిన ముస్లింకే ఇస్తాం. ♦ ఈ నెల 9వ తేదీ నుంచి 21 వరకూ నేను నంద్యాలలోనే ఉంటా. ♦ టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన్ను పులి అందామా.. సింహం అందామా... సాక్షి ప్రతినిధి, కర్నూలు : 2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని...నంద్యాల ప్రజలు జడ్జిపాత్ర పోషించి, ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని వదిలి చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపు వాగ్దానాలు, అవినీతి పాలన, కుట్ర రాజకీయాలు, అసమర్థపాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయని నంద్యాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లల్లో ఒక్క వాగ్దానాన్ని అమలు చేయని వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబట్టే నంద్యాల రోడ్లపై ముఖ్యమంత్రి, మంత్రులు తిరుగుతున్నారని పేర్కొన్నారు. కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని జగన్ హామీనిచ్చారు. నంద్యాలను జిల్లా చేస్తామని...రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచుతామని పేర్కొన్నారు. ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలన్నారు. 2018లో పార్టీకి వచ్చే ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నంద్యాలకు చెందిన ముస్లింలకే కేటాయిస్తామని హామీనిచ్చారు. దర్మానికి– అధర్మానికి, న్యాయానికి–అన్యాయానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచి చంద్రబాబుకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అబద్దపు హామీలతో, పర్సంటేజీలతో పనులు చేస్తున్న ఇటువంటి వ్యక్తిని ఏమని పిలవాలో చెప్పాలని ప్రజలను కోరారు. ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ నంద్యాలలోనే ఉంటానని.... పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ!: ‘‘నంద్యాలకు చంద్రబాబు వచ్చినపుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని అడగండి. చంద్రబాబుకు కూడా తెలుసు. తానేమీ చేయలేదని, ప్రజల దగ్గరికి పోతే కొడతారని ఆయనకు తెలుసు. అందుకే కళ్లు పెద్దవి చేసి ప్రజలపై పిచ్చి కోపం చూపిస్తాడు. నా పెన్షన్లు తింటున్నారు. నేనిచ్చే రేషన్ తింటున్నారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు. నేను వేసిన దీపాల కింద కూర్చుంటున్నారు. నాకు ఓటు వేయకపోతే ఎలా? లేదంటే పెన్షన్లు, రేషన్ తీసుకోవద్దు. నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బెదిరిస్తున్నారు. తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ అని చెబుతున్నా. నువ్వు చెబుతున్న అవే రోడ్లపై నిలబడి నిన్ను ప్రశ్నిస్తాం. అవే వీధి దీపాల కింద కూర్చుని నిన్ను నిలదీస్తాం. నువ్వు ఇచ్చేది నీ అత్తగారి సొత్తా చంద్రబాబూ? మహా సంగ్రామంలో ఇది తొలిమెట్టు..: మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో సంవత్సరంన్నరలోనే మళ్లీ ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. నంద్యాలలో మీరు వేసే ఓటు ఆ కురుక్షేత్ర మహా సంగ్రామానికి తొలిమెట్టు కాబోతోంది. రేపు జరగబోయే మార్పుకు నంద్యాల నాంది పలకబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత నాకొదిలేయండి అని భరోసా ఇస్తున్నా. విత్తనానికి, వ్యవసాయానికి నంద్యాలను కేంద్ర బిందువుగా చేస్తాం. ఇక్కడే వ్యవసాయ యూనివర్సిటీ పెడతాం. కుందూ నది వల్ల నంద్యాల ఎంత బాధపడుతోందో తెలుసు. అక్కడ పనులు చూసా. కానీ జనాన్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు అక్కడ పెట్టిన నాలుగు పొక్లెయిన్ల వల్ల జరిగేది కాదది. ఆ పనులు పూర్తిచేసే మంచితనం చంద్రబాబుకు లేదు. నాకు వదిలేయండి ఆ పనులు నేను చూసుకుంటా. నంద్యాలను మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఓ కారణముంది. ప్లీనరీలో నవరత్నాల పథకాలను ప్రకటించాం. ఆ నవరత్నాలు రేపు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఆ నవరత్నాలను అందించబోతున్నాం. జిల్లాలు 25 చేస్తాం..: ప్రతికుటుంబానికీ ఆ నవరత్నాలు అందాలంటే ఇపుడున్న వ్యవస్థ మారాలి. ఇది ఇంకా బలపడాలి. ఈ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా, నవరత్నాలను ప్రతి కుటుంబానికీ చేర్చే దిశగా ఇపుడున్న జిల్లాలను మార్చబోతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లా చేయబోతున్నాం. ఇపుడున్న జిల్లాలను 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌గా నంద్యాలే ఉంటుంది. ఒకసారి నంద్యాల జిల్లా అయిపోతే ఇక్కడే మీ కళ్ల ముందే కలెక్టరేట్, ఎస్పీకార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రతి ప్రభుత్వ కార్యాలయం వస్తుంది. జిల్లా కేంద్రంగా నంద్యాల అత్యంత వేగంగా, అత్యంత అభివృద్ధి చెందుతుందని వేరే చెప్పనక్కరలేదు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలని కోరుతున్నా. నంద్యాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకొదిలేయండి. అందరికీ న్యాయం చేస్తాం.. మోసగాళ్లకు బుద్ది చెబుతాం: ఇల్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. చంద్రబాబు లంచాలు తీసుకున్న డబ్బును మీరు అప్పుగా బ్యాంకులకు కంతులు కట్టాల్సిన పనిలేదు. ప్రతిపేద వాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెబుతున్నా. ఇల్లు కట్టివ్వడమే కాదు. రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను కూడా వారి చేతికిస్తాం. నంద్యాలలో రోడ్డు విస్తరణ పేరుతో ఏ సంప్రదింపులు లేకుండా సరైన పరిహారం దక్కకుండా అన్యాయానికి గురైనవారందరికీ పూర్తిగా న్యాయం చేస్తాం. చంద్రబాబును ఎన్నిమార్లు అడిగినా ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టడం లేదని ఆర్యవైశ్య సోదరులు బాధపడుతున్నారు. ఆ సోదరులు ఇక ఎవరిదగ్గరికీ పోవలసిన పనిలేదు. అధికారంలోకి మనమే వస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ స్థాపిస్తాం. మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలని మైనారిటీ సోదరులు అడుగుతున్నారు. 2019లో కురుక్షేత్ర యుద్ధం. దానికన్నా ముందు 2018లో వైఎస్సార్సీపీకి ఒక ఎమ్మెల్సీ సీటు రానుంది. ఆ వచ్చే ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాలకు చెందిన ముస్లిం సోదరుడికే ఇస్తానని మాట ఇస్తున్నా. కేశవరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. చంద్రబాబు చొక్కాను, ఆదినారాయణరెడ్డి నిక్కరును ఊడదీస్తాం. కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం. కేసులన్నీ తిరగదోడతాం. అగ్రిగోల్డ్ బాధితులకు కూడా గతంలో హామీ ఇచ్చా. అగ్రిగోల్డ్ బాధితులైనా, కేశవరెడ్డి బాధితులైనా మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇవ్వాల్సిన వన్నీ పూర్తిగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత మోసం చేసిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో, వాళ్ల చొక్కాలు, నిక్కర్లు ఎలా ఇప్పించాలో ప్రభుత్వం చూసుకుంటుంది. నంద్యాలలో మీరు ఇచ్చే ఆశీస్సులు రేపటి మన విజయానికి పునాది కావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం : ఇవాళ చంద్రబాబు దగ్గరుండి డబ్బులు, పదవి ఆశచూపించి కొనుగోలు చేస్తున్నాడు. ఇటువంటి కలియుగ రాక్షసుడిని హతమార్చేందుకు మీరంతా సవ్యసాచులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నంద్యాల ప్రజలు నడుం బిగించాలి. ఇవాళ వంచనకు విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతోంది. మన అభ్యర్థి శిల్పా మోహనరెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి విజ్ఞప్తి చేస్తున్నా. తోడుగా నిలబడాలని కోరుతున్నా. మన గుర్తు ఫ్యాన్. 