టీడీపీకి శిల్పా మోహన్‌ రెడ్డి గుడ్‌ బై | silpa mohan reddy to join ysr congress party | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

Published Mon, Jun 12 2017 7:32 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

silpa mohan reddy to join ysr congress party

కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత  శిల్పా మోహన్‌ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.  త్వరలో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శిల్పా మోహన్‌ రెడ్డి సోమవారం తన అనుచరులతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 14న ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.

కార్యకర్తల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిల్పా మోహన్‌ రెడ్డి తెలిపారు. శిల్పా నిర్ణయంతో నంద్యాలలో టీడీపీకి ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. టీడీపీలో తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎదుర్కొంటున్న  సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించలేదన్నారు. దీంతో తమ కార్యకర్తలతో చర్చించన తర్వాతే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా మోహన్‌ రెడ్డి తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement