
శిల్పా ఇళ్లలో 66 లక్షలు స్వాధీనం
కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డికి చెందిన నివాసాలలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న 66 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలో ఉన్న శిల్పా టవర్స్, శిల్పా హైట్స్ తదితర అపార్ట్మెంట్లలో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. అక్కడ ఓటర్లకు పంచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 66 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.
శిల్పా మోహన్రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. శిల్పాకు ముఖ్య అనుచరులైన ఇద్దరు వ్యక్తుల వద్ద ఈ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకుడి అనుచరుల వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం ఇదే మొదటిసారని అంటున్నారు.