9వ తారీఖు నుంచి 21 వరకు నేను నంద్యాలలోనే ఉంటా. ప్రతి వీధికీ వస్తా. ప్రతి ఊరుకూ వస్తా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయం ఎవరికీ జరగదు. రాజగోపాల్ అన్నకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం. చక్రపాణి అన్నకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చి న్యాయం చేస్తాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా : వైఎస్సార్సీపీకి ఓటు వేసినా జగన్ ఇప్పుడే సీఎం కాడు కదా అని తెలుగుదేశం పార్టీవారు ప్రచారం చేస్తున్నారట. ధర్మానికీ, న్యాయానికీ ఓటు వేద్దామా? లేక అధర్మానికీ, మోసానికీ ఓటు వేద్దామా అన్న దానిపైనే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో బహుశా జగన్ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంన్నర తర్వాత జరగబోయే కురుక్షేత్రానికి ఇది నాంది పలుకుతుంది. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆ వ్యత్యా సాన్ని నేను చూపుతున్నా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి నా దగ్గరకు వచ్చారు. నేను ఒకటే మాట చెప్పాను. చంద్రబాబు మాదిరిగా నేను రాజకీయాలు చేయలేను. న్యాయం, ధర్మం అనే రెండు కాళ్లపై మనం నిలబడాలి. చంద్రబాబు ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు మొహాన కొట్టు అన్నా అని అడిగా. అలా కొడితేనే ప్రజలు మనలను దీవిస్తారు. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. కొంచెం కష్టమనిపించినా చక్రపాణిరెడ్డి ఒక మంచి మనిషిగా బైటకొచ్చాడు. ఇదిగో.. స్పీకర్ ఫార్మాట్లో కౌన్సిల్ చైర్మన్‌కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను మీరే పంపించండి అని అన్నాడు. పులి అంటారో సింహం అంటారో మీయిష్టం.. ఎన్నికలొస్తేనే ముస్లింలు గుర్తొస్తారా? ముస్లిం మైనారిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్నదల్లా కపట ప్రేమేనని, ఆయనకు వారి పట్ల ఎలాంటి ఆదరాభిమానాలు లేవని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నంద్యాలకు ఉప ఎన్నికలొచ్చేటప్పటికి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఆయన మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కూడా ఒక ముస్లిం ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో లేనే లేరు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేక పోవడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. అది ఒక్క చంద్రబాబు హయాంలో మాత్రమే జరుగుతోంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ఎమ్మెల్సీని చేసి మూడో రోజే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఒక ముస్లింను ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుందామన్న ఆలోచనే చేయలేదు’ అని అన్నారు. నంద్యాలకు లంచాల పథకాలు ‘‘నంద్యాల ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి.’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. నంద్యాలకు ప్రకటించిన పథకాలలో దాగి ఉన్న అవినీతిని ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఏ పథకంలో ఏం కుంభకోణం జరుగుతుందో వివరించారు. ఇళ్లు, ట్రాక్టర్లు ఇలా ప్రతి పథకంలోనూ అవినీతి దాగి ఉందన్నారు. ఉప ఎన్నికల కోసమే నంద్యాలలో పెన్షన్ల సంఖ్యను పెంచారని చెప్పారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం ‘‘ఇవాళ నంద్యాలలో జరుగుతోన్నది ధర్మానికి,అధర్మానికి మధ్య, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు జరుగుతున్న యుద్ధమిది.’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ పోటీపెట్టబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మొత్తం కేబినెట్ అంతా రోడ్లపైకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని తిప్పి చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని జగన్ పిలుపునిచ్చారు. -
బెదిరింపులకు ప్రజల ఓట్లు పడవు
-
నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక పరిణామం
-
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు..
