పెద్దముడియం(వైఎస్సార్ జిల్లా): పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి మాతృమూర్తి వెంకట లక్ష్మమ్మ(75) గురువారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఈమెకు నలుగురు కుమారులు ఉండగా పెద్దకుమారుడు గోపాల్‌రెడ్డి, నాలుగో కుమారుడు ప్రతాప్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.
రెండో కుమారుడు శిల్పామోహన్‌రెడ్డి, మూడో కుమారుడు శిల్పా చక్రపాణిరెడ్డి (ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు) రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు. కుమారులు ఊరు వదిలి వెళ్లినప్పటికి వెంకటలక్షుమ్మ, ఆమె భర్త చెన్నారెడ్డిలు స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌కు తీసుకె ళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఆమె అంత్యక్రియలు కొండసుంకేసులలో జరుగనున్నాయి.
మాజీమంత్రికి మాతృవియోగం
Published Thu, Oct 29 2015 10:06 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement
Advertisement