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల విజయనగరం టౌన్: అక్రమాలతో గెలవాలనుకుంటున్న ‘చంద్రబాబు అండ్ కో’కు నంద్యాల ప్రజలు బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల పాటు అన్ని సామాజికవర్గాలతో కలిసి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించామన్నారు. సోమవారం నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. శిల్పా మోహన్‌రెడ్డి నిబద్దత, చిత్తశుద్ధి గల నాయకుడన్నారు. ఆయన గెలుపు సామాజిక అవసరం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తే నాయకులు, అధికారులను రోడ్డుపైనే నిలదీస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే అధికారులు బహిరంగంగా తెలియజేయాలని, అనవసర నిందలు పడవద్దని సూచించారు. బాడంగి మండలం పినపెంకికి చెందిన 16 మంది అర్హులకు గృహ నిర్మాణ బిల్లులు నిలపివేశారని, ఇదే విషయమై తాము జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించామని చెప్పారు. అర్హులకు నిధులు మంజూరు చేయకపోతే జిల్లా గృహ నిర్మాణశాఖ కార్యాలయం వద్ద త్వరలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల పనితీరు బట్టి 50 ఏళ్లకే ఇంటికి పంపించే ప్రభుత్వ ఆలోచన విచారకరమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు నేటికీ ఇబ్బందులు పడుతున్నా, కనీసం సౌకర్యాలు కల్పించకపోగా ఉద్యోగుల కుదింపునకు ఆలోచన చేయడం తగదన్నారు. -
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
కర్నూలు: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల కమిషన్ గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు. -
‘టీడీపీలోకి వెళ్లినా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటోనే’
కర్నూలు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ గురువు అని, తాను టీడీపీలోకి వెళ్లినా ఇంట్లో ఉన్నా ఫోటో వైఎస్ఆర్దేనని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతాలు, జగన్ పనితీరు తనను ఆకర్షించాయన్నారు. టీడీపీలో ఉండటం వల్ల కార్యకర్తలు నలిగిపోయారని, నంద్యాల టీడీపీలో మూడు గ్రూపులయ్యాయని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పార్టీని వీడాలని కార్యకర్తలంతా తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. నిరంతరం ఘర్షణ వాతావరణం మంచిదికాదనే భావన వ్యక్తం చేశారని, భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చాక విభేదాలు మరింత పెరిగాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పార్టీ మారినవారు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే కాదని, ప్రజల వ్యతిరేకతను చవిచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం లేదని, పవర్ పాలిటిక్స్‌కు తాను చాలా దూరమని శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీకి శిల్పా మోహన్ రెడ్డి గుడ్ బై
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోమవారం తన అనుచరులతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 14న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. శిల్పా నిర్ణయంతో నంద్యాలలో టీడీపీకి ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. టీడీపీలో తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించలేదన్నారు. దీంతో తమ కార్యకర్తలతో చర్చించన తర్వాతే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. -
'నంద్యాల అభ్యర్థిని చంద్రబాబే నిర్ణయిస్తారు'
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా నంద్యాల అసెంబ్లీ సీటు తమదంటే తమదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. నంద్యాల టిక్కెట్ విషయంపై మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వేగంగా పావులు కదిపారు. శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని ఆమె తెలిపారు. మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు శిల్పామోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో రెండు, మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది. -
'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం'
హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి, తన సోదరుడితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఇటీవలే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వల్ల తనకు సమస్యలు ఎదరవుతున్నాయని తన గోడు వెళ్లబోసుకున్నారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదుచేశారు. భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా అక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. తామిద్దరిని టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
మాజీమంత్రికి మాతృవియోగం
పెద్దముడియం(వైఎస్సార్ జిల్లా): పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మాతృమూర్తి వెంకట లక్ష్మమ్మ(75) గురువారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈమెకు నలుగురు కుమారులు ఉండగా పెద్దకుమారుడు గోపాల్‌రెడ్డి, నాలుగో కుమారుడు ప్రతాప్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. రెండో కుమారుడు శిల్పామోహన్‌రెడ్డి, మూడో కుమారుడు శిల్పా చక్రపాణిరెడ్డి (ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు) రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. కుమారులు ఊరు వదిలి వెళ్లినప్పటికి వెంకటలక్షుమ్మ, ఆమె భర్త చెన్నారెడ్డిలు స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌కు తీసుకె ళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఆమె అంత్యక్రియలు కొండసుంకేసులలో జరుగనున్నాయి. -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన నేతలు పార్టీలో ఉండటంతో ఎవరి నాయకత్వంలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వరకు మాజీమంత్రి ఫరూక్ నాయకత్వంలో పార్టీ కొనసాగేది. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డిల మధ్యే ఐక్యత అంతంత మాత్రంగా ఉంటే ఎస్పీవై రెడ్డి చేరడంతో పార్టీలో మరింత గందరగోళం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీమంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడిగా మరో స్థానిక నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల శెట్టి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తమను ఓడించిన ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకు రావడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమకు సహకరించని పెసలకు మద్దతు ఇవ్వడంపై ఫరూక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతున్నదని ఏ స్తంభంతో ఎలాంటి సమస్య తలెత్తుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. -
మాజీ మంత్రి శిల్పా ఇళ్లలో 66 లక్షలు స్వాధీనం
-
శిల్పా ఇళ్లలో 66 లక్షలు స్వాధీనం
కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి చెందిన నివాసాలలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న 66 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలో ఉన్న శిల్పా టవర్స్, శిల్పా హైట్స్ తదితర అపార్ట్మెంట్లలో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. అక్కడ ఓటర్లకు పంచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 66 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. శిల్పాకు ముఖ్య అనుచరులైన ఇద్దరు వ్యక్తుల వద్ద ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకుడి అనుచరుల వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం ఇదే మొదటిసారని అంటున్నారు. -
ఫలించిన భూమా వ్యూహం
నంద్యాల, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో రోజు రోజుకూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏళ్ల తరబడి టీడీపీ, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసినా పట్టించుకునే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు, గ్రామీణులు వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం నాయకులు, కార్యకర్తలను తన వైపునకు తిప్పుకోవాలనుకున్న ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి రాజకీయంగా పెద్ద షాక్ తగిలింది. రాజకీయంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి నాయకులకు పెద్ద పీట వేస్తూ, అసంతృప్తి వర్గాన్ని అవమాన పరుస్తూ ముందుకు సాగారు. అలాంటి వారికి భూమా అండగా నిలిచారు. గ్రామంలో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుంటానని హామీనిచ్చారు. దీంతో గ్రామ నాయకులు నాయకులు శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి, పుల్లారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణ, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, జీవరత్నం తదితరులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఎంపీ ఎస్పీవెరైడ్డిని, భూమానాగిరెడ్డిని గ్రామానికి ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. ఐదు దశాబ్ధాల నుంచి గ్రామంలో ఒకే వర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకుల కనుసన్నల్లో పోలింగ్ జరిగేది. అధికార పార్టీకి అండగా ఉంటూ గ్రామంలో ఇతరులను ఎదగనివ్వకుండా చేస్తుండటంతోనే వైఎస్సార్సీపీలో చేరుతున్నామని శివకుమార్‌రెడ్డి, బొజ్జారెడ్డి తదితరులు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భూమానాగిరెడ్డి, ఎస్పీవెరైడ్డికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇప్పటి వరకు గ్రామంలో మెజార్టీ వస్తుందని ఆశపడిన శిల్పాకు ఇది పెద్ద దెబ్బ. గ్రామంలో 1600ఓట్లు ఉంటే 1500 ఓట్లు పోలవుతాయి. అందులో 100 నుంచి 200 మధ్యన ఇతర పార్టీల అభ్యర్థులకు పోలయ్యేలా గ్రామ కాంగ్రెస్ నాయకులు వ్యూహం రూపొందించుకున్నారు. వెయ్యి నుంచి 1200మధ్యన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేసేవారు. అయితే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లు ఈ సారి వైఎస్సార్సీపీకి పోలవుతాయని గ్రామ నాయకులు బాహటంగానే పేర్కొంటున్నారు. గ్రామంలో ఏళ్లతరబడి ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు కూలీలు ఎమ్మెల్యే శిల్పాపై ఆగ్రహంతో ఉన్నారు. -
పేదల స్థలాలతో పెద్దల వ్యాపారం !
నంద్యాల, న్యూస్‌లైన్: నిరు పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ స్థలాల్లో అనర్హులు పాగా వేశారు. బినామీ పేర్లతో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పట్టాలు పొంది వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి పదేళ్లలో వైఎస్సార్‌నగర్, నందమూరినగర్, ఊడుమాల్పురం, చాపిరేవుల, అయ్యలూరు మెట్ట, రైతునగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 12 వేల మందికి ఇళ్ల స్థలాలను అందజేశారు. వీరిలో సుమారు 7 వేల మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఉండటంతో కొందరు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఆక్రమించుకుని విక్రయాలకు శ్రీకారం చుట్టారు. శివారు ప్రాంతాల్లో సెంట్ ధర రూ.5 లక్షల వరకు ఉంది. ఈ ప్రాంతాల్లో మొదట స్థలాలు పొందిన అనర్హులు సెంట్ రూ. 2 లక్షల వరకు అగ్రిమెంట్ ప్రకారం అమ్మేస్తున్నారు. ఈ స్థలాలతో కొందరు నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 75 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. పట్టణంలోని వైఎస్సార్ నగర్లో దాదాపు 8 వేల ఇళ్లను నిర్మించి పేదలకు అందజేస్తే కేవలం 900 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. అలాగే నంద్యాల పట్టణ శివార్లలోని రైతునగర్‌లో దాదాపు 400 ఇళ్లు నిర్మించారు. ఇందులో 200 ఇళ్ల స్థలాలను అనర్హులు దక్కించుకుని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ఇచ్చిన పేర్ల జాబితాను రెవెన్యూ అధికారులు విచారించకుండా స్థలాలను మంజూరు చేశారు. దీంతో పట్టణంలోని దాదాపు 10 వేల మందికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీకి జై కొట్టిన మాజీ కౌన్సిలర్లకు, ఉద్యోగ వర్గాలకు ఇళ్ల స్థలాలను ఇచ్చారే తప్ప పేదలకు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని స్థానిక తహశీల్దార్ శివరామిరెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత 300 మందికి మించి స్థలాలు ఇవ్వలేదని అంతకు ముందు ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. -
మేమింతే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రం విడిపోతుందన్న బాధ పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రజలను కలచివేస్తోంది. స్వచ్ఛందంగా కదం కదుపుతూ.. గళం విప్పుతూ నిరసన బాట పట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా అలుపెరగని పోరు సాగిస్తుండగా.. కాంగ్రెస్, టీడీపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ బంద్‌కు పిలుపునివ్వగా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా విభజనపై ఉద్యమించాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా చేతులెత్తేశారు. టీడీపీ మొక్కుబడి ఆందోళనలతో సరిపెట్టుకుంది. కేంద్రం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం షరా మామూలైంది. తాజాగా గురువారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎన్నిసార్లు ఈ రాజీ‘డ్రామా’లు అడతారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. కనీస మద్దతిచ్చే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడినా.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచి తమ పంథా మారదని చాటుకున్నారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా మాట మాత్రమైనా మాట్లాడకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇద్దరు, ముగ్గురు నేతలు మినహా.. జిల్లాలో ముఖ్య నేతలెవరూ బంద్‌పై ఆసక్తి కనబర్చలేదు. కార్యకర్తలే సొంత ఖర్చుతో బైక్ ర్యాలీలు నిర్వహించి మమ అనిపించారు. కేవలం ప్రచారం కోసమే తూతూమంత్రంగా కార్యక్రమం పూర్తయిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉద్యోగ, విద్యార్థి సంఘాలకు కనీస మద్దతు ప్రకటించకపోవటం విమర్శలకు తావిస్తోంది.